దాసరి151వ సినిమాలో నాయికగా...
‘తాతా మనవడు’తో మొదలై.. 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు దాసరి నారాయణరావు. ఇది గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రికార్డ్ బ్రేక్ అవ్వడం చాలా కష్టం. అయితే... ఇప్పటికీ దాసరి రిలాక్స్ అవ్వలేదు. తన 151వ చిత్రాన్ని సెట్స్‌కి తీసుకెళ్లనున్నారు. తాతా మనవళ్ల కథతో దర్శకునిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తన 151వ చిత్రానికి కూడా తాతా మనవళ్ల నేపథ్యాన్నే ఎంచుకోవడం విశేషం. తమిళ సూపర్‌హిట్ ‘మంజ పై’ ఈ చిత్రానికి మాతృక. ఈ నెల 24 నుంచి ఈ సినిమా నిరవధిక చిత్రీకరణ మొదలుకానుంది. ఇందులో దాసరి తాతగా, మంచు విష్ణు మనవడిగా నటిస్తుండటం విశేషం. విష్ణుకు జోడీగా కేథరిన్‌ని తీసుకున్నారు దాసరి. చక్రి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.