నేనొక ఏలియన్‌ని... | "I am such an alien, when this happened I actually had to search on Google who Paresh Rawal is?" | Sakshi
Sakshi News home page

నేనొక ఏలియన్‌ని...

Published Thu, May 25 2017 8:40 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

"I am such an alien, when this happened I actually had to search on Google who Paresh Rawal is?"

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటుడు పరేష్‌ రావల్‌ వివాదాస్పద ట్వీట్‌పై ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ సోషల్‌ మీడియాలో స్పందించారు.  పరేవ్‌ రావల్‌ ట్వీట్స్‌పై  ట్విట్టర్‌ ద్వారా గట్టి  రిటార్టే ఇచ్చారు.  తానొక  గ్రహాంతరవాసిలా మారిపోయానంటూ పేర్కొన్న ఆమె ఇది జరిగినపుడు( పరేష్ రావెల్‌ ట్వీట్‌) పరేష్‌ రావల్‌ ఎవరో తెలుసుకోవడానికి గూగుల్‌లో వెతుక్కోవాల్సి వచ్చిందంటూ సెటైర్‌ వేశారు.

మరోవైపు కశ్మీర్‌ అల్లర్లపై తాను వ్యాఖ్యానించినట్టుగా  వార్తలను అరుంధతి రాయ్‌ తీవ్రంగా ఖండించారు. అసలిదంతా నాన్సెన్స్ అని కొట్టిపారేశారు. ఈ మధ్య కాలంలో శ్రీనగర్ (కశ్మీర్) వెళ్ళనే లేదని, కాశ్మీర్ ఇటీవలి పరిణామాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు.
 
కాగా ఇటీవల ఈ రచయిత్రిపై  కశ్మీర్‌ లో రాళ్లు రువ్వుతున్న  వ్యక్తికి బదులుగా  అరుంధతిరాయ్‌ని   సైనిక వాహనానికి   కట్టాలంటూ   పరేష్ రావల్ ట్విట్టర్‌లోతీవ్రంగా స్పందించడం, ఆయన ట్వీట్లను  ఖండిస్తూ  ట్విట్టర్‌ పెద్ద  దుమారమే చెలరేగింది. ఒక ఎంపీ హింసను ఎలా సమర్థిస్తారని చాలామంది కౌంటర్ ట్వీట్లు చేయడంతో పై వివాదం రేగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement