
అర్జున్ తేజ్, ప్రియ
అర్జున్ తేజ్, సంతోష్ హీరోలుగా, ప్రియ, వర్షిణి హీరోయిన్స్‌గా తోట నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘తథాస్తు’. ఈ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘దాదాపు 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్నా. పెద్ద హీరోల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. 16 మెగా సీరియల్స్‌కు దర్శకత్వం వహించా. నా మేనల్లుడు అర్జున్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ యూత్‌ఫుల్ కథాంశంతో ‘తథాస్తు’ తెరకెక్కిస్తున్నా.
ఇద్దరు యువతీ యువకుల మధ్య ఉండే మానసిక బంధంతో పాటు కాలం వారి జీవితాలను ఎలాంటి మలుపులతో నడిపించింది? ఆ ప్రయాణంలో అన్ని మజిలీలను దాటుకొని చివరకు ఎలాంటి గమ్యాన్ని చేరుకున్నారన్నదే చిత్ర కథ’’ అన్నారు. ‘‘యువతరంతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి చూడాల్సిన మంచి చిత్రంలో నేను నటిస్తున్నందుకు హ్యాపీ’’ అన్నారు నటి కవిత. అర్జున్ తేజ్, ప్రియ, సంతోష్, కెమెరామెన్ రాజా, మాటల రచయిత వి.వి. వరప్రసాద్, సంగీత దర్శకుడు సాకేత్ నాయిడు, ఫైట్ మాస్టర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. సుమన్, భానుచందర్, శివాజీ రాజా, అలీ, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment