
పెళ్లి ముహూర్తం పెట్టాల్సిన సమయంలో...
పెళ్లి మంత్రాలు వినిపించాల్సిన ఇంటిలో చావు బాజాలు వినిపించాయి. ముహూర్తం పెట్టుకుని అ యిన వారందన్నీ ఆహ్వానించాల్సిన ఆ యువకుడు విగతజీవిగా మారి అందరి కళ్లల్లో కన్నీరు మిగిల్చాడు. గీత కార్మిక వృత్తిపైనే ఆధార పడి బతుకుతున్న ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో వదిలేసి వెళ్లిపోయా డు.
మండలంలోని వెదుళ్లవలస పంచాయతీలో గొడిపాలెం గ్రామానికి చెందిన బుత్తల సంతోష్(20) అనే గీత కార్మికుడు శుక్రవారం సాయంత్రం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మరణించా డు. రోజూ లాగే కల్లు గీసేందుకు సంతోష్ గ్రామం పొలిమేరల్లో ఉన్న తాటిపెండిలోకి వెళ్లాడు. తాడిచెట్టు పైకిఎక్కే సమయంలో ఎక్కేందుకు ఉపయోగించే పరికరం తప్పిపోవటంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. సంతోష్ కింద పడిపోవడం చూసిన చుట్టుపక్కల వారు 108కు సమాచారం అందించారు. వారు వచ్చి సంతోష్ చనిపోయినట్లు ధ్రువీకరించారు.
శనివారమే ముహూర్తాలు...
బుత్తల సంతోష్‌కు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరిం ది. శనివారం ముహూర్తాలు పెట్టేందుకు సిద్ధమయ్యా రు. బంధువులందరికీ కూడా చెప్పుకున్నారు. ఇంతలోనే సంతోష్‌ను మృత్యువు మింగేయటంతో వారి కుటుంబ సభ్యుల శోకాన్ని ఎవరూ ఆపలేకపోతున్నా రు. సంతోష్‌కు తల్లిదండ్రులు పైడమ్మ, సీతయ్యలతో పాటు అన్నయ్య రాములప్పడు ఉన్నారు. డెంకాడ ఎస్‌ఐ కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.