
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రూ.50కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొన్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారని, అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందాలను ప్రజలే తిప్పి కొడతారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం అతిగా స్పందిస్తోందని ఆయన అన్నారు.
చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment