రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మరింత బలపడే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రానికి ప్రాధాన్యత కలి్పస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగా రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేంద్ర కేబినెట్ పదవితోపాటు ఓ మహిళ, ఓ బీసీ నేతకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి మరోసారి కేబినెట్ హోదా లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
అయితే ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలున్నాయనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. వెంటనే జాతీయ స్థాయిలో అధ్యక్ష మార్పు జరపకపోతే ముందుగా కిషన్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకొని 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని పేర్కొనడం ఈ చర్చకు ఊతమిస్తోంది.
ఓసీ, మహిళా కోటాలో డీకే అరుణకు, పారీ్టపట్ల విధేయుడిగా రెండోసారి ఎంపీగా సీనియారిటీ దృష్ట్యా బండి సంజయ్, రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా రాజకీయవేత్తగా, మంత్రిగా ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా ఈటల రాజేందర్‌కు మంత్రి పదవులు దక్కుతాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక క్షేత్రస్థాయిలో బీజేపీ అంతగా బలపడలేదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీపరంగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా అంతంతగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సత్సంబంధాలు, స్థానిక పరిచయాలున్న ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రిగా కంటే కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసి పార్టీ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారనే చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment