హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం తమిళ్‌లో ‘నరగసూరన్’, తెలుగులో ‘నిను వీడని నీడను నేనే’ సినిమాలు చేస్తున్న సందీప్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో విమర్శకుల మెప్పు పొందిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో క్రీడా నేపధ్యంలో ఒక సినిమా చేయబోతున్నారు.
ఏకలవ్యుడి నుంచి బొటన వేలుని గురుదక్షిణగా అడిగిన ద్రోణాచార్యుడి కథను ఇన్సిపిరేషన్‌గా తీసుకొని ఆధునిక గురువు ఎలాంటి గురు దక్షిణ అడిగాడన్న కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాను నిర్మించిన వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment