హుజూరాబాద్‌లో కార్డన్ సెర్చ్
Published Tue, Nov 15 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
హుజూరాబాద్: కరీంనగర్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లోని మామిండ్ల వాగులో మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించి అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తనిఖీల్లో హుజూరాబాద్ ఏసీపీ మూల రవీందర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సుమారు 150మంది సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement