న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఆదివారం కొద్దిసేపు అయింది. యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌కు సాయం చేయాలంటూ ఒక పోస్ట్, రష్యాకు సాయం చేయాలంటూ మరో పోస్టు ఆయన అకౌంట్‌లో ప్రత్యక్షమయ్యాయి. విరాళాలను క్రిప్టో కరెన్సీ రూపంలోనూ స్వీకరిస్తున్నట్లు అందులో ఉంది.
దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పీటీఐతో మాట్లాడుతూ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ)కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు సాగుతోందన్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ యథావిధిగా నడుస్తోందని, హ్యాకింగ్‌పై ట్విట్టర్ బాధ్యులతో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment