పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానిస్తున్న ఈటల రాజేందర్
హుజూరాబాద్: ‘మిస్టర్ హరీశ్‌రావు! నీతోపాటు 18 ఏళ్లు పనిచేశాను. నీలాగే నేను కూడా ఉద్యమకారుడినే. నేను ఏనాడైనా ముఖ్య మంత్రి కావాలనుకున్నానా? కేవ లం మనుషులుగా గుర్తించమని అడిగింది మనిద్దరమే కదా? నన్ను మంత్రి పదవి నుంచి తీసేసినప్పు డు దళితుల భూములు ఆక్రమించుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు పెట్టారని ఇక్కడి మహిళలతో చెబుతున్నావు.
హరీశ్‌రావు.. నాపై చేసిన ఆరోపణలు నిజమేనని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలవా? ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజారిపోయావు మిత్రమా? ఇలాంటి నీచమైన పనులు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో చిల్లర కాకు’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. సోమవారం హుజూరాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పో బోతోందని జోస్యం చెప్పారు. 2023కు హుజూరాబాద్ ఎన్నికలు రిహార్సల్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment