ధనుర్విద్య నేపథ్యంలో... | Sundeep Kishan maiden production | Sakshi
Sakshi News home page

ధనుర్విద్య నేపథ్యంలో...

Published Thu, Feb 21 2019 12:26 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Sundeep Kishan maiden production  - Sakshi

సందీప్‌కిషన్‌ హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్‌ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన బీరం సుధాకర్‌ రెడ్డి, ‘కార్తికేయ’ సినిమాతో నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న వెంకట శ్రీనివాస్‌ బొగ్గరమ్‌ సంయుక్తంగా సుధాకర్‌ ఇంప్లెక్స్‌ ఐపీఎల్‌ అండ్‌ టారస్‌ సినీకార్స్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రీడా నేపథ్యంలో కొనసాగే కథ ఇది.

అత్యంత కష్టమైన ధనుర్విద్య ద్వారా కథానాయకుడు తన లక్ష్యాన్ని ఎలా చేధించాడు? అనేది చిత్రకథ. వైవిధ్యమైన కథాంశంతో రూపొందించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement