NATIONAL PRESIDENT OF BJP
-
బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో జరుగుతుందని పార్టీలోని విశ్వసనీవర్గాలు వెల్లడించాయి. జేపీ నడ్డా నుంచి కొత్త అధ్యక్షుడు ఫిబ్రవరిలో పగ్గాలు చేపడతారని వెల్లడించాయి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జనవరి మధ్యకల్లా పూర్తవుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉటుందని వివరించాయి. 60 శాతం రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, వీరి స్థానాల్లో .జనవరి మధ్యకల్లా కొత్త అధ్యక్షులు ఎన్నికవుతారని తెలిపాయి. కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే.. సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావాలని బీజేపీ నిబంధనావళి చెబుతోంది. మంత్రివర్గంలో నుంచి ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా.. మంత్రి కావొచ్చు లేదా పార్టీలో ఒకరు కావొచ్చు.. అని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. కొత్త అధ్యక్షుడెవరనే విషయంలో ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా 2020 ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టారు. సాధారణంగా అధ్యక్షుడికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నడ్డాకు పొడిగింపునిచ్చిన విషయం తెలిసిందే. -
బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగిరం చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాల యూనిట్లను ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని, తద్వారా అక్కడ పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటా యని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ రెండ్రోజుల కిందటే పార్టీ కీలక నేతలతో వర్క్‌షాప్ నిర్వహించి సంస్థాగత ఎన్ని కల ప్రక్రియపై మార్గదర్శనం చేసింది. బీజేపీలో మొదట బూత్, ఆ తర్వాత మండల, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీల్లో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాలి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, జాతీయ కౌన్సిల్ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం.. అంటే డిసెంబర్ రెండో వారానికి పూర్తవుతుంది, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. దక్షిణాదికే అవకాశమెక్కువ.. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసినా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఆ తర్వాతా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు శివరాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), సునీల్ భూపేంద్ర యాదవ్ (రాజస్తాన్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), ధర్మేంద్ర ప్రధాన్ (ఒడిశా)ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న దృష్ట్యా, డిసెంబర్ రెండు లేదా మూడో వారానికి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధినాయకత్వం ఉంది. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మరింత బలపడే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రానికి ప్రాధాన్యత కలి్పస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగా రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేంద్ర కేబినెట్ పదవితోపాటు ఓ మహిళ, ఓ బీసీ నేతకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి మరోసారి కేబినెట్ హోదా లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.అయితే ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలున్నాయనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. వెంటనే జాతీయ స్థాయిలో అధ్యక్ష మార్పు జరపకపోతే ముందుగా కిషన్‌రెడ్డిని కేబినెట్లోకి తీసుకొని 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని పేర్కొనడం ఈ చర్చకు ఊతమిస్తోంది.ఓసీ, మహిళా కోటాలో డీకే అరుణకు, పారీ్టపట్ల విధేయుడిగా రెండోసారి ఎంపీగా సీనియారిటీ దృష్ట్యా బండి సంజయ్, రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా రాజకీయవేత్తగా, మంత్రిగా ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా ఈటల రాజేందర్‌కు మంత్రి పదవులు దక్కుతాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక క్షేత్రస్థాయిలో బీజేపీ అంతగా బలపడలేదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీపరంగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా అంతంతగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సత్సంబంధాలు, స్థానిక పరిచయాలున్న ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రిగా కంటే కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసి పార్టీ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారనే చర్చ సాగుతోంది. -
కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ
ద్వారక: కాంగ్రెస్ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీగా మిగిలిపోయిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. అసలు దేశంలో బీజేపీ మినహా జాతీయ పార్టీలేవీ లేవన్నారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలున్న గుజరాత్లో ద్వారక నుంచి పోరుబందర్ దాకా బీజేపీ రెండో విడత గుజరాత్ గౌరవ్‌యాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. ‘‘దేశం పేరిట కేవలం ఓ వంశాన్ని ప్రమోట్ చేయడం, ఓ కుటుంబానికి సేవ చేయడమే కాంగ్రెస్ నేతల ఏకసూత్ర కార్యక్రమంగా మారింది. ఇక టీఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, అకాలీదళ్, జేఎంఎం, పీడీపీ సహా ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. నమ్మిన సిద్ధాంతానికి నిలువెల్లా కట్టుబడ్డ ఏకైక జాతీయ పార్టీ దేశంలో బీజేపీ మాత్రమే’’ అని ఈ సందర్భంగా అన్నారు. షా ఓ జూనియర్: నితీశ్ పట్నా: కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వారి విమర్శలను పట్టించుకోనని కేంద్ర హోం మంత్రి అమిత్ షానుద్దేశిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. సామాజిక ఉద్యమ నేత జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలు ఆచరిస్తానని చెప్పుకునే నితీశ్.. అధికారం కోసం కాంగ్రెస్ ఒళ్లో కూర్చున్నారంటూ అమిత్ చేసిన ఆరోపణలపై బుధవారం ఆయన ఈ మేరకు స్పందించారు. -
బీజేపీ చీఫ్‌గా మళ్లీ నడ్డాకే అవకాశం?
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మరో విడత 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొనసాగింపు ద్వారా రానున్న రోజుల్లో వరుసగా జరగనున్న కీలక అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి సంస్థాగతంగా మేలు కలుగుతుందని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. నడ్డా మూడేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. బీజేపీ అత్యున్నత విభాగం పార్లమెంటరీ బోర్డ్ ఆయన పదవీ కాలం మరో విడత పొడిగిస్తూ ఈలోగానే ఒక తీర్మానం ఆమోదిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ రాష్ట్ర విభాగాల్లో సంస్థాగత ఎన్నికలు ఇంకా ప్రారంభం కానప్పటికీ, చీఫ్‌గా నడ్డా కొనసాగుతారని తెలిపాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్రాల్లోనైనా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉంది. నడ్డాకు ముందు పార్టీ చీఫ్‌గా ఉన్న అమిత్ షాకు కూడా ఇదే విధమైన కొనసాగింపునిచ్చారు. అప్పట్లో ఎన్నికలు ముగిసిన వెంటనే సంస్థాగత ఎన్నికలు జరిగాయి. అమిత్ షా కేంద్ర కేబినెట్లో జాయిన్ కావడంతో జేపీ నడ్డా బీజేపీ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీకి విశ్వాస పాత్రుడిగా, ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో సత్సంబంధాలున్న వ్యక్తిగా నడ్డాకు పేరుంది. పార్టీని విస్తరించి వ్యూహాలను అమలు చేయగల నేతగా నడ్డా పేరు తెచ్చుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, బిహార్‌లో పార్టీ మంచి ఫలితాలను రాబట్టడం వంటివి నడ్డా హయాంలో బీజేపీ సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటికీ తెలంగాణలో పార్టీ బలం గణనీయంగా పెరగడం వెనుక నడ్డా కృషి ఉందంటున్నారు. -
నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఆదివారం కొద్దిసేపు అయింది. యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌కు సాయం చేయాలంటూ ఒక పోస్ట్, రష్యాకు సాయం చేయాలంటూ మరో పోస్టు ఆయన అకౌంట్లో ప్రత్యక్షమయ్యాయి. విరాళాలను క్రిప్టో కరెన్సీ రూపంలోనూ స్వీకరిస్తున్నట్లు అందులో ఉంది. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పీటీఐతో మాట్లాడుతూ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ)కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు సాగుతోందన్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ యథావిధిగా నడుస్తోందని, హ్యాకింగ్‌పై ట్విట్టర్ బాధ్యులతో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
మరికొంతకాలం అమిత్ షాయే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా మరికొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఆరు నెలలపాటు అధ్యక్ష బాధ్యతలను కొనసాగించనున్నారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తాత్కాలిక చీఫ్‌ను నియమించే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించేందుకు అమిత్‌షా గురువారం వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులతో భేటీ అయ్యారు. ఈ నెల 14వ తేదీన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో, 18న ఆఫీస్ బేరర్లు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యదర్శులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. రోడ్‌మ్యాప్‌పై కమిటీ గురువారం నాటి సమావేశంలో అమిత్‌షా.. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమైందని కొనియాడారు. బెంగాల్, ఏపీ, తమిళనాడు, కేరళలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ తెలంగాణ, ఒడిశాలలో మంచి ఫలితాలను సాధించిందన్నారు. సంస్థాగత ఎన్నికలతోపాటు ఇతర ప్రధాన అంశాలపై రోడ్ మ్యాప్ రూపొందించేందుకు బీజేపీ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్, నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
‘కమలా’ధీశుడు ఎవరో..?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ అధ్యక్షుడిగా తర్వాత ఎవరు నియమితులవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రిగా ఉంటూనే అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అయితే ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే పదవిలో ఉండాలనేది బీజేపీ సంప్రదాయం. కాబట్టి షా పార్టీ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చే అవకాశాలే ఎక్కువ. బీజేపీకి అత్యంత విజయవంతమైన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న అమిత్ షా స్థానాన్ని మరొకరు భర్తీ చేసి, ఆయనలా పనిచేయాలంటే చాలా కష్టమైన పనే. అయితే కొత్త చీఫ్‌గా కాస్త తక్కువ వయసు ఉన్న అలాగే పార్టీ వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి నియమితులు కావొచ్చనే సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజస్తాన్ వ్యక్తి భూపేంద్ర యాదవ్, అలాగే కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జేపీ నడ్డాల్లో ఎవరో ఒకరిని అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో సీనియర్ నాయకుడైన నడ్డాను మోదీ ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. గత ప్రభుత్వంలో నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే. అలాగే పార్టీ అగ్రనాయకులు, ఆరెస్సెస్ ఆశీస్సులు నడ్డాకు బాగా ఉన్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడైనందున, తగినంత అనుభవం కూడా నడ్డాకు ఉంది. మరోవైపు పార్టీ వ్యవహారాలు చూసుకోవడంలో అమిత్ షాకు భూపేంద్ర యాదవ్ ఎంతో సాయం చేస్తూ, అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. అమిత్ షా కూడా భూపేంద్ర యాదవ్‌ను బాగా నమ్ముతారు. గతేడాది గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో భూపేంద్ర యాదవ్ గుజరాత్ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు ఓపీ మాథుర్ పేరు కూడా కొత్త చీఫ్ రేసులో వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు వరుసగా మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్‌లు కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది. -
రైతుల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టండి
సాక్షి, అమరావతి : రైతులకు గిట్టుబాటు ధరతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రైతు సంఘాల ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కోరారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ శనివారం నిర్వహంచిన రైతు మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌షా తాడేపల్లిగూడెంలో హార్టికల్చర్ యూనివర్శిటీ గెస్ట్‌హౌస్‌లో పలు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చించేందకు కనీసం వారం, పది రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలంటూ భారతీయ కిసా¯ŒS సంఘం ప్రతినిధులు అమిత్‌షాకు వినతిపత్రం అందజేశారు. క్వింటా ధాన్యం పండించడానికి రైతుకు రూ.2 వేలు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం రూ.1,500 మించి గిట్టుబాటు ధర కల్పించడం లేదని.. ఈ పరిస్థితుల్లో రైతులకు లాభదాయకత ఎలా సా««దl్యమో ఆలోచించాలని సంఘ ప్రతినిధులు ఆయనకు వివరించారు. దీనికి స్పందించిన అమిత్‌షా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. రిఫైన్డు పామ్ ఆయిల్ దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాన్ని 30 శాతం పెంచి, దేశీయ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ పామ్ రైతులు కోరారు. కొబ్బరి పంట రైతులకు గిట్టుబాటు ధర కల్పన, ప్రకృతి వ్యవసాయం పోత్సహించేందుకు కేంద్ర బడ్జెట్లో అదనపు నిధుల కేటాయింపు అంశాలపై ఆయా రైతు సంఘాల ప్రతినిధులు వినతి ప్రతాలు ఇచ్చారు. ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడతానని అమిత్‌షా హామీ ఇచ్చారు. భారతీయ కిసా¯ŒS సంఘం జాతీయ కార్యదర్శి కుమార్‌స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు వివిధ రైతు సంఘాల ప్రతిని«ధులు అమిత్‌షాను కలిసిన వారిలో ఉన్నారు. ప్రత్యామ్నాయం చూపాకే నిర్వాసితులను ఖాళీ చేయించాలి రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్‌షాను పోలవరం నిర్వాసితుల ప్రతినిధుల బృందం కలిసింది. తమకూ పెరిగిన రేట్ల ప్రకారం ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని వినతిపత్రం ఇచ్చింది. ఇటీవల కాలువ నిర్మాణంలో భూములు పోయిన వారికి ఎకరాకు రూ.15 లక్షల వరకు పరిహారం అందజేశారని, తమకు గతంలో ఎకరాకు రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షల పరిహారం అందిందని గుర్తు చేశారు. తమకూ ఆర్ఆర్ ప్యాకేజీని అందజేయాలని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు చూపిన తర్వాతే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల తరుపున పోరాడుతున్న వనవాసి కల్యాణ ఆశ్రమం జాతీయ కన్వీనర్ గిరీష్ కుజార్, రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయశాస్రి నాయకత్వంలో 20 మంది నిర్వాసితులు అమిత్‌షాను కలిశారు.