తమిళంలో రెండు చిత్రాలు...
చమక్ చల్లో, ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించిన మలయాళ భామ కేథరిన్ యాక్ట్ చేసిన ‘పైసా’ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలు కమిట్ కాలేదు. అయితే తమిళంలో మాత్రం రెండు చిత్రాలు అంగీకరించిందని సమాచారం.
కార్తీ సరసన ‘కాళీ’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించిన కేథరిన్ తాజాగా అథర్వ సరసన ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మురుగదాస్ దగ్గర సహాయ దర్శకునిగా చేసిన సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ రెండు చిత్రాల్లోనూ కేథరిన్‌వి మంచి పాత్రలే అని, తప్పకుండా ఆమె కెరీర్‌కి ఉపయోగపడే చిత్రాలు అవుతాయని కోలీవుడ్ టాక్.