ఆమె ఎవరని అడుగుతారేమో
ఏమని చెప్పాలి!?
ఆమె అక్షరం అని చెప్పనా..
కష్ట జీవుల కన్నీటి వ్యథ అనాలా..
ఆమె ఓ ధిక్కార స్వరం అని చెప్పనా!?
ఏమని చెప్పాలి?
అణిచివేతల సాచివేతల రాజ్యంలో
ఆమె ఓ పోరాట జ్వాల..
చీకటి కొనల మీద చిక్కటి వెలుగు తాను..
ఆమె ఎవరని అడుగుతారేమో!
ఆమె అన్నార్తుల
ఆకలి కేకల పోరు నాదమని..
గొంతు లేని ప్రజల గొంతుకని..
ఆమె అక్షరం తెలియని వాళ్ల
అడుగు జాడల్లో అక్షర దివిటని..
ఆమె ప్రజా పోరు దారుల్లో
ఓ అడుగు జాడని చెప్పగలను..
ఆమె గొంతు ఎందుకు
నొక్కుతున్నారని అడిగితే మాత్రం
ఆమె శోషితుల పక్షమై నిల్చినందుకు..
ఆమె పౌర హక్కులు అడిగినందుకు..
ఆమె స్త్రీ సమానత్వం కోరినందుకు..
ఆమె జాతి విముక్తి నినదించినందుకు..
ఆమె స్వేచ్ఛను కోరినందుకే కదా!
రాజ్య ద్రోహం అనే రాజ్య బహుమానం!! – వంగల సంతోష్ (అరుంధతీ రాయ్‌పై పెట్టిన కేసును ఖండిస్తూ)
ఇవి చదవండి: సింగరేణి వివాదం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment