
నామకరణం చేస్తున్న సంతోష్ దంపతులు
సాక్షి, వరంగల్ : టీమిండిమా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో వీరాభిమాని. ఎనిమిది నెలలు ఆగి కోహ్లి కూతురికి పెట్టిన పేరునే తన కూతురికి పెట్టాడు. వివరాలు.. రాయపర్తి మండలం, మైలారం శివారు తండాకి చెందిన బానోత్ సంతోష్.. విరాట్ కోహ్లికి వీరాభిమాని. సంతోష్ దంపతులకు గత సంవత్సరం జూన్ 15న అమ్మాయి పుట్టింది. అయితే విరాట్ కోహ్లి- అనుష్క దంపతులకు పుట్టబోయే బిడ్డకు పెట్టే పేరునే తన కూతురికి కూడా పెట్టుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. అప్పటినుంచి ఎనిమిది నెలలు వేచి చూశాడు. ఈ రోజు(సోమవారం) కోహ్లి దంపతులు తమ బిడ్డకు ‘'వామికా’గా నామకరణం చేయటంతో.. సంతోష్ తన కూతురుకి కూడా ‘వామిక’ అనిపేరు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment