
సాక్షి, మెదక్ జిల్లా: ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్‌కు నోటీసుల జారీపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ఈటలకు ప్రజాతీర్పు అనుకూలంగా రావడంతో మళ్లీ కేసులను తిరగతోడే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఈ సర్వే చేయిస్తోందని రఘునందన్‌రావు ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం తీసుకునే ఎటువంటి ఏ చర్య కైనా తాము సిద్ధమన్నారు.
చదవండి: ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్: సీఎం కేసీఆర్
హుజూరాబాద్‌లో ప్రజల తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టే.. కక్షపూరితంగా రీ సర్వే చేస్తున్నారన్నారు. నిష్పక్షపాతంగా సర్వే చేస్తే సహకరిస్తాం.. వేధించే ఉద్దేశంతో చేస్తే మరోసారి కేసీఆర్‌కు ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఈటల.. న్యాయస్థానంలోను పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రఘునందన్‌రావు అన్నారు.
కాగా, ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హేచరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలలో అసైన్డ్ భూములు ఆక్రమణపై సర్వే నోటీసులు గతంలో ఇవ్వడం జరిగిందని తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ మీడియాతో అన్నారు.
చదవండి: నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఇక ప్రతియేటా జాబ్ క్యాలెండర్