అఫ్రిదికి దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన గంభీర్‌ | Gautam Gambhir hits back at Shahid Afridi over Kashmir tweet | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 3 2018 6:53 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

Gautam Gambhir hits back at Shahid Afridi over Kashmir tweet - Sakshi

గౌతం గంభీర్‌, షాహిద్ అఫ్రిది (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : కశ్మీర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న భారత్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది చేసిన ట్వీట్‌పై టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.  అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని ఈ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌ సెటైర్‌ వేశాడు.

‘అఫ్రిది ట్వీట్‌పై స్పందించాలని మీడియా ప్రతినిధులు నాకు ఫోన్‌ చేస్తున్నారు. బుద్ధిమాంద్యం ఉన్న అతని దృష్టిలో యూఎన్ అంటే అండర్ 19 అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌తో వికెట్‌ తీసి ఆనందపడుతున్నాడు.’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

ఇక గంభీర్‌కు దేశ భక్తి ఎక్కువేననే విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఎన్నోసార్లు పాక్ దుశ్చర్యలపై అతడు స్పందించాడు. ఇక అఫ్రిదికి గంభీర్‌ మధ్య మాటల యుద్దం తొలిసారేం కాదు. గతంలో ఎన్నో సార్లు వీరి మధ్య మాటల యుద్దం నడించింది. 2011 ప్రపంచకప్‌ విజయానంతరం గంభీర్‌ విజయాన్ని ముంబై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారకి అంకితం చేశాడు. ఈ వ్యాఖ్యలను అఫ్రిది తప్పుబట్టగా.. గంభీర్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.  ఆదివారం కశ్మీర్‌లో భారత బలగాలు 13 మంది టెర్రరిస్టులను మట్టుబెడితే.. కశ్మీర్‌లో అమాయకులను అణచివేస్తున్నారంటూ అఫ్రిది ట్విటర్‌లో ప్రశ్నించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement