
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత నందగిరి మహేందర్‌రెడ్డి గురువారం గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మహేందర్‌రెడ్డి అంతిమయాత్రలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు.
ఆయనతో కలిసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కూడా పాడె మోయడం గమనార్హం. మహేందర్‌రెడ్డి మృతదేహానికి రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment