ప్రముఖ నటుడు అరెస్ట్‌.. అదే కారణం! | Malayalam actor Baiju Santhosh arrested for drunk driving | Sakshi
Sakshi News home page

Malayalam Actor: ప్రముఖ నటుడు అరెస్ట్‌.. కారణమదే!

Published Mon, Oct 14 2024 4:27 PM | Last Updated on Mon, Oct 14 2024 4:34 PM

Malayalam actor Baiju Santhosh arrested for drunk driving

ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.


కాగా.. కారులో బైజూ కుమార్తె కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది.  బైజు సంతోష్‌ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన మొదట అధవ మణియన్ పిల్ల (1981) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత పుతన్ పనం (2017), మేరా నామ్ షాజీ (2019) చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా.. ప్రస్తుతం సంతోశ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ఎల్‌2 ఎంపురన్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement