ప్రపంచ చెస్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌పై విదిత్‌ విజయం  | Vidith's victory over Carlson | Sakshi
Sakshi News home page

ప్రపంచ చెస్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌పై విదిత్‌ విజయం 

Published Thu, Feb 23 2023 3:25 AM | Last Updated on Thu, Feb 23 2023 3:25 AM

Vidith's victory over Carlson - Sakshi

చెన్నై: ప్రొ చెస్‌ లీగ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరా తి గొప్ప ఫలితం సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)పై విదిత్‌ గెలుపొందాడు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియన్‌ యోగిస్‌ జట్టు తరఫున పోటీపడుతున్న విదిత్‌ బ్లిట్జ్‌ గేమ్‌లో 58 ఎత్తుల్లో కెనడా చెస్‌బ్రాస్‌ జట్టు తరఫున ఆడుతున్న కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీని లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కార్ల్‌సన్‌ను ఓడించిన నాలుగో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ కావడం విశేషం. ప్రజ్ఞానంద, గుకేశ్, ఇరిగేశి అర్జున్‌ కూడా ఈ నార్వే దిగ్గజంపై వివిధ టోరీ్నలలో గెలుపొందారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement