Sobhan Babu
-
'శోభన్ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?
టాలీవుడ్లో మరో సినీ దిగ్గజం దివికేగిసింది. దాదాపు 55 ఏళ్ల పాటు కళామతల్లి ముద్దుబిడ్డగా, తనదైన నటనతో అభిమానులను మెప్పించిన నట దిగ్గజం చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చివరిసారిగా 2017లో వచ్చిన గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. చంద్రమోహన్ హీరోగా నటించిన పదహారేళ్ల వయసు చిత్రం ద్వారానే అందాల నటి శ్రీదేవి అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు! ) దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్ ఇకలేరన్న విషయాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ గురించి ఆసక్తిక విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత శంకరాభరణం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు గెలిచారు. అప్పటి హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. అంతే కాకుండా శోభన్ బాబు, చంద్రమోహన్ మంచి స్నేహితులు కూడా. అలా వారి మధ్య బలమైన స్నేహబంధం వల్ల ఆర్థికంగా ఇద్దరు డబ్బులు అవసరమైతే ఒకరినొకరు సాయం చేసుకోవారమని గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. శోభన్ తన వద్దనే డబ్బులు తీసుకునేవాడని.. ఇది చూసి తనకు ఆశ్చర్యమేసేదని ఆయన తెలిపారు. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత ) గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'శోభన్‌బాబు, నేను మంచి స్నేహితులం. నాకంటే ఆయనే చాలా ఆస్తిపరుడు. అయినా కూడా నన్ను డబ్బులు అడిగేవారు. ఇది చూసి మొదట నేను ఆశ్చర్యపోయేవాన్ని. ఆ తర్వాత నాకు ఓ విషయం చెప్పాడు. నా దగ్గర డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని శోభన్ బాబు నమ్మేవారు. అందుకే ఏదైనా ఆస్తి కొన్నప్పుడల్లా నా దగ్గరే డబ్బులు తీసుకునేవాడు. శోభన్ బాబు మరణం మనకు తీరని లోటు' అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. నాగేశ్వరరావుతో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. -
శ్రీదేవిని ఎత్తుకుంటే పక్కన హీరోలు అలిగేవారు.. ఆ రోజులు వేరు..
-
వెండితెరపై మరోసారి ‘శ్రీదేవి... శోభన్‌బాబు’ల ప్రేమ కథ
తండ్రి చిరంజీవి బర్త్ డే సందర్భంగా కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మాతగా ‘శ్రీదేవి... శోభన్‌బాబు’ సినిమాను శనివారం ప్రకటించారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో సుస్మితకు నిర్మాతగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సుస్మిత భర్త విష్ణుప్రసాద్ మరో నిర్మాత. గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?) ఈ కలర్‌ఫుల్ లవ్‌స్టోరీలో సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ (‘జాను’ సినిమాలో చిన్ననాటి సమంత పాత్ర చేసిన అమ్మాయి) హీరో, హీరోయిన్లుగా నటిస్తారు. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలియజేసింది. -
శోభన్‌బాబు చేసిన ఏకైక వ్యాపారం ఏంటో తెలుసా?
సృష్టిలో తియ్యనిది తల్లి ప్రేమ! ఒకరు కన్నతల్లి! మరొకరు తల్లి కాని తల్లి! ఇద్దరమ్మల ముద్దుల బిడ్డ మమతల కథ... ‘ఇల్లాలు’. శోభన్‌బాబు, జయసుధ, శ్రీదేవి నటించిన ఈ కుటుంబ కథాచిత్రం అప్పట్లో సూపర్ హిట్ సినిమా. ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి..’, ‘అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా...’ లాంటి పాటలతో గుర్తుండిపోయిన సినిమా. లేడీ ఫ్యాన్స్ అమితంగా ఉన్న హీరో శోభన్‌బాబుకూ, నటనలో ఉన్నత శిఖరాలకు ఎగబాకుతున్న సమయంలో హీరోయిన్లు జయసుధ, శ్రీదేవికీ కెరీర్లో అది ఓ మైలురాయి సినిమా. 1981 ఏప్రిల్‌లో రిలీజైన ‘ఇల్లాలు’కు ఇప్పుడు 40 వసంతాలు. ఇల్లాలు.. భర్తకు ప్రేమమూర్తి. బిడ్డకుమాతృమూర్తి! సృష్టికే దేవతామూర్తి!!! భార్యాభర్తల అనుబంధానికీ, కుటుంబ బంధానికీ నిర్వచనమైన ఈ అంశాన్నే తెరపై సెంటిమెంట్ నిండిన కుటుంబకథగా చెప్పింది ‘ఇల్లాలు’ చిత్రం. బాబు ఆర్ట్స్ పతాకంపై జి. బాబు నిర్మాతగా, అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో, తాతినేని రామారావు దర్శకత్వంలో తయారైందీ సినిమా. ఈ ముగ్గురూ స్నేహితులు, వ్యాపార భాగస్వాములు. ఆ రకంగా ఇది ఆ ముగ్గురి సినిమా. ఇంకా గమ్మత్తేమిటంటే, శోభన్‌బాబు ఆర్థిక అండదండలతో ఏర్పాటైన అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ లక్ష్మీచిత్ర (నైజామ్‌లో శ్రీలక్ష్మీచిత్ర)యే ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అలా మిత్రులందరి సమష్టి సినీ ప్రాజెక్టుగా ‘ఇల్లాలు’ ముందుకు నడిచింది. ఇద్దరు తల్లుల కథ – ‘ఇల్లాలు’! సంసారం సవ్యంగా సాగాలంటే, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవగాహన. ఆ విషయాన్ని ఈ చిత్రం అర్థవంతంగా చెప్పింది. ఆస్తిపాస్తులతో, ధనవంతుల ఇంట్లో పుట్టిపెరిగిన, అహంకారపూరితమైన అమ్మాయి కల్పన (జయసుధ). సామాన్య జీవితాన్ని సాగిస్తున్న కథానాయకుడు కిరణ్ (శోభన్ బాబు)ను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటుంది. ఓ బిడ్డ పుట్టాక, భర్తతో ఇమడలేనంటూ, అహంభావంతో కాపురాన్ని కాలదన్నుకుంటుంది. ఆ పరిస్థితుల్లో మరో అమ్మాయి జ్యోతి (శ్రీదేవి)ని పెళ్ళి చేసుకుంటాడు. అతని బిడ్డను కన్నతల్లిలా పెంచుతుంటుంది ఆమె. మొదటి భార్య కల్పన తాను పోగొట్టుకున్నదేమిటో గ్రహించి, వెనక్కివచ్చి తన కన్నబిడ్డను ఇమ్మని హీరోను అడుగుతుంది. కన్నపాశం, పెంచిన మమకారం మధ్య నడిచే ఈ చైల్డ్ సెంటిమెంట్ కథ విశేష ప్రేక్షకాదరణ పొందింది. అహంకారంతో కాపురాన్నీ, కన్నబిడ్డనూ కాదనుకున్న సెంటిమెంటల్ పాత్రలో జయసుధ, ఒద్దికైన ఇంటి ఇల్లాలుగా శ్రీదేవి, భర్త పాత్రలో శోభన్‌బాబు రాణించారు. సంసార సూత్రాలు గొల్లపూడి రచనలో వినిపిస్తాయి. హిందీ హిట్ కథకు ఇది రీమేకైనప్పటికీ, మూలాన్ని అనుసరిస్తూనే, మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. కథనంలోని ఇలాంటి మార్పులు, సెంటిమెంట్ బాగా పండించడం ‘ఇల్లాలు’ విజయానికి తోడ్పడ్డాయి. ఒకే దర్శకుడు – రెండు హిట్లు! ఆ ఏడాది మొదట్లో వచ్చిన శోభన్‌బాబు చిత్రాలు ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’ – రెండింటికీ దర్శకుడు తాతినేని రామారావే. ఆయన దర్శకత్వంలో అంతకు ముందెప్పుడో అక్కినేనితో వచ్చిన ‘ఆలుమగలు’కే పాత్రలతో సహా కొన్ని కీలక మార్పులు చేసి, ‘పండంటి జీవితం’ అందించారాయన. ‘ఇల్లాలు’ ఏమో హిందీ సూపర్ హిట్ చిత్రం ‘అప్నాపన్’ (చుట్టరికం అని అర్థం – 1977)కు రీమేక్. జితేంద్ర, రీనారాయ్, సులక్షణా పండిట్ నటించగా దర్శక, నిర్మాత జె. ఓం ప్రకాశ్ రూపొందించిన ఆ చిత్రం పెద్ద హిట్. హిందీ మాతృకలో లక్ష్మీకాంత్ – ప్యారేలాల్ సంగీతంలో ‘ఆద్మీ ముసాఫిర్ హై...’ అంటూ మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడే పాట పెద్ద హిట్. తెలుగు రీమేక్‌లోనూ జేసుదాస్, ఎస్పీ శైలజ పాడిన సందర్భోచిత ఆత్రేయ రచన ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి...’ మారుమోగిపోయింది. ఈ పాట సినిమాలో పలు సందర్భాల్లో పదే పదే వినిపిస్తూ, కథలోని మూడ్‌ను పెంచింది. తోటి హీరోల్లో... ఆయనదే రికార్డు! అప్పట్లో ‘ఇల్లాలు’ చిత్రం 6 కేంద్రాలలో (విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, తెనాలి, హైదరాబాద్) డైరెక్టుగా వంద రోజులు ఆడింది. 2 కేంద్రాలలో (కాకినాడ, చీరాల) షిఫ్టుతో, రోజుకు మూడు ఆటలతో శతదినోత్సవం చేసుకుంది. అలా 8 కేంద్రాలలో రెగ్యులర్ షోలతో శతదినోత్సవం జరుపుకొన్న చిత్రమైంది. ఇవి కాక, మరో 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తంగా 12 కేంద్రాలలో ఈ ఫ్యామిలీ డ్రామా వంద రోజుల పండగ చేసుకుంది. 1981 ఆగస్టు 16న మద్రాసులోని చోళా హోటల్లో శతదిన ఘనమహోత్సవం జరిపారు. ప్రేక్షకాదరణతో ఆపైన ‘ఇల్లాలు’ రజతోత్సవమూ చేసుకుంది. బాక్సాఫీస్ లెక్క చూస్తే – ఇలా ఎనిమిది, అంతకు మించి కేంద్రాలలో రెగ్యులర్ షోలతో వంద రోజులు ఆడిన సినిమాలు శోభన్‌బాబు కెరీర్లో ఏకంగా పది ఉన్నాయి. ‘ఇల్లాలు’కు ముందు ఆయన కెరీర్లో 8 చిత్రాలు కనీసం 8 కేంద్రాల్లో వంద రోజులాడాయి. ‘సంపూర్ణ రామాయణం’ (10 కేంద్రాలు), ‘జీవన తరంగాలు’(12), ‘శారద’ (8), ‘మంచి మనుషులు’(11), ‘జీవనజ్యోతి’ (12), ‘జేబుదొంగ’(10), ‘సోగ్గాడు’ (19), ‘గోరింటాకు’ (8), తర్వాత ‘ఇల్లాలు’ (8 కేంద్రాలు) 9వ సినిమా అయింది. ఆ తర్వాత ‘దేవత’ చిత్రం (9 కేంద్రాలు) ఆ శతదినోత్సవ విజయాల జాబితాలో పదోది అయింది. గమ్మత్తేమిటంటే, తన సమకాలీన హీరోలలో అలాంటి శతదినోత్సవ చిత్రాలు అత్యధికంగా ఉన్నది శోభన్‌బాబుకే! ఇలా పది చిత్రాలతో శోభన్‌బాబు హయ్యస్ట్‌గా నిలిస్తే, ఆయన సమకాలీన హీరోల సెకండ్ హయ్యస్ట్ 4 చిత్రాలే కావడం గమనార్హం! ఆ రోజుల్లో హీరోల్లో శోభన్ బాబుకు మహిళాదరణ ఎక్కువ. ఆ కారణంగా ఆయన సినిమాలు బాగా ఆడేవి. ఎక్కువ రోజుల రన్ కూడా వచ్చేది. సమకాలీన హీరోలకు మించి ఆయనకు శతదినోత్సవ చిత్ర రికార్డుకు అది ఓ ప్రత్యేక కారణం. శోభన్‌బాబు ఈ పది శతదినోత్సవ చిత్రాల విజయయాత్ర సాగించిన 1972 – 1982 మధ్య కాలానికి సంబంధించి మొత్తం తెలుగు సినీపరిశ్రమ పరంగా గమనిస్తే – ఎన్టీఆర్ (15 చిత్రాలు) తరువాత శోభన్ బాబుదే (10 చిత్రాలు) అగ్రస్థానం. చివరకు సీనియర్ హీరోలతో సహా మిగతా హీరోలెవరూ శోభన్బాబులో సగం మార్కును కూడా దాటలేకపోయారు. అదీ ఆ కాలఘట్టంలో హీరో శోభన్బాబుకున్న సక్సెస్ స్టామినా! ముగ్గురు మిత్రుల ‘దీపారాధన’ ఒకపక్కన ‘ఇల్లాలు’ క్రిక్కిరిన ప్రేక్షకులతో ఆడుతుంటే, అదే సమయంలో... ఆ పక్కనే కూతవేటు దూరంలో... వేరే హాలులో శోభన్‌బాబు సినిమా ‘దీపారాధన’ సక్సెస్‌ఫుల్‌గా నడవడం ఆ రోజుల్లోని ఓ విశేషం. ‘బలిపీఠం’, ‘గోరింటాకు’ తరువాత దర్శకుడు దాసరి – శోభన్‌బాబుల కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. స్నేహం విలువను చాటే ఈ సినిమా నిరుద్యోగులైన ముగ్గురు ప్రాణమిత్రుల (శోభన్, మోహన్‌బాబు, మురళీమోహన్) కథ. వారిలో ఒకరైన హీరోకు పెళ్ళి కావడం... ఎదురైన సంఘటనలు... త్యాగాలు... ఇలా సెంటిమెంటల్‌గా సాగే, సంభాషణల ప్రధానమైన సినిమా ఇది. ‘వచ్చే జన్మంటూ ఉంటే మీ భార్యగా కాకుండా, స్నేహితుడిగా పుట్టాలని కోరుకుంటున్నా’ అంటూ కన్నుమూసే త్యాగభరిత కథానాయికగా జయప్రద కనిపిస్తారు. చక్రవర్తి బాణీల్లో ‘సన్నగా సనసన్నగా...’, ‘తూరుపు తిరిగి దణ్ణం పెట్టు అన్నారండి మావారు...’ పాటలు అప్పట్లో పదే పదే వినిపించేవి. ‘దీపారాధన’ మధ్యతరగతి మహిళలను ఆకట్టుకుంది. ‘ఇల్లాలు’ తర్వాత రెండు రోజుల తేడాలో ‘దీపారాధన’ షిఫ్టులు, నూన్ షోలతో 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొంది. వంద రోజుల్లో...3 వంద రోజులు నిజం చెప్పాలంటే, శోభన్ బాబుకు ఒకటికి మూడు శతదినోత్సవ చిత్రాలు అందించి, బాగా కలిసొచ్చిన సంవత్సరాల్లో ఒకటి – 1981. ఆ ఏడాది జనవరి 1న వచ్చిన ‘పండంటి జీవితం’ వంద రోజులు ఆడింది. అప్పట్లో విజయవాడ (కల్యాణచక్రవర్తి థియేటర్) సహా 4 కేంద్రాలలో ‘పండంటి జీవితం’ చిత్రాన్ని 98 రోజులకే ఎత్తేసి, 99వ రోజున ఏప్రిల్ 9న అదే శోభన్‌బాబు నటించిన కొత్త చిత్రం ‘ఇల్లాలు’ రిలీజ్ చేశారు. గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ కూడా సూపర్ హిట్టయి, వంద రోజులు దాటేసింది. ఇంకా గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ రిలీజయ్యాక రెండు రోజుల తేడాతో ఏప్రిల్ 11న శోభన్‌బాబు నటించినదే ‘దీపారాధన’ రిలీజైంది. ఒక పక్కన ‘ఇల్లాలు’ విపరీతమైన ఆదరణతో నడుస్తుండగానే, మరోపక్క ‘దీపారాధన’ కూడా హిట్టయింది. శతదినోత్సవమూ జరుపుకొంది. మొత్తానికి, వంద రోజుల వ్యవధిలో 3 వంద రోజుల సినిమాలు రావడం ఏ హీరోకైనా అరుదైన సంఘటన. ఆ మూడూ కుటుంబ కథలు, సెంటిమెంట్ చిత్రాలే తప్ప, మాస్ యాక్షన్ సినిమాలు కావు. అది గమనార్హం. అప్పట్లో శోభన్‌బాబు సినిమాకున్న మహిళాదరణకు అది ఓ నిదర్శనం. శోభన్‌బాబు చేసిన ఏకైక సినీ వ్యాపారం! అప్పట్లో దర్శకుడు తాతినేని రామారావు, నిర్మాణ సారథులు అట్లూరి పూర్ణచంద్రరావు, జి. బాబు, తరువాతి కాలంలో నిర్మాతగా పేరు తెచ్చుకున్న వై. హరికృష్ణ (మేనేజింగ్ పార్ట్నర్) – నలుగురూ కలసి చిత్రనిర్మాణం చేసేవారు. కేంద్రీకృత సినీ పంపిణీ వ్యవస్థ ఇంకా పట్టుసడలని సమయం అది. ఆ పరిస్థితుల్లో ఆ నలుగురూ, హరికృష్ణ మేనల్లుడైన కాట్రగడ్డ ప్రసాద్, హైదరాబాద్ ‘వెంకటేశా’ థియేటర్ బి.వి. రాజు, తర్వాత టి.టి.డి చైర్మనైన ఆదికేశవులునాయుడు భాగస్వాములుగా ‘లక్ష్మీచిత్ర’ అనే ఓ కొత్త పంపిణీ సంస్థను ప్రారంభించారు. హీరో శోభన్‌బాబు ఆర్థికంగా అండగా నిలిచారు. తన సతీమణికి అన్నగారైన గోపిని అందులో భాగస్వామిని చేశారు. ఒకరకంగా శోభన్‌బాబు సినీ వ్యాపారమంటూ చేసింది – ఈ పంపిణీ సంస్థలో చేతులు కలపడమొక్కటే! 1979 మార్చి 29న విజయవాడలో ‘లక్ష్మీచిత్ర’ కార్యాలయం ప్రారంభమైంది. ఆంధ్రాలో ‘లక్ష్మీచిత్ర’గా, నైజామ్‌లో ‘శ్రీలక్ష్మీచిత్ర’గా వ్యాపారం నడిచింది. శోభన్ హీరోగా నటించిన ‘కార్తీకదీపం’ తొలి ప్రయత్నంగా విడుదలైంది. అది సూపర్ హిట్. అక్కడ నుంచి ‘లక్ష్మీచిత్ర’ వెనుదిరిగి చూడలేదు. వరుసగా కొన్నేళ్ళు శోభన్ సినిమాలన్నీ ఆ సంస్థే పంపిణీ చేసింది. 1981 మొదట్లో రిలీజైన ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’– లక్ష్మీచిత్ర రిలీజ్లే. శోభన్‌తో చిత్రాలు నిర్మించే స్థాయికి వై. హరికృష్ణ ఎదిగారు. కాట్రగడ్డ ప్రసాద్ ‘వసుధాచిత్ర’తో డిస్ట్రిబ్యూషన్ నడిపి, మేనమామ బాటలో నిర్మాత అయరు. ఇప్పుడు సౌతిండియన్ ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడయ్యారు. మహిళలు మెచ్చిన అందాల నటుడు సినిమాల్లోనే కాదు... చదువుకొనే రోజుల నుంచి అందగాడు శోభన్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. చదువుకొనే రోజుల్లో ఆఖరు నిమిషంలో కాలేజీ ఎన్నికల్లో అనుకోకుండా పాల్గొనాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనకు లేడీ స్టూడెంట్స్ ఓట్లు మూకుమ్మడిగా పడ్డాయి. అనూహ్యంగా ఆయన గెలిచారు. ఆ సంగతి శోభన్‌బాబే స్వయంగా రాశారు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయనకు మహిళా అభిమానులే ఎక్కువ. ‘శారద’, ‘జీవన తరంగాలు’, ‘జీవనజ్యోతి’ చిత్రాల రోజుల నుంచి ఆ ఫాలోయింగ్ అలా కొనసాగుతూ వచ్చింది. అందుకే, ఒక దశ దాటిన తరువాత నుంచి ఆయన తన ప్రధాన అభిమాన వర్గమైన మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేసేవారు. మహిళలు మెచ్చే అంశాలు, సెంటిమెంట్ ఉండేలా చూసుకొనేవారు. 1979 నాటి ‘కార్తీక దీపం’ మొదలు ‘గోరింటాకు’, ‘ఇల్లాలు–ప్రియురాలు’, ‘శ్రావణసంధ్య’(’86) – ఇలా అన్నీ అశేష మహిళాదరణతో ఆయన కెరీర్‌ను అందంగా తీర్చిదిద్దినవే. మరణానంతరం కూడా ఇవాళ్టికీ ఆయనకు ఒక వర్గం అభిమానులు ఉన్నారంటే, దానికి ఆ కథలు, ఆ సినిమాలు అందించిన ఇమేజే కారణం. – రెంటాల జయదేవ -
అక్కడ ఇందిరాగాంధీ, ఇక్కడ వాణిశ్రీ
మగాళ్ళదే పెత్తనమైన రోజుల్లో... అదీ హీరోలదే రాజ్యమైన సినిమా రంగంలో... హీరోయిన్ ప్రాధాన్యంతో సినిమా వస్తే? అదీ ఓ అప్‌కమింగ్ తారతో? పైపెచ్చు, హీరోయిన్ ఓరియంటెడ్ టైటిల్‌తో..అదీ ఏ క్రైమ్ సినిమానో కాకుండా సాంఘికమైతే? ఇప్పుడంటే ఓకే కానీ, బ్లాక్ అండ్ వైట్ కాలంలో... యాభై ఏళ్ళ క్రితం ఇలాంటివి ఆర్థికంగానూ, ఆదరణ రీత్యా కష్టమే. కానీ, వాణిశ్రీ నాయికగా, శోభన్‌బాబుతో దర్శక–నిర్మాత గిడుతూరి సూర్యం చేసిన ప్రయత్నం 1971 మార్చి 25న రిలీజైన ‘కథానాయకురాలు’. ‘తనువా హరిచందనమే...’ లాంటి పాపులర్ పాటలు, విలక్షణమైన విలనీ డైలాగులతో ఆ సినిమా ఇప్పటికీ చాలామందికి గుర్తే. అభ్యుదయ భావాలతో, సామ్యవాదాన్ని ప్రబోధించే భావాలతో సాటి అభ్యుదయ కవులు, రచయితలైన శ్రీశ్రీ, సుంకర సత్యనారాయణ, ఏల్చూరి, రెంటాల గోపాలకృష్ణ తదితరుల సృజనాత్మక భాగస్వామ్యంతో గిడుతూరి చేసిన ఆ ప్రయోగానికి ఇప్పుడు 50 వసంతాలు. లేచింది... నిద్రలేచింది మహిళాలోకం! అది 1971. అప్పుడప్పుడే సమాజంలో మార్పు వస్తోంది. వివిధ రంగాలలో స్త్రీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరా గాంధీ సారథ్యంలో సరికొత్త కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 1966 జనవరిలోనే తొలిసారి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ, తాజాగా మధ్యంతర ఎన్నికలతో దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు. అప్పటికే ఆమె రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతో నెహ్రూ మార్కు సోషలిజానికి తన దూకుడును జోడించారు. ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మహిళ నాయకురాలై, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న వేళ అది. సమాజంలోని మార్పులకు తగ్గట్టుగా సినిమాల్లో కథలు, స్త్రీ పాత్రలు మారాల్సిన సమయం వచ్చింది. స్త్రీలను చేతకానివాళ్ళుగా, వంటింటి కుందేళ్ళుగా చూపిస్తే ఇష్టపడరనే ఆలోచన మొదలైంది. సినీ విశ్లేషకుడు, సినీ పంపిణీ రంగ నిపుణుడు స్వర్గీయ కాట్రగడ్డ నరసయ్య మాటల్లో చెప్పాలంటే, ‘‘సమాజ అభివృద్ధిలో, సంఘంలోని కుళ్ళును కడిగేయడంలో ముఖ్యపాత్ర వహించేవారిగా స్త్రీలను చూపించాల్సిన అవసరం వచ్చింది. తెరపై వీరోచిత చర్యలను కథానాయకులు చేసినట్లే స్త్రీలే ప్రాముఖ్యం వహించే పాత్రలు అవసర’’మయ్యాయి. సరిగ్గా ఆ పరిస్థితుల్లో వచ్చినవే – భానుమతి నటించిన ‘మట్టిలో మాణిక్యం’. ఆ వెనువెంటనే వాణిశ్రీ ‘కథానాయకురాలు’. సూపర్‌హిట్ శోభన్‌బాబు– వాణిశ్రీ ఇందిరా గాంధీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సరిగ్గా వారం రోజులకు వచ్చిన చిత్రం ‘కథానాయకురాలు’. సామ్యవాదాన్ని ప్రబోధిస్తూ, లేడీ ఓరియంటెడ్ టైటిల్‌తో అలా ఓ సినిమా రావడం అప్పట్లో విశేషం. గిడుతూరి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూర్చి, నల్ల వెంకట్రావుతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా హీరోను విప్లవ నాయకుడిగా చూపించడం బాక్సాఫీస్ ఫార్ములా. కానీ, కార్మిక సంఘ నాయకురాలిగా హీరోయిన్ను చూపించడం, ఆమె ఓ ధనిక యజమానితో కార్మిక ప్రయోజనాల కోసం పోరాడడం వెరైటీ. ‘మనుషులు మారాలి’ (1969) లాంటి హిట్స్‌తో పేరు తెచ్చుకొని, హీరోగా స్థిరపడుతున్న రోజుల్లో శోభన్‌బాబు కథానుగుణమైన ఆ టైటిల్‌కి ఒప్పుకోవడం విశేషం. శోభన్–వాణిశ్రీ జంట తర్వాతి కాలంలో ‘చెల్లెలి కాపురం’, ‘జీవన తరంగాలు’, ‘ఖైదీ బాబాయ్’, ‘జీవనజ్యోతి’తో హిట్ పెయిర్‌గా నిలవడం గమనార్హం. ‘కథానాయకురాలు’ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ కథలో చేసిన శోభన్ ఆనక హీరోయిన్ల హీరోగా, హీరోలు సైతం అసూయపడే అందాల నటుడిగా ఇమేజ్ సాధించడం ఓ చరిత్ర. తారాపథానికి... ‘కథానాయకురాలు’ వాణిశ్రీ అనాథైన ఒక పేదపిల్ల చదువు – సంస్కారం అలవరచుకొని, నాయకురాలై, కార్మిక ఉద్యమాన్ని ఎలా జయప్రదంగా నడిపిందీ, సంఘవిద్రోహుల్ని ఎలా ఎదిరించిందీ కార్మిక విప్లవ ప్రబోధ చిత్రం ‘కథానాయకురాలు’ చూపెడుతుంది. కార్మికుల హక్కుల కోసం ప్రాణాలకు తెగించే హీరోయిన్, ధనికుల బిడ్డ అయినా తానెవరో చెప్పకుండా హీరోయిన్ పోరాటానికి అండగా నిలిచే హీరో, కార్మికలోకాన్ని అణచివేయాలనుకొనే మిల్లు నిర్వాహకుడు – ఈ 3 ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ మూడు పాత్రల్లో వాణిశ్రీ, శోభన్‌బాబు, నాగభూషణం ఆకట్టుకుంటారు. ఇంకా అల్లు రామలింగయ్య, కాకరాల, ఛాయాదేవి, రామ్మోహన్, రావుగోపాలరావు, కామెడీకి రాజబాబు– ఇలా పేరున్న తారాగణమే ఉంది. ‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న పాత్రలో నటించారు. అప్పటికే వాణిశ్రీ తారాపథానికి పరుగులు తీస్తున్నారు. ఎన్టీఆర్ ‘కోడలు దిద్దిన కాపురం’, అక్కినేని ‘దసరా బుల్లోడు’ హిట్స్ తరువాత ‘కథానాయకురాలు’ వస్తే, ఆ వెంటనే కృష్ణ ‘అత్తలూ – కోడళ్ళు’, ఆ ఏడాదే శోభన్‌తోనే ‘చెల్లెలి కాపురం’ – ఇలా హీరోలందరి పక్కనా వాణిశ్రీ మెరిశారు. అయితే, ఒక రకంగా ఈ సినిమా వాణిశ్రీ బహుముఖ నటనను తెరపై చూపే రకరకాల గెటప్పులకు అవకాశమిచ్చింది. కార్మికనేతగా, ప్రేయసిగా, హిరణ్యకశిపుడిగా, తమిళ యువతిగా – విభిన్న వేషాలలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు. ఎన్టీఆర్ ‘సంగీతలక్ష్మి’ తీసిన సూర్యమే... దర్శకుడు గిడుతూరి సూర్యం పేరు చెప్పగానే ఎన్టీఆర్ – జమునల ‘సంగీతలక్ష్మి’, యస్వీఆర్ – రామకృష్ణల ‘విక్రమార్క విజయం’, కాంతారావు ‘రణభేరి’, విజయలలిత ‘పంచకల్యాణి– దొంగల రాణి’, మంజుభార్గవి ‘అమృతకలశం’ లాంటి వేర్వేరు కోవల సినిమాలు సినీ ప్రియులకు గుర్తుకొస్తాయి. ప్రసిద్ధ సినీ దర్శకులు కృష్ణన్ – పంజు, భీమ్సింగ్లకు ఆయన శిష్యుడు. లేఖా జర్నలిస్టుగా, రచయితగా జీవితం ప్రారంభించి సినిమాల్లో ఎదిగిన ఆయన ఆ తరం అభ్యుదయ కవి, రచయిత. విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, నాట్యాచార్యులు పసుమర్తి కృష్ణమూర్తి – డి. వేణుగోపాల్‌ల వద్ద కథారచన, చిత్రలేఖనం, కవిత్వం, నాటక రచన, నృత్యం – ఇలా అనేక కళలను నేర్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కళారాధనలో... కమ్యూనిస్టులు అభ్యుదయ కవులు బెల్లంకొండ రామదాసు, అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరిసుబ్రహ్మణ్యం,రెంటాల గోపాల కృష్ణ తదితరులు గిడుతూరికి మిత్రులు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ చదివి, ‘ప్రజానాట్యమండలి’లో, ‘ఇండియన్ నేషనల్ ఆర్ట్ థియేటర్’లో గిడుతూరి నాటక రచన, దర్శకత్వం చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. బలిజేపల్లి వద్ద నాటక, సినీ రచన నేర్చిన ఆయన రష్యా వెళ్ళి, అక్కడి మాస్కో మాస్ ఫిలిమ్ స్టూడియోలో శిక్షణ పొంది వచ్చాక, ఎన్టీఆర్ ‘సంగీత లక్ష్మి’ (1966)తో మొదలుపెట్టి పలు చిత్రాలను రూపొందించారు. ‘సంగీత లక్ష్మి’ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి, ‘సంగీత లక్ష్మి’, ‘కథానాయకురాలు’ రెండూ గిడుతూరి నవలల ఆధారంగా వచ్చిన సినిమాలే. భార్య సరస్వతీదేవి పేరిట ‘శ్రీ సరస్వతీ చిత్ర’ పతాకం నెలకొల్పి, ఆయన సినిమాలు తీశారు. ఏంచేసినా అభ్యుదయ భావాల్ని వదిలిపెట్టలేదు. సినిమాలతో సహా తన ప్రతి సృజనలోనూ వాటిని వీలైనంతగా జొప్పించేవారు. ‘కథానాయకురాలు’ కూడా ఆ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే. ఆ గీతాలన్నీ అభ్యుదయ రచయితలవే! అభ్యుదయ కవులు శ్రీశ్రీ,ఆరుద్ర,ఏల్చూరితో ‘కథానాయకురాలు’కి పాటలు రాయించారు గిడుతూరి. ‘‘సోషలిస్టు విధానాల కోసం మన ఇందిరాగాంధీ బడా నాయకుల్ని ఎదిరించి, ఘనవిజయం సాధించింది! కార్మిక సంక్షేమం కోసం మన కథానాయకురాలు దుష్టశక్తుల నెదిరించి, అపూర్వ విజయం సాధించింది!’’ అని ఈ సినిమా గురించి ఆ రోజుల్లో ప్రముఖంగా ప్రకటించారు. ‘అభినవ ప్రహ్లాద చరితం’ అంటూ దరిద్ర నారాయణుడే దేవుడిగా శ్రీశ్రీ రాసిన నాటకం హైలైట్. అలాగే, ‘మాభూమి’ నాటకకర్త సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ మరో హైలైట్. తర్వాతి కాలంలో ‘ఆంధ్రభూమి’ వీక్లీ ఎడిటర్‌గా పాపులరైన సికరాజు కూడా సినిమాలో జ్యోతిలక్ష్మిపై వచ్చే ‘చూడు షరాబీ...’ అనే శృంగార గీతం రాశారు. సెక్సప్పీల్ వల్లే సక్సెస్‌లా? ‘‘ధనస్వామ్యమా, జనస్వామ్యమా? ఈనాడు దేశానికేది కావాలి?’’ అని కథానాయకురాలు ద్వారా దర్శక – నిర్మాత ప్రశ్న సంధించారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అందమైన లోగో, డిజైన్లతో ఉగాది కానుకగా, 1971 మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి, ఆ ఫిబ్రవరిలోనే గిడుతూరి దర్శకత్వంలోనే ‘విక్రమార్క విజయం’ వచ్చింది. సక్సెస్ అయింది. ఆ వెంటనే స్వీయ నిర్మాణమైన ఈ సాంఘికంతో పలకరించారు గిడుతూరి. దేశంలో సెక్స్, క్రైమ్ చిత్రాలకే తప్ప, చక్కనికథతో సినిమా తీస్తే, దానికి డబ్బు రావడం లేదని అప్పటికే ఆయన ఆవేదన చెందుతూ ఉండేవారు. అందుకు తగ్గట్టే ‘కథానాయకురాలు’ పేరు తెచ్చినంత, డబ్బు తేలేదు. కాకపోతే, బి, సి సెంటర్లలో రిపీట్ రన్లతో ఎంతో కొంత లాభమే తెచ్చింది. అప్పటికే ఆడుతున్న ‘దసరా బుల్లోడు’, ‘రాజకోట రహస్యం’ లాంటి వాణిజ్య సినిమాల మధ్య కార్మిక విప్లవం లాంటి ప్రబోధాలిచ్చిన ‘కథానాయకురాలు’ నలిగిపోయింది. అయితే ‘తనువా...’ లాంటి పాటలతో, మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని చాటిన చిత్రంగా ‘కథానాయకురాలు’ ఇప్పటికీ ప్రత్యేకమే! ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్! అన్ని రకాల పాటలున్న ‘కథానాయకురాలు’లో ‘తనువా హరిచందనమే...’ పాట మాత్రం ఇవాళ్టికీ హైలైట్. హీరో శోభన్ బాబు, హీరోయిన్ వాణిశ్రీల కెరీర్లో పాపులర్ క్లాసికల్ హిట్ సాంగ్ ఇది. ఈ సినిమా రిలీజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందరే 1971 మార్చి 21న ఆలిండియా రేడియో హైదరాబాద్, విజయవాడల్లో వివిధ భారతి – వాణిజ్య ప్రసారాలను ప్రారంభించారు. రేడియోలో తరచూ సినీగీతాలు వినే సావకాశం తెలుగునాట దక్కింది. ఆ వెంటనే ఆ నెలాఖరునే వాణిశ్రీయే హీరోయిన్ గా నటించిన ఎన్టీఆర్ ‘జీవితచక్రం’తో తెలుగు సినిమాలకు రేడియో పబ్లిసిటీ కూడా తొలిసారిగా మొదలైంది. మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా ‘తనువా హరిచందనమే’ పాట ఎస్పీబీ, పి. సుశీల గళాల్లో రేడియోలో తరచూ వినిపిస్తూనే ఉంది. టీవీలో, యూ ట్యూబుల్లో కనిపిస్తూనే ఉంది. ప్రసిద్ధ సినీ గాయని చిత్ర సైతం ఇటీవలే ఓ టీవీ షోలో ఈ పాట పాడడం దీనికున్న పాపులారిటీకి తాజా నిదర్శనం. సినీ రంగంలో ఎ.ఎ. రాజ్ గా ప్రసిద్ధుడైన మ్యూజిక్ డైరెక్టర్ ఆకుల అప్పలరాజుకు ఇది కెరీర్ బెస్ట్ సాంగ్. గమ్మత్తేమిటంటే, తక్కువ పాటలే రాసినా, ఈ ఒక్క పాట సినీ గీత రచయితగా గోన విజయరత్నాన్ని చిరంజీవిని చేసింది. డైలాగుల్లో... విప్లవతత్వం! విలనీ!! గిడుతూరి సూర్యం తన ఆప్తమిత్రుల్లో ఒకరైన ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, నాటకకర్త రెంటాల గోపాలకృష్ణకు సినిమా సంభాషణల రచన బాధ్యత అప్పగించారు. అప్పటికే ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదక వర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న రెంటాల అనేక అనువాదాలు, రచనలు చేసిన సుప్రసిద్ధులు. సినీ రంగంతో అనుబంధం, సినీ విమర్శకుడిగా పేరూ ఉన్నవారు. రంగస్థలంపై పేరున్న రెంటాల అంతకు ముందు గిడుతూరి తీసిన జానపదం ‘పంచకల్యాణి – దొంగలరాణి’ (1969 ఆగస్టు 2)కి డైలాగ్స్ రాశారు. ప్రజానాట్యమండలిలో, బెజవాడ హనుమంతరాయ గ్రంథాలయం ఆంధ్ర ఆర్ట్ థియేటర్లో నటుడిగా, నాటకకర్తగా కృషిచేసిన రెంటాల సామ్యవాదాన్ని ప్రబోధించే సాంఘిక చిత్రం ‘కథానాయకురాలు’లోనూ తన కలం పదును మరోసారి చూపారు. యజమాని, కార్మికుల సంఘర్షణ ప్రధాన ఇతివృత్తమైన ఈ చిత్రానికి రెంటాల రాసిన సంభాషణలు ‘‘ఆయా సన్నివేశాలకు తగినట్టు భావస్ఫోరకంగా, విప్లవతత్వాన్ని వెదజల్లుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అప్పట్లో సినీ విమర్శకులు, సమీక్షకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రత్యేకించి, ‘‘సత్యారావు పాత్ర ధరించిన నటుడు నాగభూషణానికి రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి’’ అని పేర్కొన్నారు. రంగస్థలంపై మిత్రులు ఆచార్య ఆత్రేయ ‘విశ్వశాంతి’, అనిసెట్టి ‘గాలి మేడలు’ సహా అనేక నాటకాల్లో రెంటాల నటించారు. ఈ సినిమాలోనూ ఫ్యాక్టరీలో జీతాల పంపిణీ వేళ కార్మికుడు గోపయ్యగా కీలక ఘట్టంలో వెండితెరపైనా కనిపించడం విశేషం. బొంబాయి స్ఫూర్తితో... బెజవాడ దుర్గాకళామందిరం! 1920 జనవరి 17న ఏలూరులో సంపన్న చేనేత కుటుంబంలో జన్మించిన గిడుతూరి సూర్యంకి కళల పట్ల ఆసక్తి కలగడానికి ప్రేరణ ఒక రకంగా విజయవాడలోని ప్రసిద్ధ శ్రీదుర్గాకళామందిరం. బెజవాడలో నాటకశాలగా మొదలై 90 ఏళ్ళు దాటినా ఇప్పటికీ సినిమా హాలుగా నడుస్తున్న దుర్గాకళామందిరం నిర్మాణంలో గిడుతూరి తండ్రి బంగారు పాత్ర చాలా ఉంది. 1920లలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఆజ్ఞపై బొంబాయి వెళ్ళి, నాటకాలు ప్రదర్శించే థియేటర్లు సందర్శించి వచ్చారు బంగారు. బొంబాయి థియేటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్నీ, స్టేజీ ఏర్పాట్లనూ అనుసరిస్తూ, 1929 జూన్ ప్రాంతంలో పంతులు గారికి విజయవాడలో దుర్గాకళామందిరం నిర్మాణం చేశారు. ప్రదర్శకుల కోసం రొటేటింగ్ డిస్క్, వైర్ వర్క్స్, పాతాళంలోకి వెళ్ళేటట్టు స్టేజీ పైన అక్కడక్కడా పలకలు కిందకు తెరుచుకొనే ఏర్పాట్లు, ఇంకా అనేక టెక్నికల్ సదుపాయాలను కళామందిరంలో గిడుతూరి తండ్రి కల్పించారు. అనేక ప్రఖ్యాత నాటక సంస్థలు ఆయన కూర్చిన టెక్నికల్ సదుపాయాలతో అప్పట్లో అక్కడ అద్భుత ప్రదర్శనలిచ్చేవి. పంతులు గారి ప్రోత్సాహంతో దుర్గాకళామందిరంలో నిత్యం నాటకాలు, మూకీలు చూస్తూ కళల వైపు మొగ్గారు గిడుతూరి. అదే ఆయన సినీరంగ ప్రస్థానానికి బాటలు వేసింది. – రెంటాల జయదేవ చదవండి: హీట్ పెంచుతున్న కృతి.. సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు విషయం ఇదే! -
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ..!
తారకరామ పిక్చర్స్ వారి సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, శోభన్‌బాబు నారదుడిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం.. ‘‘నారద మునీంద్రా! దేవగణం మహర్షి మండలంతో పాటు భూదేవి కూడా మా సన్నిధానానికి వచ్చింది. ఏమిటి విశేషం?’’ ఆరా తీశాడు శ్రీమహావిష్ణువు. ‘‘సర్వజ్ఞడవు. నీకు తెలియనిది ఏముంది స్వామి! దానవుల బాధలను భరించలేకే మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చారు’’ అని చెప్పాడు నారదుడు. ‘‘యజ్ఞయాగాదులు సాగడం లేదు. నానా హింసలకు లోనవుతున్నాం. భూలోకం నరకమైపోతున్నది. సర్వలోక శరణ్యుడైన మీరు అడ్డుపడకపోతే ధర్మానికి నిలువ నీడ ఉండదు’’ అని వాపోయారు మునులు. ‘‘ధర్మానికి అంత హాని సంభవించిందా!’’ అని అడిగింది లక్ష్మీదేవి. ‘‘దానవాంశసంభూతులైన కంస,నరకాసుర, జరాసంధుల అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఆ పాపభారం భరించలేకుండా ఉన్నాను తల్లీ’’ అన్నది బాధగా భూమాత. ‘‘దేవీ భూమాతా! కలవరపడకు. ఆచిరకాలంలోనే దేవకి గర్భవాసాన శ్రీకృష్ణుడనై జన్మించి పాప భారాన్ని నిర్మూలిస్తాను. దుష్టశిక్షణ, శిష్టరక్షణ శ్రీకృష్ణావతార పరమార్థం’’ అని హమీ ఇచ్చాడు శ్రీమహావిష్ణువు. భూలోకంలో.... చెల్లి. బావలను కూర్చొబెట్టుకొని రథం నడుపుతున్నాడు కంసుడు. ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఇంతలో ఆకాశవాణి గర్జించింది... ‘‘కంస రాజేంద్రా! మూర్ఖుడవై ముందున్న ముప్పు తెలుసుకోలేకుండా ఉన్నావు. ఆమె అష్టమగర్భమే నీ పాలిట మృత్యువై నిన్ను అంతరింపజేస్తుంది’’ అప్పటి వరకు ఆనందోత్సాహాలతో ఉన్న కంసుడికి చెమటలు పట్టాయి. అప్పటి వరకు చెల్లితో ఎంతో ప్రేమగా మాట్లాడిన కంసుడు ఆకాశవాణి హెచ్చరికతో ఒంటికాలి మీద లేచి... ‘‘ఆమె అష్టమగర్భమే నా పాలిట మృత్యువా? ఏమిటి ఈ వైపరీత్యం?’’ అని చెల్లి మీది కత్తి దూయబోయాడు. ‘‘అన్నా.. నన్ను ప్రేమతో పెంచి పెళ్లి చేసింది నీ చేతులారా వధించడానికేనా? నీ భయంకర కరవాలానికి నన్ను బలి చేస్తావా?’’ రోదిస్తూ అన్నను అడిగింది దేవకి. చెల్లెలి రోదన విని కూడా ఆ అన్న మనసు కరగడం లేదు. కోపంతో బుసలు కొడుతూనే ఉన్నాడు కంసుడు. అప్పుడు వసుదేవుడు కంసుడి భుజం మీద చేయి వేసి... ‘‘బావా తొందరపడకు! ఎట్టి పాపం ఎరుగని అమాయకురాలు. ఈమెను వధించుట ధర్మమేనా? నీ మృత్యుకారణం ఈమె సంతానమేగానీ ఈమె కాదు కదా బావా’’ అన్నాడు. ‘‘కాని ఈమె జనించే ప్రతి శిశువును పుట్టగానే మాకు అప్పగించాలి’’ అని షరతు విధించాడు కంసుడు. ‘‘తప్పకుండా అప్పగిస్తాను బావా’’ ఒప్పుకున్నాడు వసుదేవుడు. ‘‘నేటి నుంచి కారాగారమే మీ నివాసమందిరం’’ అంటూ చెల్లి బావలను కనికరం లేకుండా కారాగారంలో వేశాడు కంసుడు. కొంతకాలం తరువాత... ‘‘బావా! ఇదిగో దేవకి ప్రథమగర్భం. నా మాట నిలబెట్టుకున్నా! ఆపై నీ దయ!’’ అంటూ శిశువును కంసుడికి అప్పగించాడు వసుదేవుడు. ‘‘విధికి నా మీద లేని దయ నాకు ఈ శిశువు మీదనా!’’ అంటూ ఆ శిశువును ఆకాశంలోకి విసిరేసి కత్తి వేటుకు బలి చేశాడు కంసుడు. చేదిరాజు శిశుపాలుడు మందువిందులో తేలియాడుతున్నాడు. ‘‘ఆనందానికి అంతరాయం కలుగలేదు కదా’’ అంటూ అప్పుడే అక్కడకు వచ్చాడు నారదుడు. ‘‘ఇది నిరంతరం సాగే నిత్యానందం’’ అన్నాడు దంతవక్త్రుడు. ‘‘ఈ ఆనందం తాత్కాలికమే కాని శాశ్వతం కాదు దంతవక్త్రా’’ వేదాంత ధోరణిలో అన్నాడు నారదుడు. ‘‘శాశ్వత ఆనందమార్గం?’’ అడిగాడు చేదిరాజు. ‘‘సంసారత్యాగం చేసి సన్యాసులం కావడమే’’ కాస్త వ్యంగ్యంగా అన్నాడు దంతవక్త్రుడు. ‘‘నారాయణ నారాయణ... ఆ యోగం అందరికీ లభ్యం కాదయ్యా. తగిన రాచకన్యను పెళ్లాడి సాటి రాజుల్లో కీర్తిని సంపాదించండి’’ అని సలహా ఇచ్చాడు నారదుడు. ‘‘మా ఘనతకు తగ్గ కన్య తారసిల్లాలి కదా మహర్షి’’ అన్నాడు చేదిరాజు. ‘‘మీ ప్రాణస్నేహితుడు విదర్భరాకుమారుడు... ఆమె చెల్లెలు రుక్మిణీ...’’ గుర్తు చేశాడు నారదుడు. ‘‘చక్కగా గుర్తు చేశారు మహర్షి. ఆ బాలామణి అత్యంత సుందరీమణే’’ కళ్లలో సంతోషం ఉట్టిపడుతుండగా అన్నాడు చేదిరాజు. ‘‘దూరంగా ఉన్నవారని నిన్నే నమ్ముకున్నవారిని నిరాదరిస్తావా?’’ కాస్త ఆలకబూని అడిగాడు నారదుడు. ‘‘నిరాదరణా! అది నేను ఎన్నడూ చేయలేదే’’ అన్నాడు కృష్ణుడు. ‘‘సాక్షాత్తు ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణిదేవిని ఆ శిశుపాలునికి అంటగట్టబోతున్నారు. అహోరాత్రాలు నిన్నే కలవరించే ఆ రుక్మిణీదేవికి ఈ అవమానం జరగాల్సిందేనా!’’ విచారపడ్డాడు నారదుడు. రుక్మిణీదేవి కన్నీరుమున్నీరవుతోంది. ‘‘స్వామీ! ఎందుకు ఈ మౌనం. ఎంతకాలం ఈ ఏకాంతధ్యానం. నా మనసును ఎందుకు అపహరించావు?’’ తనలో తాను గొణుక్కుంటోంది రుక్మిణీదేవి. ఈలోపు చెలికత్తె పరుగెత్తుకు వచ్చి... ‘‘అమ్మా... అంతా అయిపోయిందమ్మా... పెళ్లి నిశ్చయమైపోయింది’’ అని ఆందోళనగా చెప్పింది. ‘‘నాకు తెలియకుండా ఎవరు వరుడు?’’ అని అడిగింది రుక్మిణి ‘‘ఆ శిశుపాలుడే’’ అని చెప్పింది చెలికత్తె. కృష్ణుడిని బొమ్మను చేతిలోకి తీసుకొని... ‘‘కృష్ణా! కృష్ణా!! ఈ సంబంధం నీకు ఇష్టం లేదని చెప్పు...’’ అంటూ కన్నీళ్లపర్యంతం అయింది రుక్మిణీదేవి. ‘‘ఈ వివాహం నాకు ఇష్టం లేదు అని చెప్పండి’’ అని చెప్పింది చెలికత్తె. ‘‘ఎలా చెప్పేది? ఇంతవరకు ఎన్నడూ అన్నయ్య మాటకు ఎదురాడలేదు’’ సంశయంగా అన్నది రుక్మిణీదేవి. ‘‘అలా అని మీ పచ్చని జీవితం పాడు చేసుకుంటారా. మీ ఆశయాలు, అనురాగాలు నాశనం చేసుకుంటారా!’’ అడిగింది చెలికత్తె. ‘‘అన్నయ్య తన పట్టేగానీ మన గోడు ఆలకించడు. ఈ కళ్యాణాన్ని ఆపగల సమర్థుడు ఆ వాసుదేవుడొక్కడే’’ కృష్ణుడిపై భారం వేస్తూ అన్నది రుక్మిణి. సమాధానం : శ్రీ కృష్ణావతారం -
అమ్మ.. నాన్న.. ఓ అమృత!
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వారసుల వివాదంలో ప్రజల మదిలో ఎన్నాళ్లుగానో ఉన్న ప్రశ్నను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తే సంధించారు. తల్లి సంగతి సరే మరి తండ్రి మాటేమిటి అని బెంగళూరు యువతి అమృతను శుక్రవారం ప్రశ్నించారు. సాక్షి, చెన్నై: సినీనటిగా జయలలిత వెలుగొందుతున్న కాలంలో తల్లి సంధ్య అకస్మాత్తుగా కన్నుమూశారు. తల్లి తోడుకరువైన జయలలిత శోభన్‌బాబుకు చేరువైనట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు గుసగుసలకు పోయారు. జయ, శోభన్‌బాబుల ప్రేమఫలంగా కుమార్తె జన్మించిందని ఒక వార్త ఆనాటి నుంచి నేటికీ ప్రచారంలో ఉంది. అదేమీ లేదు.. కేవలం తల్లి మృతితో కలత చెందిన జయలలితకు తన మాటలతో శోభన్‌బాబు ఊరటనిచ్చారని కొందరు ఆ పుకార్లను కొట్టిపారేశారు. డీఎంకే ప్రచారాస్త్రంగా వాడుకోవడం.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినపుడల్లా శోభన్‌బాబుకు జయలలిత భోజనం వడ్డిస్తున్న ప్రయివేటు ఫొటోలను డీఎంకే ప్రచారాస్త్రంగా వాడుకోవడం, ఎన్నికలు ముగిసిన తరువాత ఆ ఆంశం అటకెక్కేయడం పరిపాటిగా మారింది. అయితే ఐదేళ్లకొకసారి వచ్చే జయ, శోభన్‌బాబు వ్యవహారం జయలలిత కన్నుమూసిన తరువాత తరచూ తెరపైకి వస్తోంది. మేమే వారసులం అంటూ పోటీ.. జయకు వారసులమంటూ ముగ్గురు వ్యక్తులు పోటీపడ్డారు. వీరిలో ఇద్దరు కొన్నాళ్లు మీడియా ముందుకు వచ్చి ఆ తరువాత తెరమరుగయ్యారు. అయితే బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి మాత్రం తానే జయ వారుసురాలినని పట్టుదలతో పోరాడుతోంది. సుప్రీంకోర్టుకు ఎక్కింది. స్థానిక న్యాయస్థానంలో ముందుగా తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించడంతో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసేందుకు, డీఎన్ఏ పరీక్షకు సిద్ధమైంది. అయితే జయలలిత కన్నుమూసింది చెన్నైలో కావడంతో జయలలిత కుమార్తెగా ప్రకటించాలని కోరుతూ బెంగళూరు రామచంద్ర గ్రామానికి చెందిన ఎస్ అమృత, అదే ఊరికి చెందిన ఎల్ఎస్ లలిత, రంజనీ రవీంద్రనాథ్ మద్రాసు హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ వేశారు. అమృత జయలలిత కూతురని.. తాము దివంగత ముఖ్యమంత్రి జయలలిత బంధువులమని, అమృత జయలలిత కూతురని పేర్కొన్నారు. జయలలితకు తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగాల్సి ఉన్నందున అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, సీనియర్ న్యాయవాది ప్రకాష్ హాజరై అమృత డీఎన్ఏ పరీక్షలకు అనుమతివ్వాలని, అలాగే బంధువులు కోరిన మరో మూడు కోర్కెలను అంగీకరించాలని న్యాయమూర్తి వైద్యనాథన్‌ను కోరారు. ఇవన్నీ విన్న న్యాయమూర్తి మాట్లాడుతూ.. దివంగత నటుడు శోభన్‌బాబునే అమృత నాన్న అని మీరు పిటిషన్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. జయలలితనే తన తల్లి అని అమృతకు ముందుగా తెలియాల్సి ఉందని న్యాయవాది బదులిచ్చారు. అడ్వకేట్ జనరల్ విజయ నారాయణన్ తన వాదనను వినిపిస్తూ, అమృత వేసిన పిటిషన్ విచారణకు అనర్హమైనదని స్పష్టం చేయాల్సి ఉందని, అప్పటి వరకు న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీచేయరాదని కోరారు. అనుమానాలపైనే వారంతా పిటిషన్లు వేశారు, వారి వద్ద ఆధారాలు, ఫొటోలూ ఏమీ లేవని చెప్పారు. అమృత తదితరులు వేసిన పిటిషన్ అర్హతపై తాము నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి బదులిచ్చారు. మరలా న్యాయవాది ప్రకాష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా లేనప్పుడల్లా జయలలిత బెంగళూరుకు వెళ్లి పిటిషన్‌దారుల ఇళ్లలోనే ఉండేవారని, జయ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అమృత చెన్నైకి వచ్చి పోయెస్‌గార్డెన్ నివాసానికి వెళ్లి కలిసేవారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం, చెన్నై కార్పొరేషన్ బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీకి వాయిదావేశారు. -
గ్లామర్ గ్రామర్ హ్యూమర్
-
విజయవాడ తరలిన శోభన్‌బాబు విగ్రహం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని వుడయూర్ శిల్పశాలలో రూపొందిన ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు విగ్రహాన్ని బుధవారం విజయవాడకు తరలించారు. 8 అడుగుల ఆ కాంస్య విగ్రహాన్ని విజయవాడ గాంధీనగర్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు శిల్పి రాజ్‌కుమార్ వుడయూర్ తెలిపారు. శోభన్‌బాబు స్వగ్రామం కృష్ణా జిల్లా మైలవరం మండలం చిననందిగామ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బంధువులు, ఆయన అభిమానుల కోరిక మేరకు శోభనబాబు కుమారుడు కరుణశేషు ఆధ్వర్యంలో విగ్రహాన్ని విజయవాడలో నెలకొల్పుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాజమండ్రి, చెన్నై, విశాఖపట్నం, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేసిన శోభన్‌బాబు విగ్రహాలన్నీ తాము తయూరు చేసినవేనని ఆయన వెల్లడించారు. అన్ని విగ్రహాలూ ఒకే రీతిలో తయారు చేయడానికి గల కారణాలను ఈ సందర్బంగా ఆయన వివరించారు. రెండు చేతులతో కోటును పట్టుకున్నట్టు ఉండే విగ్రహాలు బాగున్నాయని ప్రశంసలు రావడంతో విజయవాడలో కూడా అదే తరహాలో విగ్రహాన్ని రూపొందించామని రాజ్‌కుమార్ వుడయూర్ చెప్పారు. ఈ విగ్రహాన్ని ఈ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించ వచ్చని పేర్కొన్నారు. -
పోలీస్ పహారాలో 'శోభన్‌బాబు'
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని తెలుగు సినీ నటుడు దివంగత శోభన్‌బాబు విగ్రహం తొలగించాలని తమిళగ మున్నేట్ర దళం(టీఎండీ) ఆందోళనకు పిలుపు నివ్వడంతో సోమవారం ఆ విగ్రహానికి పోలీసులు రక్షణ కల్పించారు. ముం దు జాగ్రత్తగా టీఎండీ కార్యదర్శి కె. వీరలక్ష్మి ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శోభన్‌బాబు మరణించిన తరువాత చెన్నై మెహతానగర్ నెల్సన్ మాణిక్యం రోడ్డు మలుపులో ఆయన విగ్రహం నెలకొల్పారు. ఆయన ఇంటికి ఎదురుగా వారి సొంత స్థలంలో కుటుంబ సభ్యులే 2008లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ పీఠాన్ని పుట్‌పాత్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని 2012లో కొంత వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శోభన్‌బాబు విగ్రహాన్ని తొలగించాలనే డిమాండ్‌పై ఆందోళన చేయనున్నట్లు టీఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శోభన్ బాబు విగ్రహాన్ని తొలగించాలనే డిమాండ్ చేస్తూ సోమవారం ఆందోళన చేయబోతున్నట్లు తమిళగ మున్నేట్ర దళం కార్యదర్శి కే వీరలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు నిన్న స్థానికులు విగ్రహం వద్ద గుమికూడి ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు శోభన్ బాబు విగ్రహానికి రక్షణగా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వీరలక్ష్మిని, తోటి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ విషయంలో శోభన్‌బాబు కుమారుడు కరుణశేషుకు తెలుగు సంఘాలు అండగా నిలిచాయి. తెలుగు ప్రముఖులు రంగనాయకులు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సూర్యప్రకాశరావు, తంగుటూరి రామకృష్ణ కరుణశేషును కలసి సంఘీభావం తెలిపారు. -
శోభన్‌బాబు విగ్రహాన్ని తొలగించాలి: టీఎండీ
-
విష్ణులో నాకు శోభన్‌బాబు కనిపిస్తాడు : దాసరి
‘‘విష్ణులో అందరికీ యాక్షన్ హీరో కనిపిస్తే, నాకు మాత్రం శోభన్‌బాబు కనిపిస్తాడు. అతను ఎంత మంచి నటుడో ఈ చిత్రం నిరూపిస్తుంది. నాతో పోటీ పడి మరీ విష్ణు నటించాడు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు కథానాయకుడు. కేథరిన్ కథానాయిక. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోహన్‌బాబు పాటల సీడీని ఆవిష్కరించి, సీనియర్ నిర్మాత కె.రాఘవకు అందించారు. ఇ.వి.వి.కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి పదివేల నూట పదహారు రూపాయలకు ఆడియో సీడీని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘తమిళ చిత్రం ‘మంజప్పై’కి ఇది రీమేక్. తాతా మనవళ్లుగా ఇందులో నేనూ, విష్ణు నటించాం. పతాక సన్నివేశాల్లో విష్ణు నటన కంటనీరు తెప్పిస్తుంది. చక్రి వినసొంపైన గీతాలు అందించాడు. ‘ఐస్‌క్రీమ్’ ఫేమ్ అంజి కెమెరా పనితనం అద్భుతం. ఇక బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి హైలైట్. తప్పకుండా నా బ్లాక్‌బస్టర్స్‌లో ‘ఎర్రబస్సు’ కూడా ఒకటవుతుంది’’ అని చెప్పారు. కుమారుడు అరుణ్‌కుమార్ రూపంలో ఇంట్లోనే ఓ హీరో ఉండగా, విష్ణుకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన నా గురువు, దైవం దాసరిగారికి కృతజ్ఞతలని మోహన్‌బాబు పేర్కొన్నారు. దాసరి విజయవంతమైన చిత్రాల్లో ‘ఎర్రబస్సు’ కూడా ఒకటిగా నిలవాలని కృష్ణ, విజయనిర్మల ఆకాంక్షించారు. ‘ఎర్రబస్సు’తో 151వ చిత్రం చేస్తున్న దాసరి, త్వరలోనే దర్శకునిగా 200 చిత్రాలు పూర్తి చేయాలని కృష్ణంరాజు అభిలషించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లు సినీరంగంలో స్టార్డమ్ అనేదాన్ని క్రియేట్ చేస్తే, దర్శకులకు స్టార్డమ్ తెచ్చిన ఘనత దాసరిదేనని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కొనియాడారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు కె.రాఘవేంద్రరావు, జమున, జయసుధ, గీతాంజలి, గిరిబాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.