వెండితెరపై మరోసారి ‘శ్రీదేవి... శోభన్‌బాబు’ల ప్రేమ కథ | Sridevi Shoban Babu: Chiranjeevi Daughter Productions | Sakshi
Sakshi News home page

కలర్‌ఫుల్‌ లవ్‌స్టోరీ!

Published Sun, Aug 22 2021 8:49 AM | Last Updated on Sun, Aug 22 2021 9:00 AM

Sridevi Shoban Babu: Chiranjeevi Daughter Productions - Sakshi

తండ్రి చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మాతగా ‘శ్రీదేవి... శోభన్‌బాబు’ సినిమాను  శనివారం ప్రకటించారు. ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో సుస్మితకు నిర్మాతగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సుస్మిత భర్త విష్ణుప్రసాద్‌ మరో నిర్మాత. గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
(చదవండి: చిరంజీవికి మెగాస్టార్‌ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?)

ఈ కలర్‌ఫుల్‌ లవ్‌స్టోరీలో సంతోష్‌ శోభన్, గౌరి జి. కిషన్‌ (‘జాను’ సినిమాలో చిన్ననాటి సమంత పాత్ర చేసిన అమ్మాయి) హీరో, హీరోయిన్లుగా నటిస్తారు. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలియజేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement