Arundhati Roy
-
వాక్ స్వాతంత్య్రంపై విచారణా?
కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు ఆరోపణలు వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ‘ఉపా’ చట్టం కింద అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. భారత్‌లో విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. అందుకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ, అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. నేడు మనం విశ్వ గురువులమని చెప్పుకొంటున్నప్పుడు అరుంధతీ రాయ్ పట్ల ఈ నిర్దయాపూరితమైన వ్యవహారశైలి మన గురించిన బాధాకరమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా?మహాత్మా గాంధీ, అందునా మన జాతిపిత... ఆయన చెప్పిన విషయాలను మనం ఎంత తరచుగా గుర్తు చేసుకుంటున్నాం? అంతకన్నా కూడా ఎంత తరచుగా మన ప్రభుత్వాలు ఆయన ఆకాంక్షలకు కట్టుబడి ఉంటున్నాయి? ఇదేమీ అలంకారిక ప్రశ్న కాదని మీరు తొందరలోనే గ్రహిస్తారు. నిజానికి, మనకింకా మనస్సాక్షి అన్నది మిగిలి ఉంటే బహుశా అదొక ఇబ్బందికరమైన మనోస్థితి కావచ్చు!1922 మార్చి 18న ‘యంగ్ ఇండియా’ పత్రికలో... ప్రభుత్వాలకు, మన పైన అధికారం కలిగి ఉన్న వారికి తన వైఖరి ఏమిటో గాంధీ వివరించారు. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అని రాశారు. ‘‘ఒక వ్యక్తికి – ఆ వ్యక్తి హింసను తలవనంత వరకు, హింసను ప్రోత్సహించనంత వరకు, లేదా హింసను ప్రేరేపించనంత వరకు – తన అయిష్టతను పూర్తిగా వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఉండాలి’’ అన్నారు. మన ప్రభుత్వం శిలాక్షరాలుగా చెక్కించి ప్రతి ఒక్క మంత్రి కార్యాలయంలో ప్రముఖంగా కనిపించేలా ఉంచాల్సిన మాటలివి. ఆ మాటలు ఈ కాలానికీ ఎందుకు సరిపోతాయో వివరిస్తాను. కశ్మీర్ అన్నది భారతదేశంలో ‘అంతర్భాగమా’ అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ఆరోపణలపై ‘ఉపా’ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక) చట్టం కింద అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు తాజాగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు – ఇందులో సుదీర్ఘమైన పదేళ్ల కాలం మోదీ ప్రభుత్వంలోనిది – ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవటం, లేదా తీసుకోవటం అవసరమని భావించకపోవటం అనే వాస్తవం ఎన్నో విషయాలను చెబుతోంది. ‘ఇప్పుడు ఎందుకు?’ అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. భారతదేశంలో ప్రముఖులు ఒకరు రాష్ట్ర విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. ‘‘ద్రవిడియన్లు స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్ చేస్తున్నారు... దక్షిణాది రాష్ట్రాలకు మాకు ప్రత్యేక దేశం కావాలి’’ అన్నారు. ఆ మాటకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. ఆయన మాటల్ని దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించలేదు. నిజమే, అన్నాదురై అలా కోరటం అభ్యంతరకరం, అవాంఛనీయం కావచ్చు. కానీ ఆరు దశాబ్దాల క్రితమే భారతదేశం ఆన్నాదురై మాటల్ని ఆయన వాక్ స్వాతంత్య్రంలో భాగంగా అంగీకరించింది. ఆ కాలంలోనే వివాదాస్పద ఉద్దేశాన్ని వ్యక్తం చేయటాన్ని సైతం వాక్ స్వాతంత్య్రంలోని ఒక హక్కుగా మనం గుర్తించాం. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అనే గాంధీజీ ప్రసిద్ధ ప్రకటనను గౌరవించాం. ప్రపంచం మనకు ఏదైనా నేర్పించిందీ అంటే అది నేడు మరింత సహనాన్ని, సర్దుబాటును కలిగి ఉండమనే. బ్రిటన్‌లోని స్కాటిష్ జాతీయవాదులు, కెనడాలోని పార్తీ కెబెక్వాలు, లేదా స్పెయిన్‌లోని కెటలాన్‌లు ఆయా దేశాల నుంచి విడిపోవటం కోసం చేసిన వేర్పాటు ఉద్యమాలు గౌరవనీయమైనవిగా, దేశ వ్యతిరేకమైనవి కానివిగా పరిగణన పొందటం అంటే... పరిణతి చెందిన వివేకవంతమైన ప్రజాస్వామ్యాలు అలాంటి వేర్పాటువాద ఉద్యమ పిలుపులను దేశ వ్యతిరేకమైనవిగా చూడకూడదని సూచించటమే కదా? ఎలా మనం వివేచన గల సహనశీలత నుండి అనాలోచితమైన, ఆమోదయోగ్యం కాని అసహనంలోకి జారిపోయాం?అందుకు కారణం... వేర్పాటు గురించి మాట్లాడి, మనల్ని కలవరానికి గురి చేసినవారు అరుంధతీ రాయ్ కావటమేనా? అందుకు కారణం... మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శ చేస్తున్న ఆమె గొంతుక ఎదురులేనిదిగా, నమ్మదగినదిగా ఉండటమేనా? అందుకు కారణం... ఎదుర్కోడానికి మనం ఇష్టపడని సందేహాలను లేవనెత్తటం ద్వారా ఆమె మన మనసు లోతుల్లో లేని పైపై మనశ్శాంతిని హరించటమేనా?అరుంధతీ రాయ్‌ని మన అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ (రష్యా రచయిత)లా భావించాలి కానీ, విస్మృత సోవియెట్ యూనియన్ ఆయన పట్ల ప్రవర్తించిన రీతిలో ఆమె పట్ల మనం ఉండకూడదు. ఆమె మన ఉత్తమ రచయితలలో ఒకరు. ప్రపంచానికి కూడా ఆమె ఇలాగే తెలుసు. మనం నిస్సిగ్గుగా మర్చిపోయిన సల్మాన్ రష్దీ తర్వాత అంతటి ప్రసిద్ధురాలైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్. ఆమె పట్ల ఈ అనాగరిక, అధికార దర్ప, అనాలోచిత ప్రవర్తన... ప్రపంచంలోని అతి పెద్దదైన ప్రజాస్వామ్యానికి, అంతకుమించి ప్రజాస్వామ్యాలకే మాతృమూర్తి అయిన ఇండియాకు చెడ్డ పేరు తెస్తుంది. నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలంటే అంతే. నేడు మనం విశ్వ గురువులమని, దక్షిణార్ధ గోళానికి నాయకులమని, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తగిన వాళ్లమని చెప్పుకొంటున్నాం. ఇటీవల ప్రధానమంత్రి తను తిరిగి ఎన్నికవటం ‘యావత్ ప్రపంచ ప్రజాస్వామ్య విజయం’ అని అన్నారు. అలాంటప్పుడు అరుంధతీ రాయ్ అభిప్రాయం పట్ల నిర్దయాపూరితమైన వ్యవహార శైలి మన గురించిన బాధాకరమైన, తప్పించుకోలేని సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకై మీరే చెప్పుకొమ్మని వదిలేస్తున్నాను. బదులుగా, నాకు ఎలా అనిపిస్తోందో చెబుతాను. మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలు, పౌరహక్కుల పట్ల జీవితకాలం గర్వంగా గడిపాను. వాటినెవరూ మన నుంచి తస్కరించలేరన్నది సత్యం. ఇందిరాగాంధీ ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకున్న ఉపశమనంలో ఉన్నప్పుడు అవి మన చేతుల్లోంచి జారిపోతాయా? అవును, అరుంధతీ రాయ్‌పై విచారణ తప్పుడు ఫలితంతో ముగిస్తే!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆమె ఎవరంటే...!?
ఆమె ఎవరని అడుగుతారేమో ఏమని చెప్పాలి!?ఆమె అక్షరం అని చెప్పనా..కష్ట జీవుల కన్నీటి వ్యథ అనాలా..ఆమె ఓ ధిక్కార స్వరం అని చెప్పనా!?ఏమని చెప్పాలి?అణిచివేతల సాచివేతల రాజ్యంలో ఆమె ఓ పోరాట జ్వాల..చీకటి కొనల మీద చిక్కటి వెలుగు తాను..ఆమె ఎవరని అడుగుతారేమో!ఆమె అన్నార్తులఆకలి కేకల పోరు నాదమని..గొంతు లేని ప్రజల గొంతుకని..ఆమె అక్షరం తెలియని వాళ్లఅడుగు జాడల్లో అక్షర దివిటని..ఆమె ప్రజా పోరు దారుల్లోఓ అడుగు జాడని చెప్పగలను..ఆమె గొంతు ఎందుకునొక్కుతున్నారని అడిగితే మాత్రం ఆమె శోషితుల పక్షమై నిల్చినందుకు..ఆమె పౌర హక్కులు అడిగినందుకు..ఆమె స్త్రీ సమానత్వం కోరినందుకు..ఆమె జాతి విముక్తి నినదించినందుకు..ఆమె స్వేచ్ఛను కోరినందుకే కదా!రాజ్య ద్రోహం అనే రాజ్య బహుమానం!! – వంగల సంతోష్ (అరుంధతీ రాయ్‌పై పెట్టిన కేసును ఖండిస్తూ)ఇవి చదవండి: సింగరేణి వివాదం.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
బీజేపీ నియంతృత్వాన్ని ఉద్యమంలా తీసుకెళ్తోంది
సుందరయ్య విజ్ఞానకేంద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వాన్ని కూడా ప్రత్యేక ఉద్యమంలా తీసుకువెళ్తోందని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ ఆరోపించారు. మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకుడు కె.బాలగోపాల్ 13వ స్మారకోపన్యాసాన్ని ఆదివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. వేదిక కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, సుధ అధ్యక్షతన జరిగిన ఈ సభకు అరుంధతీరాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలో కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు నియంతృత్వ వి«ధానాలకు కులమతాలను జోడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పరోక్ష భాగస్వామి కావడం వల్లే 8ఏళ్లలోనే అదానీ 8 బిలియన్ డాలర్లనుంచి 139 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగాడన్నారు. భవిష్యత్‌లో ఇదే వరుసలో అమిత్‌షా కుమారుడు కూడా రానున్నాడని చెప్పారు. అదానీని ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా ఫోకస్ చేయడం కోసమే 2014లో మోదీ.. అదానీ విమానంలో వచ్చి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీఎండబ్ల్యూకి, ఎడ్లబండికి పోటీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. సామాజిక, విప్లవ శక్తులు మరింత ఎక్కువగా ప్రజల మధ్య పనిచేయాలని ఆకాంక్షించారు. ముస్లిం మహిళలను మరింత అణచివేసేందుకే హిజాబ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిఫ్టన్ డి రాజోరియో మాట్లాడుతూ... మోదీ ఫాసిజానికి ఫేస్‌లాంటి వాడన్నారు. ఆయన ప్రధాని అయ్యాక దేశంలో కార్మికుల హక్కులు మరింతగా అణచివేతకు గురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో పీయూసీఎల్ నాయకులు నిహిర్ దేశాయ్, హెచ్ఆర్ఎఫ్ నాయకులు జహా ఆరా, మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జీవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల్ రచించిన ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ అనే పుస్తకాన్ని అరుంధతీరాయ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది
న్యూఢిల్లీ: మన దేశంలో ప్రస్తుత పరిస్థితి అపసవ్య దిశలో కదులుతున్న విమానంలా ఉందని.. అది ఎప్పుడైనా ప్రమాదానికి దారి తీయొచ్చని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కవితలు, లేఖలతో సంకలనం చేసిన ‘వై డూ యూ ఫియర్ మై వే సో మచ్’ పుస్తకావిష్కరణ సభలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1960వ దశకంలో సంపద, భూమి పునఃపంపిణీ కోసం నిజంగా విప్లవాత్మక ఉద్యమాలు జరిగాయని.. ప్రస్తుత నాయకులు ఉచిత పథకాలతో ఓట్లకు గాలం వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల, నేను నా పైలట్ స్నేహితుడిని అడిగాను. 'మీరు ఒక విమానాన్ని వెనుకకు నడిపించగలరా?' అని. దానికి అతడు పెద్దగా నవ్వాడు. మన దేశంలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోందని నేను చెప్పా. మన నాయకులు విమానాన్ని రివర్స్‌లో ఎగురవేస్తున్నారు. ప్రతిదీ పడిపోతోంది. పతనం దిశగా పయనిస్తున్నామ’ని అరుంధతీ రాయ్ అన్నారు. ఎంత అవమానకరం? మన దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ కులం, వర్గం, లింగం, జాతి ఆధారంగా వేర్వేరుగా వర్తించబడతాయని పేర్కొన్నారు. ‘ఈ రోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 90 శాతం పక్షవాతం వచ్చి ఏడేళ్లుగా జైల్లో ఉన్న ఓ ప్రొఫెసర్ గురించి మాట్లాడేందుకు కలిశాం. ఇక మనం మాట్లాడాల్సిన పనిలేదు. మనం ఎలాంటి దేశంలో జీవిస్తున్నామో చెప్పడానికి ఇది చాలు.. ఇది ఎంత అవమానకరం’ అని అరుంధతీ రాయ్ అన్నారు. 90 శాతానికి పైగా శారీరక వైకల్యాలు కలిగి, వీల్‌చైర్‌ను ఉపయోగించే జిఎన్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, దేశంపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017లో జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. (చదవండి: జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి) సాయిబాబాను విడుదల చేయాలి: రాజా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ.. జిఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్స్, అర్బన్ మావోయిస్టులుగా ముద్ర వేసి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. శారీరక వైకల్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న తన భర్త పట్ల జైలులో అవమానవీయంగా ప్రవరిస్తున్నారని జీఎన్ సాయిబాబా సతీమణి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు కూడా ఆయనను అనుమతించలేదని వాపోయారు. (చదవండి: పత్రికా స్వేచ్ఛ.. నానాటికీ తీసికట్టు) -
ప్రభుత్వం అయితే మాత్రం!
‘నోరు లేనివాళ్లు ఉండరు. నోరు మెదపని వాళ్లే ఉంటారు..’ అంటారు అరుంధతీ రాయ్. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు రాయ్. ప్రభుత్వం అయితే మాత్రం! మనకు అనంగీకారాలు ఉండకూడదా? మనం నోరెత్తకూడదా.. అని ప్రశ్నిస్తున్నారు. అరుంధతీ రాయ్ రచయిత్రి. 1997లో ఆమె రాసిన తొలి నవల ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’తోనే ఇప్పటికీ ఆమె గుర్తుకు వస్తారు. ముఖ్యంగా ఆమె ఉద్యమ రచయిత్రి. మార్పు కోసమే ఆమె చేసే ప్రతి రచనా, రాసే ప్రతి వ్యాసం, మాట్లాడే ప్రతి మాటా! ఆమెను గుర్తు చేసే అంతకుముందరి విషయం మరొకటి కూడా ఉంది. 1989లో ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే టీవీ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్‌గా ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డును 2016లో ఆమె ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు! దేశంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనాన్ని నిరసిస్తూ ఆమె అలా చేయడం కూడా రాయ్‌ని సామాజిక బాధ్యత స్వీకరించిన రచయిత్రిగా నిలబెట్టింది. తాజాగా ఆమె సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘‘పోరు జరుగుతున్నప్పుడు, ఆందోళన వ్యక్తం అవుతున్నప్పుడు, ప్రదర్శనల నినాదాలు మిన్నంటుతున్నప్పుడు, కొందరు చనిపోతున్నప్పుడు.. మౌనం వహించడం నేరం’’ అంటారు అరుంధతీ రాయ్. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నది కచ్చితంగా రైతు ఉద్యమం గురించే. నోరు విప్పని ప్రముఖుల గురించే. పౌరస్వేచ్ఛను, మానవ హక్కులను రాజకీయ నిర్ణయాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో ఒక సామాజిక, ఉద్యమ కార్యకర్తగా ఆమె నిరంతరం తన వ్యాసాలలో, ప్రసంగాలలో వివరిస్తూ ఉంటారు. అరుంధతి ప్రజానుకూలవాది. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె పార్లమెంటు బయట.. ‘ఏకవ్యక్తి విపక్షం’గా వ్యవహరిస్తున్నారు! ఆమెలో బెరుకుదనం ఉండదు. ఆమె మాటలో మృదుత్వం ఉండదు. మంచి అనుకున్నదాన్ని ఎంత బలంగా ప్రచారం చేస్తారో.. చెడు అనుకున్నదాన్ని అంత ఘాటుగా విమర్శిస్తారు. అరుంధతీ రాయ్ తండ్రి బెంగాలీ హిందువు. తల్లి మలయాళీ సిరియన్ క్రిస్టియన్. కలకత్తాలో ఉండేవారు. ఆమెకు రెండేళ్లప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రిని వదిలి తమ్ముడితో పాటు తల్లితో కేరళ వచ్చేసింది. తర్వాత కొన్నాళ్లు ఊటీలో అరుంధతి తాతగారి ఇంట్లో ఉంది ఆ కుటుంబం. అక్కడి నుంచి మళ్లీ కేరళకు. అరుంధతి చదువు కూడా ఆమె కుటుంబం లాగే ఒక చోట స్థిరంగా సాగలేదు. కొట్టాయంలో కొంత, నీలగిరులలో కొంత పూర్తయింది. ఢిల్లీ ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుంచి పట్టా తీసుకుంది. అక్కడే ఆమెకు సహ ఆర్కిటెక్ట్ గెరాడ్ డా కన్హాతో పరిచయం అయింది. ఇద్దరూ కొన్నాళ్లు ఢిల్లీలో, గోవాలో సహజీవనం చేశారు. తర్వాత విడిపోయారు. తిరిగి ఢిల్లీ వచ్చాక, 1984లో ఆమెకు ప్రదీప్ క్రిషన్ కలిశారు. ప్రదీప్‌కు సినిమాలు తీయాలని. ఈమెకు సమాజాన్ని మార్చాలని. ఇద్దరూ కలిసి సమాజాన్ని మార్చే సినిమా ఒకటి తీశారు. ‘మెస్సీ సాహిబ్’. దానికి అవార్డు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలానికే అరుంధతికి సినిమాలు, టీవీ సీరియళ్లు బోర్ కొట్టేశాయి. వాటిని వదిలేసి రకరకాల ఉద్యోగాలు చేశారు. ఏరోబిక్ క్లాసులు నడిపారు. ప్రదీప్‌తో విడిపోయారు. బాల్యంలోని తన జ్ఞాపకాలను రాయడం మొదలుపెట్టారు. ఆ జ్ఞాపకాలే చివరికి ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అయ్యాయి. -
అరుంధతి రాయ్‌పై విమర్శలు వెల్లువ
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతి రాయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణిజం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో కులరహిత సమాజాన్ని ఆకాంక్షించే మేధావులు అరుంధతి తీరును తప్పుబడుతున్నారు. ‘‘ఆజాదీ: ఫ్రీడం, ఫాసిజం, ఫిక్షన్’’పేరిట అరుంధతి రాయ్ రచించిన కొత్త పుస్తకం విడుదల సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిక్ ఎజ్ వీడియో కాన్పరెన్స్తో ద్వారా ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న కుల వ్యవస్థను, అమెరికాలోని జాతి వివక్ష భావనలను ఒకే విధంగా చూస్తారా అని ప్రశ్నించారు. (చదవండి: ‘మనం బుల్లెట్లు ఎదుర్కోవడానికి పుట్టలేదు’) అదే విధంగా తన తల్లిదండ్రుల మతతత్వ గుర్తింపు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘మిమ్మల్ని మీరు బ్రాహ్మిణ్ అనుకుంటున్నారా’’అని ప్రశ్నలు సంధించారు. ఇందుకు స్పందించిన అరుంధతీ రాయ్.. ‘‘మా అమ్మ క్రిస్టియన్. మా నాన్న బ్రహ్మ సమాజంలో సభ్యులు. అంతేగానీ ఆయన బ్రాహ్మిణ్ కాదు. నిజానికి తర్వాత ఆయన క్రిస్టియన్‌గా మారిపోయారు. ఇక కుల వ్యతిరేక ఉద్యమం అనగానే అందరూ బ్రాహ్మణిజం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అయితే బ్రాహ్మణుల గురించి కాదు. కుల వ్యవస్థ గురించి మాట్లాడే వారు ఈ పదాన్ని వాడతారు. కాబట్టి బ్రాహ్మణిజం పాటించే బ్రాహ్మణుల గురించి మాత్రమే కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతి వివక్ష గురించి మాట్లాడాల్సి వస్తే.. కులం ఓ వ్యక్తికి తమకిష్టమైన మతాన్ని పాటించే అవకాశం ఇచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: మైనారిటీలు మారారు.. గుర్తించారా?) ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పలువురు మేధావులు అరుంధతి వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ‘‘బ్రాహ్మణిజం బ్రాహ్మణుల గురించి కాదని అరుంధతి రాయ్ చెబుతున్నారు. మరి బ్రాహ్మణిజం అంటే ఏమిటి? కుల వ్యవస్థను నిర్వచించడానికి ఇంతకంటే మంచి పదం ఉంటే మీరే సూచించండి’’ అని తేజస్ హరాద్ అనే నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘తను బ్రాహ్మిణ్ కాదంటూ అరుంధతి రాయ్ అబద్ధాలు చెబుతున్నారు. ఆమె హావభావాలు, గొంతు మారిన విధానం ఎవరైనా గమనించారా? నయ వంచనకు పరాకాష్ట’’ అంటూ మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరుంధతి నిజంగానే బ్రాహ్మిణ మహిళా? చాలా మంది అరుంధతిని బ్రాహ్మిణ్ అంటూ ఉంటారు. అయితే తాను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దానిని కాదని, తన తండ్రి బ్రహ్మ సమాజం సభ్యుడని, తన తల్లి మలయాళీ సిరియన్ క్రిస్టియన్ అని గతంలో అనేకసార్లు చెప్పారు. అయినప్పటికీ ఆమెపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. -
‘మనం బుల్లెట్లు ఎదుర్కోవడానికి పుట్టలేదు’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ఆర్పీ అనేది ఎన్ఆర్సీకి డేటాబేస్‌గా ఉపమోగపడుతుందని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ అన్నారు. దీన్ని దేశప్రజలు వ్యతిరేకించాలని ఆమె తెలిపారు. అరుంధతి రాయ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుంధతి రాయ్ మాట్లాడుతూ.. ఎన్ఆర్సీని ముస్లీంలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిందని ఆమె మండిపడ్డారు. ఎన్ఆర్పీ పేరుతో అధికారులు మీ ఇళ్లలోకి వచ్చి మీకు సంబంధించిన పేరు, ఫోన్‌నంబర్, ఆధార్‌కార్డు నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లను అడిగి నమోదు చేసుకుంటారు. ఆ సమయంలో అధికారులకు మీకు సంబంధించిన సరైన వివరాలను వారికి చెప్పవద్దన్నారు. మనం బుల్లెట్లు ఎదుర్కొవడానికి ఇక్కడ పుట్టలేదని అరుంధతి రాయ్ ధ్వజమెత్తారు. కాగా రాంలీల మైదానంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ అన్నీ అబద్దాలు చెప్పారని ఆమె తీవ్రంగా విమర్శించారు. మోదీ ఎన్ఆర్సీ గురించి ఏం మాట్లాడకుండా.. దేశంలో ఎటువంటి నిర్బంధ శిబిరాలు లేవన్నారని ఆమె దుయ్యబట్టారు. కేంద్రం ప్రభుత్వం ఎన్ఆర్పీ పేరుతో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను ప్రజలపై రుద్దాలనుకుంటుందని అరుంధతి రాయ్ మండిపడ్డారు. వాటిని ఎదుర్కొవాలంటే అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు పోరాడాలని ఆమె పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలపై అనేక దాడులకు జరుగుతున్నాయని.. అక్కడ పోలీసులు ముస్లిం ప్రజలను దోపిడి గురి చేస్తున్నారని అరుంధతి రాయ్ తెలిపారు. -
మైనారిటీలు మారారు.. గుర్తించారా?
కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఢిల్లీలోని ధార్యాగంజ్‌లో కారు తగులబడుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో లాగా భారతీయ ముస్లింలలో కలుగుతున్న గణనీయ మార్పును ప్రతిబింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లింలు పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఢిల్లీలోని జామా మసీదులో గుమికూడిన ముస్లింలు తాము మొదట భారతీయులం అని ప్రకటించడం ద్వారా, మెజారిటీ వర్గంలో ఉన్నందున మన రిపబ్లిక్ పునాదిని మార్చివేయగలమని అనుకుంటున్న వారి భావనను పూర్తిగా తోసిపుచ్చేశారు. అదేసమయంలో భారత రిపబ్లిక్ తన సెలబ్రిటీ రచయిత–కార్యకర్త అయిన అరుంధతీరాయ్‌కు ఎంతగానో రుణపడి ఉంది. ఆమె ఒంటిచేత్తోనే భారతదేశాన్ని మావోయిస్టు సాయుధ తిరుగుబాటుదారుల నుంచి కాపాడారు. మన మావోయిస్టులు ‘తుపాకులు ధరించిన గాంధేయవాదులు’ (‘గాంధియన్స్ విత్ గన్స్’) అని వర్ణించడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. ఆమె చేసింది సర్వకాలాల్లోనూ అతి గొప్పగా కోట్ చేయదగిన ఉల్లేఖన. అణిచివేతకు గురవుతున్నవారిగా మావోయిస్టుల మీద అంతవరకు ఉన్న కాస్తంత సానుభూతిని కూడా రాయ్ వ్యాఖ్య సమాధి చేసేసింది. ఏకకాలంలో మీరు గాంధేయవాదిగా, మావోయిస్టుగా ఉండలేరు. బహదూర్ షా జాఫర్ మార్గ్ వద్ద కూర్చుని నేను ఈ వ్యాసం రాస్తూ, జామా మసీదుకు చెందిన 17వ శతాబ్ది నాటి మెట్లమీదుగా వేలాది ముస్లింలు నడుచుకుంటూ పోయిన ఘటనను ఆమె ఎలా వర్ణించి ఉంటారు అని నేను ఆశ్చర్యపోయాను. వీళ్లు ముస్లింలు. ముస్లింలలాగా దుస్తులు ధరించినవారు. ప్రజలు ధరించే దుస్తులు వారి ఉద్దేశాలను తెలుపుతాయని ప్రధానమంత్రి ఇప్పుడే సూచిం చినందున దీన్ని మనం నొక్కి చెబుతున్నాం. ఈ ముస్లింలు మువ్వన్నెల జెండా, రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్తరువులను ధరించి వచ్చారు. కొంతమంది గాంధీ బొమ్మలను పట్టుకున్నారు. వీటితోపాటు జనగణమన, హిందూస్తాన్ జిందాబాద్‌లను వల్లిస్తూ పోయారు. భారత రిపబ్లిక్కి చెందిన అతి పెద్ద మైనారిటీ (ప్రతి ఏడుమంది భారతీయులలో ఒకరు) తమ పవిత్ర మసీదు మెట్లు దిగుతూ తాము ముందుగా భారతీయులమని, భారత రాజ్యాంగంపై, జెండాపై, జాతీయ గీతంపై తమకు విశ్వాసముందని, జనాభా పరమైన మెజారిటీ కారణంగా రిపబ్లిక్ పునాదినే మార్చివేయవచ్చనే భావనను వ్యతిరేకిస్తున్నామని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? భారతీయ దేశభక్తికి తామే వారసులమంటూ దేశంలోని మెజారిటీ జనాభా ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన ప్రకటనను ముస్లింలు తొలిసారిగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దేశంలో నివసించడానికే ఇక్కడున్నాం అంటూ వారు నినదించారు. వీళ్లతో ఇక ఎవరూ పోరాడలేరు. ఎలాంటి సమర్థనా లేకుండా వీరిపై ఎవరూ ఇక తుపాకులు గురిపెట్టి కాల్చలేరు. మన దేశం మారింది. లేక ‘మన దేశం ఇప్పుడు మారిపోతోంది మిత్రులారా’ అనే వాక్యాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర పట్టికకు మధ్య పౌరులకు శరణార్థులకు మధ్య ఉన్న సూక్ష్మభేదాన్ని వివరించడం ద్వారా మీరు వారికి ఇక నచ్చచెప్పలేరు. ఇప్పటికే 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశారు. రెండు లక్ష్యాలను సాధించడానికి మీరు ఇప్పటికే ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఒకటి, జాతీయ పౌర పట్టికలో దొరికిపోయే బెంగాలీ హిందువులను పునస్సమీక్షించి కాపాడటం, అదే సమయంలో బెంగాలీ ముస్లింలను బహిష్కరించడం. రెండు, రాష్ట్రంలోనూ దీన్నే పునరావృతం చేస్తామని హామీ ఇచ్చి పశ్చిమబెంగాల్ లోని బెంగాలీ హిందువులను ఆకట్టుకోవడం. అస్సాంలో మంటలు రేకెత్తించడానికి, పశ్చిమబెంగాల్లో మంటలు చల్లార్చడానికి చేసిన ప్రయత్నంలో మీరు ఇప్పుడు ఢిల్లీలో మంటలు రేపారు. టోపీలు, బుర్ఖాలు, హిజబ్, ఆకుపచ్చ రంగు అనేవి ముస్లింలను గుర్తు చేసే అత్యంత స్పష్టమైన మూస గుర్తులు. అలాగే వారి మతపరమైన ప్రార్థనలు కూడా. ఒక స్నేహితుడికి పోలీసు లాఠీలకు మధ్యలో దూరి అతగాడిని కాపాడి దేశవ్యాప్తంగా నెటిజన్ల దృష్టి నాకర్షించిన ఇద్దరు యువతుల ఫోటోను ఫేస్ బుక్‌లో చూసినప్పుడు, ఆ యువతులు జాతీయవాదం లేక లౌకికవాదం పట్ల ఎలాంటి నిబద్ధత లేని, సంప్రదాయ ఇస్లాం మతంతో మాత్రమే ప్రభావితమయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఏకే 47లు, ఆర్డీఎక్స్లు ధరించిన ముజాహిదీన్, లష్కర్, అల్ ఖాయిదా, ఐసిస్ వంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహిం చిన అనేకమంది ఆగ్రహోదగ్రులైన ముస్లింలకు చెందిన బలమైన సంకేతాలను కూడా మనం చూడవచ్చు. ఈ తరహా ముస్లింలతో సులభంగా పోరాడి ఓడించవచ్చు. కానీ భారతీయ ముస్లింలు నిజంగా నిరాశా నిస్పృహలకు గురై ఉగ్రవాదాన్ని చేపట్టి ఉంటే ఏమయ్యేది? సిమీ నుంచి ఇండియన్ ముజాహిదీన్ల వరకు అతి చిన్న ఉగ్ర బృందాలు దీన్ని నిర్ధారించాయి కూడా. అత్యంత ఉదారవాదిగా పేరొందిన నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సైతం 2009 ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టులతో నిండిన సభలో మాట్లాడుతూ, ఇదేవిషయాన్ని నొక్కి చెప్పారు. ముస్లింలకు ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపించే వారెవరైనా సరే, భారతీయ ముస్లింలలో ఒక శాతం (ఇప్పుడు వారి సంఖ్య 20 కోట్లు) మందైనా భారత్‌లో తమకు ఇక భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని ఉంటే దేశాన్ని పాలించడం ఎవరికైనా కష్టమయ్యేదని సింగ్ ఆ సభలో చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఏలిన దశాబ్దంలో ఇదీ పరిస్థితి. భారతీయ ముస్లింలు అపమార్గం పట్టకుండా దేశం వారిపట్ల ఔదార్యాన్ని ప్రదర్శించింది. కొంతమంది యువ ముస్లింలు ఉగ్రవాద బాట పట్టారు. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం లాగే నాడు యూపీఏ ప్రభుత్వం కూడా వారిపట్ల కఠినంగానే వ్యవహరించింది. ఈ వాస్తవాలపై అనేక భాష్యాలు ఉండవచ్చు. కానీ అంతిమ నిర్ధారణ మాత్రం ఒకటే. ఒక పక్షం మాత్రం ముస్లింలకు క్షమాపణ చెబుతూనే వారు జాతి వ్యతిరేకులుగా మారకుండా వారికి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకునేది. మరో పక్షం మాత్రం ఇప్పుడు కంటికి కన్ను సమాధానం అంటూ రెచ్చిపోతోంది. అలాగే మెజారిటీ వర్గం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రతరం చేయాలని కోరుకుంటోంది. అటు రాజకీయపక్షం ఇటు మెజారిటీ వర్గం ఇద్దరూ ముస్లింలను అనుమాన దృష్టితో చూడటంపై ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇక భారతీయ ముస్లింల గురించిన ప్రతికూల దృక్పథం ఏదంటే వారి మతాధిపతులే. జామా మసీదు బుఖారీలు, మదానీలు, కమాండో కామిక్ చానల్స్‌లో కనబడుతూ ఫత్వాలు జారీ చేస్తూ బవిరిగడ్డాలతో కనిపించే ముస్లిం మతగురువులను మెజారిటీ వర్గ ప్రజలు ప్రతికూల భావంతో చూస్తున్నారు. ముస్లింల పట్ల ఈ ప్రతికూల భావనలలో చాలావాటిని నేడు సవాలు చేస్తున్నారు. జనగణమన, జాతీయ జెండా, అంబేడ్కర్, గాంధీ బొమ్మలు, హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు.. ఇలా ముస్లింలను పట్టిచ్చే సంప్రదాయ సంకేతాలు మారుతున్నాయి కానీ దుస్తులు మాత్రమే మారలేదు. నాగరికతల మధ్య ఘర్షణ సూత్రం వెలుగులో భారతీయ ముస్లింలను అంచనా వేసేవారు ఘోరతప్పిదం చేస్తున్నట్లే లెక్క. 1947లో భారత్‌లోని మెజారిటీ ముస్లింలు జిన్నాతోపాటు నడిచి తమ కొత్త దేశం పాక్ వెళ్లిపోయారు. కానీ జిన్నా తర్వాత గత 72 ఏళ్లలో వారు తమ దేశాధినేతగా ముస్లింను ఎన్నటికీ విశ్వసించలేదు. వారు ఎల్లవేళలా ముస్లిమేతర నేతనే విశ్వసిస్తూ వచ్చారు. దీనర్థమేమిటి? కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో సంకేతాలు వెలువరించినట్లుగా భారతీయ ముస్లిం లలో గణనీయ మార్పును ప్రతి బింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లిం పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఇప్పుడు మనం సుప్రసిద్ధ ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన అమర వాక్యాలను ఈ భయానకమైన కాలంలో తరచుగా ఉల్లేఖిస్తున్నాం. ఆ కవితా పాదాల అర్థం ఏమిటి? ‘‘ఈ నేలపై ప్రతి ఒక్కరూ తమవంతు రక్తం ధారపోశారు. భారత్‌పై ఓ ఒక్కరూ తమ ప్రత్యేక హక్కును ప్రకటించలేరు’’. జాతిలో కలుగుతున్న ఈ మార్పును చూసి రహత్ ఇందూరి తప్పకుండా చిరునవ్వులు చిందిస్తుంటారు మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
టాప్–100 రచయితల్లో మనవాళ్లు
లండన్: ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో.. ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్‌లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాలసాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది. పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ది రిలక్టాంట్ ఫండమెంటలిస్ట్, హోం ఫైర్, అఫ్గాన్–అమెరికన్ రచయిత ఖలేద్ హొస్సైనీ రాసిన ఎ థౌజెండ్ స్లె్పండిడ్ సన్స్ నవలకు చోటు దక్కింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో ఈ జాబితా తెచ్చారు. -
ఈ చీకటి రోజులు సమసిపోతాయి
భారత్‌లోనూ మేధోచింతనపై ఇలాంటి దాడి సర్వసాధారణమైపోయింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద విద్యార్థులు, లాయర్లు, విద్యావేత్తలతో సహా వందలాదిమందిని వరుసగా అరెస్టు చేస్తూ వస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మీకు మల్లే, భారత్‌లోనూ మీలాంటివారిపై మోపిన కేసులు కూడా పరిహాసాస్పదమైనవి. ఇలాంటి అరెస్టులూ, నిర్బంధాలూ ఎగువ కోర్టుల్లో నిలబడవని సంబంధిత పోలీసులకు తెలుసుకూడా. కానీ ఈలోపు ఏళ్లతరబడి వారి నైతిక స్ఫూర్తి జైళ్లలో మగ్గిపోవాల్సి ఉంటుంది. ఈ క్రమానికి మరోపేరు దండన. వ్యతిరేకులపై రాజ్యం తీసుకునే ప్రతీకారం. ఇలాంటి చట్టాల బారినపడిన వ్యక్తులు తమను తాము కాపాడుకోవడమెలా? ప్రియమైన షహీదుల్, వారు మిమ్మల్ని తీసుకెళ్లి ఇప్పటికి వందరోజులపైనే అయింది. మీ దేశంలోనూ, మా దేశంలోనూ రోజులు బాగా లేవు, కాబట్టే మీ ఇంటి నుంచి గుర్తు తెలి యని వ్యక్తులు మిమ్మల్ని అపహరించుకుపోయారని వినగానే, జరగరానిది జరిగినట్లు మేం భయపడ్డాం. మిమ్మల్ని ‘ఎన్కౌంటర్’ చేశారా (భద్రతా బలగాలు చేసే చట్ట వ్యతిరేక హత్యలకు భారత్‌లో మేం పిలుచుకునే పదం ఇది) లేక ‘రాజ్యేతర శక్తులు’ చంపివేశాయా అని మేం భయపడ్డాం. ఇరుకైన వీధి సందులో మీ శవం కనబడనుందా లేక ఢాకా శివార్లలో లోతులేని నీటి కుంటలో తేలియాడనుందా అని భీతిల్లాం. కానీ మీ అరెస్టు గురించి ప్రకటించాక, పోలీసు స్టేషన్లో మిమ్మల్ని సజీవంగా చూశాక, మా తొలి స్పందన ఏమిటంటే అపరిమితానందానుభూతి. మీ గురించి నిజంగానే ఏదైనా రాయబోతున్నానా? బహుశా రాయకపోవచ్చు. నేను నిజంగా రాయాలనుకుంటే మాత్రం దీనికంటే ఎక్కువ రాయాల్సిన అవసరం ఉండేది కాదు. ‘ప్రియాతిప్రియమైన షíహీదుల్, మీరు జైలుగదిలో ఎంత ఒంటరిగా ఉంటున్నప్పటికీ, మా కళ్లు మీపైనే ఉన్నాయని తెలుసుకోండి. మేం మిమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం’మీ గురించి నేను నిజంగానే రాయదల్చినట్లయితే, మీ పని, మీ ఫొటోగ్రాఫ్‌లు, మీ మాటలు దశాబ్దాలుగా మన ప్రపంచంలో మానవజాతికి చెందిన వైవిధ్యపూరితమైన రేఖాచిత్రాన్ని గీశాయని.. మానవుల బాధ, సంతోషం, హింస, దుఃఖం, ఒంటరితనం, మూర్ఖత్వం, క్రూరత్వం, మతిలేని సంక్లిష్టతలను మా చైతన్యంలో ఇంకింపచేశాయని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మీరు చూసిన దృశ్యాలకు చెందిన ప్రాథమిక సాక్ష్యం నుంచి పుట్టుకొచ్చినటువంటి పరిశోధనతో కూడిన ఆగ్రహావేశ ప్రశ్నను మీ కృషి వెలిగిస్తుంది, మనిషి పట్ల ప్రేమభావాన్ని అది ఉద్దీప్తం చేస్తుంది. మిమ్మల్ని నిర్బంధించినవారికి మీరు చేసిన పని గురించి కనీసమాత్రంగా కూడా అర్థమై ఉండకపోవచ్చు. వారి క్షేమం కోసమైనా సరే ఏదో ఒక నాటికి వారు మీ కృషిని అర్థం చేసుకుంటారని మాత్రమే మేం ఆశిస్తున్నాం. మీ అరెస్టు మీ తోటి పౌరులకు హెచ్చరిక కావాలి. ‘మేం షహీబుల్ ఆలమ్నే ఇలా చేయగలిగామంటే, అనామకులూ, అంగుష్టమాత్రులూ, సామాన్యులు అయిన మీ అందరినీ ఏం చేయగలమో ఆలోచించుకోండి. చూస్తూ ఉండండి. భయంతో బతకండి’. పాలకులు కోరేది ఇదే కదా.మీ దేశం గురించి మీ ఫేస్బుక్ పోస్టుల్లో విమర్శించారన్నది వారి సాధారణ ఆరోపణ. పేరుమోసిన బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ యాక్ట్ (ఐసీటీ) సెక్షన్ 57 కింద మిమ్మల్ని అరెస్టు చేశారు. తన శ్రోతలను కల్మషపరిచే, కలుషితపర్చే ఉద్దేశంతో, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ, ప్రభుత్వం లేక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తూ ఎలక్ట్రానిక్ లేదా ప్రింట్ రూపంలో బూటకపు, అశ్లీలమైన, పరువునష్టం కలిగించే వార్తలను ప్రచురించే వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయడానికి ఈ చట్టం అధికారాన్ని కల్పిస్తోంది. ఈ అసంగతమైన, వివక్షాపూరితమైన, అందరినీ ఒకటిగా కలిపేసే చేపల ట్రాలర్ లాంటి ఈ చట్టం ఎంత ఘనమైందో కదా. ప్రజాస్వామ్యం అని పిలుచుకునే దేశంలో ఇలాంటి చట్టాలకు తావెక్కడుంది? సరైన ప్రభుత్వ ప్రతిష్ట ఏమిటి అని నిర్ణయించే హక్కు ఎవరి కుంది? ఎవరికుండాలి? బంగ్లాదేశ్ గురించి చట్టబద్ధంగా ఆమోదం పొందిన, ఆమోదనీయమైన ప్రతిష్ట ఎక్కడైనా ఉందా? ఇచ్ఛకాలు ఆడటం మినహా, అన్ని రకాల వాక్ స్వేచ్ఛను ఈ సెక్షన్ 57 చట్టవిరుద్ధమైనదిగా ముద్రవేస్తోంది. ఇది మేధావులపైన కాదు మానవ మేధస్సుపైనే దాడి. ఈ చట్టం కింద గత అయిదేళ్లలో బంగ్లాదేశ్‌లో 1200మందికి పైగా జర్నలిస్టులపై నేరారోపణ చేశారని, వీరిలో 400మందిపై విచారణ ఇప్పటికే జరుగుతోందని విన్నాం.భారత్‌లోనూ మా మేధోచింతనపై ఇలాంటి దాడి సర్వసాధారణంగా మారిపోయింది. బంగ్లాదేశ్‌లోని ఐసీటీ చట్టానికి భారత్‌లో సమానమైనది చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ). ఈ చట్టం కింద విద్యార్థులు, లాయర్లు, విద్యావేత్తలతో సహా వందలాదిమందిని వరుసగా అరెస్టు చేస్తూవస్తున్నారు. మీపై మోపినట్లుగానే వారిపై మోపిన కేసులు కూడా హీనాతిహీనమైనవి, పరిహాసాస్పదమైనవి. ఇలా తాము అరెస్టు చేసినవారిని ఉన్నత న్యాయస్థానాలు నిరపరాధులుగా విడుదల చేస్తారని సంబంధిత పోలీసులకు తెలుసుకూడా. కానీ ఈలోపు సంవత్సరాలపాటు వారి నైతిక స్ఫూర్తి జైళ్లలో మగ్గిపోవలసి ఉంటుంది. ఈ క్రమానికి మరోపేరు దండన. వ్యతిరేకించినవారిపై రాజ్యం తీసుకునే ప్రతీకారం.కాబట్టి ప్రియమైన షహీదుల్, మీకు నేను ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు, మా దేశంలో రాజ్యనిర్బంధంలో మగ్గిపోతున్న మా ప్రియతములు సాయిబాబ, సుధ, సురేంద్ర, షోమా, మహేశ్, సుధీర్, రోనా, అరుణ్, వెర్నొన్లతో పాటు తారిఖ్, అజీజ్, అమీర్, కోపా, కమ్లా, మాధవి, మాసే, రాజు.. ఇంకా వందలాది మా ప్రియతములందరినీ ఈ జాబితాలో చేర్చాలని ఆతృతపడుతున్నాను. ఇలాంటి చట్టాల బారినపడిన వ్యక్తులు తమను తాము కాపాడుకోవడం ఎలా సాధ్యం? ఇది అధికారిక గుర్తింపు పొందిన అహేతుకమైన అపనమ్మకం కలిగిన వ్యక్తుల ప్యానెల్ ముందు పౌరులు తమ అమాయకత్వాన్ని నిరూపించుకోవడమే అవుతుంది. నేరారోపణకు గురైన వ్యక్తులు తమను తాము సమర్థించుకుంటూ చేసే ప్రతి వాదనా ఈ ప్యానెల్ సభ్యుల ఉన్మత్తతను మరింత పెంచుతుంది. వారి కాల్పనిక భ్రమలను అధికం చేస్తుంది. మన రెండు దేశాలూ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలవైపు అడుగులేస్తున్నందున, మరిన్ని అరెస్టులు జరుగుతాయని, మరింతమందిని చితకబాదుతారని, చంపుతారని, మరింతమంది బ్లాగర్లను కొట్టి చంపుతారని, జాతిపరమైన, మతపరమైన, కులపరమైన దహనకాండను మరింతగా ప్రేరేపిస్తారని, మరిన్ని కుహనా ఉగ్రవాద దాడుల గురించి ప్రచారం పెంచుతారని, జర్నలిస్టులను, రచయితలను హత్యచేసే ఘటనలు ఇంకాస్త పెరుగుతాయని మనకు తెలుసు. తనను తాను లౌకిక ప్రజాస్వామికవాదిగా చెప్పుకుంటున్న మీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం అందించిన బిలియన్లాది డాలర్లతో 500 మసీదులు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ మసీదులు ఇస్లాం సవ్యదిశను వ్యాప్తి చెందిస్తాయని ఆమె భావన. ఇక్కడ మా భారత్‌లో మా పాలకులు మా రాజ్యాంగం ఎత్తిపట్టిన లౌకికవాదం, సోషలిజం భావనలకు చెందిన అన్ని నటనలను ప్రస్తుతం వదిలేశారు. ప్రభుత్వ పాలన చవిచూస్తున్న ఘోర వైఫల్యాలనుంచి, తీవ్రమైన జనాగ్రహం నుంచి దృష్టి మరల్చడానికి మా కోర్టులు, యూనివర్సిటీలు, బ్యాంకులు, నిఘా సంస్థలు ఒకటి తర్వాత ఒకటిగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. రాజ్యాధికారం (ప్రభుత్వం అని కాదు, దాన్ని నిర్వహిస్తున్న సంస్థ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) బాబ్రీమసీదు స్థానంలో హిందూ ఆలయాన్ని నిర్మించడంపై ఉన్న చట్టపరమైన అడ్డం కులను తొలగించాలంటూ నేరుగా సుప్రీం కోర్టునే హెచ్చరిస్తోంది. పాతి కేళ్ల క్రితం ఆ మసీదును ఉన్మత్త మూక కూల్చివేసిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల భక్తివిశ్వాసాలు ఎన్నికల సమయంలో ఎంత పరాకాష్టకు చేరుతుంటాయో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. సంపూర్ణమైన జాతి, మనిషి, పౌరుడు, హిందూ, ముస్లిం అంటూ తీసుకువస్తున్న సరికొత్త నిర్వచనాలకు వ్యతిరేకంగానే మనం వ్యవహరించాల్సి ఉంది. దీనికి వెనక ఉంటున్నది సంపూర్ణ మెజారిటీ, పాపిష్టి మైనారిటీ అనే అభిప్రాయమే. యూరప్, సోవియట్ యూనియన్ ప్రజలు ఇలాంటి భావాలు కలిగించిన విధ్వంసం నడుమనే వాళ్లు కొన్నాళ్లు జీవించాల్సి వచ్చింది. ఈ పరిశుద్ధ భావం సృష్టించిన అంతులేని బీభత్సంతో వారు తీవ్ర బాధలకు గురయ్యారు. ఇటీవలే యూరప్ నాజీల మారణహోమం ప్రారంభమైన 80వ సాంవత్సరికాన్ని జరుపుకుంది. ఆ మారణకాండ అక్కడ కూడా చడీచప్పుడు లేకుండా మొదలైంది. అది కూడా ఎన్నికలతోనే మొదలైంది. బాధాకరమైనదేమిటంటే పాతకాలపు జాఢ్యాలు అక్కడ మళ్లీ తలెత్తుతున్నాయి.ఇక్కడ భారత్‌లో రాబోయే రోజుల్లో ప్రతి దాన్నీ ధ్వంసం చేసుకుంటూ పోయే తరహా ఎన్నికలకు సాక్షీభూతులమై ఉండబోతున్నాం. వారు తమ నియంతృత్వ చట్టాలన్నింటినీ ఉపయోగించబోతున్నారు. ప్రతిపక్షాన్ని ఏకాకిని చేయడానికి నీడలతో యుద్ధం చేయబోతున్నారు. అదృష్టవశాత్తూ మనం పాలకుల విధానాలకు అనుగుణంగా మారలేని, వారు చెప్పినట్టల్లా ఆడలేని ప్రజలం. మన వైవిధ్యపూరితమైన, క్రమవిరుద్ధమైన మార్గాల్లో పాలకులకు ఎదురు నిలబడతామన్న ఆశ మాత్రం ఉంది. ప్రియమైన షహిదుల్, ఎగిసిపడిన సముద్రపు అల విరిగి పడక తప్పదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అది జరుగుతుంది. ఆ పరి ణామం జరిగి తీరుతుంది. ఈ మూర్ఖత్వపు, హ్రస్వదృష్టి కలిగిన క్రూరత్వం స్థానంలో కాస్త దయ, మరింత భవిష్యద్దర్శనం చోటుచేసుకుం టుందని నమ్మకం. మన భూమిని ఆవరించి ఉన్న ఈ నిర్దిష్టమైన, ప్రత్యేకమైన అశాంతి, వ్యాకులత, కాలం తీసుకొచ్చిన ఈ అనారోగ్యం తప్పకుండా గతించిపోనున్నాయి. ఢాకాలో త్వరలో మిమ్మల్ని చూస్తానని నమ్ముతున్నాను. ప్రేమపూర్వకంగా, అరుంధతి (అరుంధతీ రాయ్ ఈ లేఖ రాసిన రోజే (15–11–2018) షహీదుల్ ఆలమ్‌కి 102 రోజుల నిర్బంధం తర్వాత బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన వయస్సును (63 ఏళ్లు) దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు) అరుంధతీ రాయ్ వ్యాసకర్త ప్రముఖ భారతీయ రచయిత్రి, విమర్శకురాలు -
ఇది ప్రకృతి హెచ్చరిక
కేరళలో ఈ ఏడాది వానలు, నదులు మనుషులతో మాట్లాడుతున్నాయి. చిన్ననాటి నుంచీఈ వానలే నా కలంలో సిరా. అవే నన్ను రచయిత్రిని చేశాయి. మీనాచిల్ నది నా కథను నడిపించింది. ప్రస్తుతం నదుల మహోగ్రరూపం ఊహకు అందనిది. త్రివిధ దళాలు, ప్రభుత్వ సంస్థలు, స్థానికులు, జర్నలిస్టులు, మత్స్యకారులు ముఖ్యంగా సామాన్యులు ఎనలేని ధైర్యసాహసాలు చూపారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యమే అని చెప్పడానికి వీల్లేదు. మానవ తప్పిదం ఎంతో ఉంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులతో కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలే మొదట బలైపోతాయి. ఒకవైపు కార్చిచ్చులతో కాలిఫోర్నియా తగలబడిపోతూంటే, ఇటు వర్షబీభత్సంతో కేరళ మునిగింది. మనిషి అంతులేని స్వార్థంతో చేస్తున్న పనులతో కొండల మీదుగా వాన నీటి ప్రవాహం దిశ మారింది. అటవీ భూముల్లో గనుల తవ్వకం, చట్టవిరుద్ధంగా రిసార్టులు, సంపన్నుల ఇళ్లు, డ్యామ్‌ల అడ్డగోలు నిర్వహణ వంటివన్నీ నేటి ప్రళయానికి కారణం. ఈ వరదల్ని సెంట్రల్ వాటర్ కమిషన్ ఊహించకుండా ఎలా ఉంది? వరదనీటిని ఒడిసిపట్టాల్సిన డ్యామ్‌లు కీలక సమయంలో విపత్తు తీవ్రతను ఎన్నో రెట్లు పెంచేలా నీళ్లు ఎలా విడుదల చేశాయి? ఇప్పుడు సీఎం సహాయ నిధికి విరాళాలు భారీగా వస్తున్నాయి. వాటిలో సామాన్యులు ఇస్తున్నవే ఎక్కువ. చిత్రమేమిటంటే ఎవరికైతే మనం నిధులిస్తున్నామో ఆ ప్రభుత్వ యంత్రాంగమే హెచ్చరికల్ని పెడచెవిన పెట్టింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మాధవ్ గాడ్గిల్ కమిటీ ఎప్పుడో ఊహించింది. అభివృద్ధి పేరుతో సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోకపోతే వినాశనమేనని హెచ్చరించింది. కేరళ వరదల్ని అడ్డుపెట్టుకొని భారత్‌లో కొందరు విషాన్ని చిమ్ముతున్నారు. ప్రేమ, ఆప్యాయత పంచాల్సిన సమయంలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన దళితులు, ఆదివాసీలకు రాష్ట్రసర్కారు అండగా ఉంటుందని ఆశిద్దాం. మనం చేతులారా నాశనం చేసిన పర్యావరణాన్ని మనమే చక్కదిద్దాలి. అలా చేయకుంటే దేవభూమిలో మనిషి మసలడం సాధ్యం కాదు. 2018 వరదలు మనకి ఒక సున్నితమైన హెచ్చరిక. -
భిన్న రూపాల్లో హిందూ ఫాసిజం
హైదరాబాద్: దేశంలో సంక్లిష్టమైన పరిస్థితి ఉందని, హిందూ ఫాసిజం విస్తృతంగా ముందుకు సాగుతోందని ప్రముఖ రచయిత, సామాజికవేత్త అరుంధతీరాయ్ అన్నారు. హిందూ ఫాసిజం భిన్నమైన రూపాల్లో అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బీజేపీ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తుందన్నారు. గోరక్షణ పేరుతో దళితులను చంపుతున్నారని విమర్శించారు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్లో అమిత్‌షా పాత్ర ఉందని సీబీఐ విచారణ చేసిందని, ఈ కేసును జస్టిస్ లోయాకు విచారణకు అప్పగించగా అత ను అనుమానాస్పద రీతిలో మృతి చెందా రన్నారు. అమిత్‌షాను కాపాడటానికే లోయా ను హత్య చేశారనే ఆరోపణలున్నాయన్నారు. న్యాయవ్యవస్థను కూడా వదలట్లేదు.. భూమి, పర్యావరణం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారని అరుంధతీరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో హిందుత్వాన్ని జోడిస్తున్నారని, చివరికి న్యాయ వ్యవస్థను కూడా వదల్లేదన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ, ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల చదువుకోవటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. విద్యార్థి రాజకీయాలు లేకపోవటం వల్ల ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉందని, కలిసి పంచుకునే భావజాలం లేదన్నారు. విలువల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్.నారాయణరావు, ప్రొఫెసర్ నందిని సుందర్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శేషయ్య, వి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నేనొక ఏలియన్ని...
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటుడు పరేష్ రావల్ వివాదాస్పద ట్వీట్‌పై ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ సోషల్ మీడియాలో స్పందించారు. పరేవ్ రావల్ ట్వీట్స్‌పై ట్విట్టర్ ద్వారా గట్టి రిటార్టే ఇచ్చారు. తానొక గ్రహాంతరవాసిలా మారిపోయానంటూ పేర్కొన్న ఆమె ఇది జరిగినపుడు( పరేష్ రావెల్ ట్వీట్) పరేష్ రావల్ ఎవరో తెలుసుకోవడానికి గూగుల్‌లో వెతుక్కోవాల్సి వచ్చిందంటూ సెటైర్ వేశారు. మరోవైపు కశ్మీర్ అల్లర్లపై తాను వ్యాఖ్యానించినట్టుగా వార్తలను అరుంధతి రాయ్ తీవ్రంగా ఖండించారు. అసలిదంతా నాన్సెన్స్ అని కొట్టిపారేశారు. ఈ మధ్య కాలంలో శ్రీనగర్ (కశ్మీర్) వెళ్ళనే లేదని, కాశ్మీర్ ఇటీవలి పరిణామాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. కాగా ఇటీవల ఈ రచయిత్రిపై కశ్మీర్ లో రాళ్లు రువ్వుతున్న వ్యక్తికి బదులుగా అరుంధతిరాయ్ని సైనిక వాహనానికి కట్టాలంటూ పరేష్ రావల్ ట్విట్టర్లోతీవ్రంగా స్పందించడం, ఆయన ట్వీట్లను ఖండిస్తూ ట్విట్టర్ పెద్ద దుమారమే చెలరేగింది. ఒక ఎంపీ హింసను ఎలా సమర్థిస్తారని చాలామంది కౌంటర్ ట్వీట్లు చేయడంతో పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. "I am such an alien, when this happened I actually had to search on Google who Paresh Rawal is?" --Arundhati Roy pic.twitter.com/sK6nYXKxD1 — Arundhati Roy (@roybot_) May 23, 2017 -
భారత్‌పై కూడా అంతర్జాతీయ కోర్టుకెళితే..
కశ్మీర్లో గతనెల అల్లరి మూకల రాళ్లదాడి నుంచి తప్పించుకునేందుకు ఓ కశ్మీరీని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టేసిన సైనిక మేజర్ నితిన్ గొగోయ్‌కి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసాపత్రాన్ని అందజేయడంపై ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ సంఘటనను విమర్శించినందుకు.. రాళ్లు రువ్వే వ్యక్తికి బదులుగా అరుంధతీ రాయ్‌ని ఆ జీపుకు కట్టేసి ఉండాల్సిందని బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. యుద్ధాలు, సంఘర్షణల సందర్భంగానే కాకుండా తిరుగుబాటుదారుల అణచివేతలో భాగంగా కూడా ఓ పౌరుడిని మానవ కవచంగా భద్రతా దళాలు ఉపయోగించడం అనైతికమే కాకుండా న్యాయవిరుద్ధం. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (రోమ్ న్యాయ శాసనం), జెనీవా అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం శిక్షార్హమైన నేరం. దీన్ని యుద్ధనేరంగా పరిగణించాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయశాసనం చెబుతోంది. భారతీయుడైన కులభూషణ్ జాదవ్ ఉరిశిక్షపై అంతర్జాతీయ కోర్టును భారత్ ఆశ్రయించి ప్రాథమిక విజయాన్ని సాధించిన నేపథ్యంలోనే సైనిక మేజర్ నితిన్‌ను ప్రశంసించడం ఏ మేరకు సబబు. అంతర్జాతీయ కోర్టులో పాక్‌ను మట్టికరిపించామని మురిసిపోతున్న నేపథ్యంలో అరుంధతీరాయ్ లాంటి వాళ్లు ఇదే అంశంపై అంతర్జాతీయ కోర్టును ఆశ్రయిస్తే దేశం పరువేం గాను! బ్రిటీష్ ఇండియా ఆర్మీ నుంచే భారత దేశ త్రివిధదళాలు పుట్టుకొచ్చినా మన దళాలకు ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో లాగా రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేయవని, అసలు రాజకీయాల జోలికే వెళ్లవన్నది ఆ ప్రత్యేకత. అందుకని భారత దళాల దృక్పథాన్ని ‘విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ (వామ్) అని పిలుస్తారు. అందుకనే దేశంలో అక్కడక్కడ జరుగుతున్న తిరుగుబాటు ఆందోళనలను అణచివేసేందుకు సైన్యం పౌరులను మానవ కవచంగా ఉపయోగించుకున్న సందర్భాలు కశ్మీరు సంఘటన వరకు లేవు. ఇప్పుడు మన సైన్యాలకు రాజకీయ జబ్బు సోకినట్లు ఉంది. అయినా ఓ కశ్మీరీనీ మానవ కవచంగా ఉపయోగించుకోవడం వల్ల సాధించినదేంటి? కశ్మీర్లో అప్పటికీ ఇప్పటికీ ప్రజాందోళనలు పెరిగాయి తప్ప తగ్గలేదే! కశ్మీరీల హృదయాలను గెలుచుకున్నప్పుడే నిజమైన విజయాన్ని సాధించగలం. – ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
నవంబర్ 24న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు అరుంధతీ రాయ్ (రచయిత్రి), సెలీనా జైట్లీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ఆధ్యాత్మికోన్నతి సాధిస్తారు. ఇంటాబయటా వీరి మాటకు విలువ ఏర్పడుతుంది. వేదపండితులు, జ్యోతిష్యులకు, వైద్యులకు, వైద్యవిద్యార్థులకు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతానప్రాప్తి కలుగుతుంది. పుట్టిన తేదీ 24. ఇది శుక్ర సంఖ ్య కాబట్టి వీరు చక్కటి రూపం, శారీరక సౌష్టవం కలిగి ఉండి, ఎంతో అదృష్టాన్ని, ఆనందాన్ని పొందుతారు. సృజనాత్మకత, కళాత్మక హృదయం, అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. వీరికి ఈ సంవత్సరం ఎంతో ప్రోత్సాహవంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం ఉండవచ్చు. కొత్త వాహనాలు కొంటారు. విలువైన వస్త్రాభరణాలకి ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం, ఆర్థిక ఉన్నతి పొందుతారు. రాజకీయాలలో ఉన్న వారికి పదవీప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో, కోరుకున్న విద్యాసంస్థలలో సీటు లభిస్తుంది. ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగిస్తారు. పోటీపరీక్ష లలో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3,5,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, ఎల్లో, రెడ్, ఆరెంజ్. లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు. సూచనలు: శుక్రజపం చేయించుకోవడం, ప్రేమవ్యవహారాలకు దూరంగా ఉండటం, ఖర్చులను అదుపులో పెట్టుకోవడం, పేద అవివాహిత కన్యల పెళ్లికి తగిన సాయం చేయడం మంచిది. అలాగే, భూమిని, ఇంటిని అమ్మే ప్రయత్నాన్ని విరమించుకోవడం, ప్రాపంచిక జీవనంపై దృష్టి పెట్టడం, గణపతి హోమం లేదా కేతు గ్రహ జపం చేయించుకోవడం, వికలాంగులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
అవార్డు వాపసీపై బీజేపీ కౌంటర్ బుక్!
న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ జాతీయ పురస్కారాలు వెనుకకు ఇచ్చేస్తున్న సినీ కళాకారులు, రచయితల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. దేశంలోని పరమత అసహనానికి నిరసనగా గురువారం 24మంది సినీ ప్రముఖులు, రచయితలు తమ అవార్డులు వాపస్ ఇచ్చారు. అవార్డులు వెనుకకు ఇచ్చేసిన వారిలో సయిద్ మిర్జా, కుందన్ షా, అరుంధతి రాయ్, విక్రాంత్ పవర్ వంటి ప్రముఖులు ఉన్నారు. మరోవైపు అవార్డులు వెనుకకు ఇచ్చేస్తున్న వారికి బీజేపీ కూడా దీటుగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. అవార్డు వాపసీ ధోరణిని తప్పుబడుతూ 'నో యువర్ ట్రస్ట్' (మీ విశ్వాసాన్ని తెలుసుకోండి) పేరిట ఆ పార్టీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను పట్టాలు తప్పించేందుకే ఈ విధంగా కల్పితమైన నిరసనను సృష్టించారని మండిపడ్డారు. భావస్వేచ్ఛను హరించిన కాంగ్రెస్ పార్టీ గడిచిన 60 ఏళ్లలో తాను ఏ తప్పు చేయనట్టు నీతులు చెప్తున్నదని విమర్శించారు. -
ఆ పదమే నచ్చడం లేదు: అరుంధతీ రాయ్
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న అసహనాన్ని నిరసిస్తూ జాతీయ అవార్డులు వెనక్కి ఇస్తున్న రచయితలు, మేధావులు, కళాకారుల సరసన ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేరుతున్నారు. 1989లో ఫీచర్ ఫిల్మ్కుగాను తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కి ఇస్తున్నట్టు ఆమె ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కాలమ్‌లో వెల్లడించారు. ‘ఇన్ విచ్ అన్నీ గీవ్స్ అండ్ దోస్ వన్స్’ అని చలనచిత్రానికి అరుంధతీ రాయ్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్నారు. మైనారిటీలపై దాడులు, హేతువాదుల హత్యలు, భావ ప్రకటనా స్వేచ్ఛకు బెదిరింపులు, గోమాంసంపై బలవంతపు నిషేధానికి వ్యతిరేకంగా మేధావులు, కళాకారులు, రచయితలు నేడు ఓ రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అసాధారణం, అద్భుతమని వ్యాఖ్యానించారు. ఆ ఉద్యమానికి తనవంత సహకారాన్ని అందించాలనే సదుద్దేశంతోనే తాను జాతీయ అవార్డును వెనక్కి ఇచ్చివేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇందులో రాజకీయాలేవీ లేవని, కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనే విషయంతో తనకు ప్రమేయం లేదని, దేశంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు తనను కలవరపరుస్తున్నాయని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2005లో తాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. నేడు సమాజంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులకు ‘అసహనం’ అనడం తనకు నచ్చడం లేదని, అంతకన్నా పెద్ద పదమే ఉపయోగించాలని ఆమె అభిప్రాయపడ్డారు. దర్శకుడు కుందన్ షా కూడా.... అరుంధతీరాయ్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవించిన బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా కూడా తనకిచ్చిన జాతీయ అవార్డును కూడా వెనక్కి ఇచ్చివేస్తానంటూ ప్రకటించారు. ‘జానే బీ దో యారో’ చిత్రానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఇది కాంగ్రెస్-బీజేవీ మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, ఆ పార్టీలు ఒకటేనని అన్నారు. ‘పోలీస్ స్టేషన్’ అనే సీరియల్‌ను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
'అమ్మాయిలు అబ్బాయిలు దూరం దూరం'
కొట్టాయం: కేరళ పాఠశాలలో ఓ విచిత్ర నిబంధన విధించారు. అమ్మాయిలు, అబ్బాయిలు పాఠశాల ప్రాంగణంలో కనీసం మీటర్ దూరం ఉండి వారి వారి పనులు చూసుకోవాలని ఆదేశించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం పట్ల స్కూల్ యాజమాన్యంపై పలువురు సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ప్రముఖ సామాజిక వేత్త, రచయిత అరుంధతీ రాయ్ తల్లీ మేరీ రాయ్ కొట్టాయంలో స్థాపించిన పల్లి కూడమ్ పాఠశాలలో ఇలాంటి నిబంధనలు ఉండటం కూడా విమర్శలు వేగం అందుకోవడానికి కారణం అయింది. సాధారణంగా పాఠశాలలో తరగతులవారిగా సెక్షన్లు ఉంటే ఈ పాఠశాలలో మాత్రం అమ్మాయిలవారిగా, అబ్బాయిల వారిగా సెక్షన్లు ఉన్నాయి. అయితే, ఇలా ఉండటం వల్ల వారిరువురి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని స్కూల్ యాజమాన్యం సమర్థించుకుంటోంది. దీంతోపాటు సీనియర్ విద్యార్థులు ఎవరూ జూనియర్లతో మాట్లాడకూడదని కూడా ఆంక్షలు విధించారట. అయితే, కొన్ని కార్యక్రమాల విషయాల్లో మాత్రం బాలబాలికలు ఉమ్మడిగా పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ ను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
గాంధీవి కులపోకడలు: అరుంధతీ రాయ్
తిరువనంతపురం: మహాత్మాగాంధీపై ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ కులతత్వ ధోరణులను అనుసరించార ని విమర్శించారు. గాంధీ పేరుతో ఉన్న సంస్థలకు ఆ పేరు మార్చే సమయం ఆసన్నమైందన్నారు. గురువారం తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... మహాత్మాగాంధీ యూనివర్సిటీ(కేరళలోని ప్రముఖ వర్సిటీ)ని సూచిస్తూ దాని పేరు మార్చాలన్నారు. భారత్‌లో హీరోల(మహానుభావులు)కు కొదవలేదని, కానీ వారంతా నకిలీలేనని అభిప్రాయపడ్డారు. 1936లో ‘ఆదర్శనీయ భాంగి’ పేరుతో గాంధీ రాసిన వ్యాసాన్ని ఉదహరించారు. అందులో గాంధీ భారత్‌ను ప్రస్తావిస్తూ పారిశుద్ధ్య పనివారు మూత్రాన్ని, మలాన్ని ఎరువుగా మార్చాలని సూచించారని, ఇది హరిజనుల పట్ల ఆయన విధానాన్ని తెలియజేయడంతో పాటు, కులాధిపత్య ధోరణి బలోపేతానికి ఎలా తోడ్పడిందో సూచిస్తోందన్నారు. గాంధీ గురించి పాఠాల్లో నేర్చుకున్నదంతా అబద్ధమన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ నేత గులాంనబీ అజాద్ తప్పుబట్టారు. గాంధీజీని కులతత్వవాది అంటే క్షమించరాదన్నారు