
మైలార్‌దేవిపల్లిలో బాలిక కిడ్నాప్
రాజేంద్రనగర్: పాఠశాలకు వెళ్లిన బాలిక కిడ్నాప్ అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్‌దేవిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబ నగర్‌కు చెందిన కీర్తీ(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. అదే కాలనీకి చెందిన సంతోష్(19) బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.