
రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గం లోని ప్రజలకు కేసీఆర్ ఎన్ని ఇస్తున్నా.. వారు ఈటల వెంట ఉన్నా రని దీంతో సీఎంకు ఈటల అంటే ఏంటో అర్థమైందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం రాంపూర్‌లోని వడ్డెర కాలనీ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో పేదిరకం, కన్నీళ్లు ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 18ఏళ్లు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచినప్పుడు తమ్ముడు అని చెప్పి.. ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఈటల ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment