Minister KTR
-
కొత్త సంవత్సరం కానుక.. కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి.. సిగ్నల్ లేని ప్రయాణానికి మార్గం సుగమమం చేసేందుకు మరో ఫ్లైఓవర్ కొత్త సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను మునిసిపల్ ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆదివారం ప్రారంభించారు. దీనిద్వారా ఆల్విన్‌కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసేందుకు మార్గం సుగమమైంది. ఫ్లై ఓవర్ వివరాలు.. ► రూ.263.09 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం ► ఫ్లై ఓవర్‌తోపాటు 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్‌పాస్ ► ఫ్లైఓవర్ పొడవు దాదాపు 3 కి.మీ. ► 2, 3, 4, 5 లేన్లుగా గ్రేడ్ సెపరేటర్‌గా నిర్మాణం ► ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో ఇది 18వ ఫ్లైఓవర్ ► ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ఉపయోగాలు.. ► గచ్చిబౌలి వైపు నుంచి ఆలి్వన్‌కాలనీ జంక్షన్ వైపు వన్‌వే ఫ్లైఓవర్‌గా ఇది అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు, మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలు ఫ్లైఓవర్ పైకి వెళ్తాయి. మాదాపూర్ లేదా హఫీజ్‌పేట్ వైపు వెళ్లవచ్చు. హఫీజ్‌పేట్ నుంచి వచ్చే గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలు అండర్ పాస్ ద్వారా వెళ్తాయి. దీంతో శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. ► కొండాపూర్, మాదాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు చేయవచ్చు. ► కొత్తగూడ, కొండాపూర్ బొటానికల్ గార్డెన్ జంక్షన్లలో వాహనదారులకు ఊరట. ► ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం. ► మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలివైపు వెళ్లే వారు ఇక సులభంగా రాకపోకలు సాగించే అవకాశం. ► గచ్చిబౌలి కూడలి నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆలి్వన్‌కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ► ట్రాఫిక్ సమస్య, సమయం, వాహనాల ఇంధనం ఖర్చు తగ్గుతాయి. ఏర్పాట్ల పరిశీలన.. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, డీఈ భరద్వాజ్, ఏఈ పరమేష్, ఏఈ శివకృష్ణ, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నవీన్, బోస్, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, నర్సింహ్మసాగర్,ఖాజా, రామకృష్ణ ఆంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. చదవండి: అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు -
రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిందే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం ఉండాలని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో తమ విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసిందన్నారు. కేంద్రం అవార్డులు ఇస్తుంది.. కానీ నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. నిధుల కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిందేనని కేటీఆర్ అన్నారు. చదవండి: సజ్జనార్ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో.. -
గాంధీభవన్‌లోకి గాడ్సేలు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రూ.50కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొన్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారని, అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందాలను ప్రజలే తిప్పి కొడతారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం అతిగా స్పందిస్తోందని ఆయన అన్నారు. చదవండి: సీఎంను పట్టుకుని ఆ బూతులేంటి?: కేటీఆర్ -
పేద క్రీడాకారుడికి ‘గిఫ్ట్ ఏ స్మైల్’
సాక్షి, హైదరాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఓ నిరుపేద క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గుండారం గ్రామానికి చెందిన క్రీడాకారుడు ముడావత్ వెంకటేశ్ ఇటీవల నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ (ఎన్ఎస్ఎన్ఐఎస్)లో డిప్లొమా కోర్సులో సీటు సంపాదించాడు. అయితే, పేద గిరిజన కుటుంబానికి చెందిన వెంకటేశ్‌కు ఆ కోర్సులో చేరేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించాడు. విషయం తెలిసిన హైదరాబాద్‌కు చెం దిన టీఆర్ఎస్ యువజన llనేత ఉగ్గం రాకేశ్‌యాదవ్ వెంకటేశ్‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా గురువారం రూ. 1.8 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వెంకటేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాకేశ్ యాదవ్‌ను కేటీఆర్ అభినందించారు. -
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొ న్నారు. టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీని వాస్ యాదవ్ పాల్గొని 44 కేజీల కేక్ కట్‌చేశారు. ‘లీడర్’టైటిల్‌తో కేటీఆర్‌పై రూపొందించిన సీడీని హోంమంత్రి మహమూద్ అలీ, ప్రత్యేక గీతాన్ని మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఆవి ష్కరించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దివ్యాం గుడికి త్రిచక్ర స్కూటీ అందజేశారు. అసెంబ్లీ ఆవరణలో ‘ముక్కోటి వృక్షార్చన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చ నలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీని వాస్‌రెడ్డి, మండలి ప్రొటెమ్ చైర్మన్ వి.భూపా ల్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. మాసాబ్‌ట్యాంక్‌లోని మహావీర్ హాస్పిటల్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో మండలి ప్రొటెమ్ చైర్మన్ కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ►కేటీఆర్ జన్మదినం సందర్భగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేత లు మొక్కలు నాటడంతో పాటు పలు సామా జిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్, యూకే డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓ ఫారెల్ ట్విటర్ ద్వారా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొక్క నాటిన వనజీవి ఖమ్మం రూరల్: కేటీఆర్ జన్మదినం సంద ర్భంగా శనివారం పద్మశ్రీ వనజీవి రామయ్య ఖమ్మం మండలం రెడ్డిపల్లి గ్రామంలోని తన నివాసంలో మొక్కను నాటారు. -
పాత వాహనాలకు కాలం చెల్లు!
సాక్షి, హైదరాబాద్: పదిహేనేళ్లు దాటిన వాహనాలు రోడ్డు ఎక్కకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలం చెల్లిన వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నందున వాటి విషయంలో అలసత్వం సరికాదన్న నిపుణుల సూచనతో ఏకీభవించింది. అలాగే మద్యం తాగి నడిపేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. రహదారి భద్రతపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నా రు. వచ్చే నెలలో జరగనున్న మలిదఫా సమా వేశంలో వీటిపై ప్రకటన చేయనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో కమిటీ సభ్యులు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతోపాటు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రైల్వే పోలీసు డీజీ కృష్ణప్రసాద్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్ సీ గణపతిరెడ్డి, రాష్ట్ర రహదారుల ఈఎన్సీ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు.. వాహన ప్రమాదాలు, వాటి రూపంలో ఏటా సగటున ఏడు వేల మంది మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించి రోడ్డు భద్రతను ఎలా పటిష్టం చేయాలో సిఫారసు చేసేందుకు సీఎం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కొన్ని నిర్దిష్ట సూచనలు చేసే బాధ్యతను కమిటీ.. జేఎన్టీయూ ప్రొఫెసర్ లక్ష్మణరావు, ఓయూ ప్రొఫె సర్ ఎం.కె.కుమార్, వరంగల్ నిట్ ప్రొఫెసర్ ప్రసాద్, ఇండియన్ ఫెడరేషన్ ఫర్ రోడ్ సేఫ్టీ ప్రతినిధి వినోద్, రోడ్‌సేఫ్టీ క్లబ్ ప్రతినిధి పి.శ్రీనివాస్ తదితరులకు అప్పగించింది. ఈ సమావేశంలో వారంతా పాల్గొని తమ సూచనలిచ్చా రు. మద్యం తాగి వాహనం నడిపే వారిపై, నిబంధనలు పాటించని వారి విషయంలో కఠిన చర్యలు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిబంధనలు, వేగ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. వచ్చే జనవరి తొలివారంలో రహదారి భద్రతావారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇçప్పుడు తీసుకున్న నిర్ణయాలపై మలిదఫా సమావేశంలో చర్చించి ప్రకటించనున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ ఏడాది మృతుల సంఖ్య 5,931.. 2015లో 21,552 ప్రమాదాల్లో 7,110 మృతిచెందగా, 2016లో 22,811 ప్రమాదాల్లో 7,219 మంది, ఈ సంవత్సరం నవంబర్ వరకు 20,0172 ప్రమాదాలు చోటు చేసుకోగా 5,931 మంది చనిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి తుమ్మల వెల్లడిం చారు. మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గినంత మాత్రాన దీన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. దేశంలో రోడ్డు భద్రత చర్యలు పాటిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా పోలిస్తే బాగా వెనకబడిన విషయాన్ని మరవవద్దని పేర్కొన్నారు. -
కేటీఆర్ రాజీనామా చేయాలి: నిరంజన్
సాక్షి, హైదరాబాద్: తన నియోజకవర్గంలోని నేరేళ్లలో దళితులు, బీసీలపై పోలీసులు జరిపిన దౌర్జన్యం గురించి తెలియదని, స్థానిక నాయకులు తనకు సరైన సమాచారం ఇవ్వలేదని బుకాయిస్తున్న కేటీఆర్.. మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన ఐదువారాలకు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్ ప్రజా సమస్యలపై ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలుస్తోందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. -
రేపు జీజీకే టెక్ నూతన కేంద్రం ప్రారంభం
ఏడాదిలో 1,000 మంది ఉద్యోగులు నియామకం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా బిజినెస్ టెక్నాలజీ సేవలందిస్తున్న జీజీకే టెక్ విస్తరణ బాట పట్టింది. శుక్రవారం నాడు ఉప్పల్‌లోని ఎన్ఎస్ఎల్ ఎరీనా సెజ్‌లో నూతన కేంద్రాన్ని ప్రారంభించనుంది. 63 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని జీజీకే టెక్ ఫౌండర్ అండ్ సీటీఓ శ్యామ్ పాల్‌రెడ్డి చెప్పారు. బుధవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ... నూతన కార్యాలయంలో ఏడాదిలో 1,000 మంది, 2020 నాటికి 4,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని చెప్పారు. ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్, ఐఐఎం వంటి క్యాంపస్‌ల నుంచి నిపుణులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. 2004లో సేవలను ప్రారంభించిన జీజీకే టెక్ గచ్చిబౌలి, జూబ్లిహిల్స్‌లోనూ కార్యాలయాలున్నాయి. అమెరికా, యూకే, యూరప్ల్లోని తమ కస్టమర్లకు కస్టమ్ అప్లికేషన్ అభివృద్ధి, అడ్వాన్స్డ్ అనలటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్ ప్రాసెస్, క్లౌడ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ వంటి సేవలను అందిస్తోంది. -
విశ్వనగరమే లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: ‘హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా మారుస్తాం. అదే మా లక్ష్యం. ఇందుకోసం అడుగులు వేయడం ప్రారంభించాం. ఇప్పటికే పలు కార్యక్రమాలు ఊపందుకున్నాయి కూడా...’ అని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ఇప్పటికే డిజిటల్ డోర్ నెంబరింగ్, ఆధునిక బస్షెల్టర్లు, పబ్లిక్ టాయ్లెట్లు తదితర అంశాల్లో మెరుగైన ప్రమాణాల కోసం అస్కిని, జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్ అంశాల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రముఖ కన్సల్టెంట్లను సంప్రదించినట్లు పేర్కొన్నారు. నగరాభివృద్ధి విషయంలో మంత్రి ప్రస్తావించిన మరికొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కట్టుబడి ఉన్నాం. 45 ప్రాంతాల్లో 19,577 ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. ఈ అంశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో భూ లభ్యతను సూచించాల్సిందిగా కోరాం. వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన రూ.338.72 కోట్ల రుణానికి జీహెచ్ఎంసీకి అనుమతించాం. పారిశుధ్య ప్రమాణాలు పెంచడం మా మొదటి ప్రాధాన్యం. అందులో భాగంగా 44 లక్షల చెత్తడబ్బాల పంపిణీ చేపట్టాం. 13 ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లకు అదనంగా మరో 12 స్టేషన్లు ఏర్పాటయ్యాయి. అదనపు వాహనాల వల్ల గతంలో 3300 మెట్రిక్ టన్నుల చెత్త స్థానే ప్రస్తుతం 4500 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు సాధ్యమవుతోంది. భవనిర్మాణ వ్యర్థాల సేకరణకు నాలుగు డంపింగ్ యార్డుల ఏర్పాటు. సీ అండ్ డీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ఎస్సార్డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్) పనుల్లో భాగంగా రూ. 2,631 కోట్లతో 20 జంక్షన్ల అభివృద్ధిపనులు. వీటిల్లో 18 పనులకు టెండర్లు పూర్తయి, 11 జంక్షన్ల పనులు జరుగుతున్నాయి. ఎనిమిది సిగ్నల్ ఫ్రీ కారిడార్ల నిర్మాణం, 100 కి.మీ.ల మేర ఫ్లై ఓవర్లు, మల్టీగ్రేడ్ సెపరేటర్లతో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం చేపడుతున్నాం. -
వ్యాపారంపై ‘నోట్ల’ దెబ్బ
► తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యే ► యువ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ ► అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకెళ్తోంది ► అంబానీ సోదరుల్లాగే తెలంగాణ, ఏపీ ► విడిపోరుున కొత్తల్లో ఇబ్బందులు పడ్డారు ► ఇప్పుడు ఆర్జనలో బాగున్నారన్న మంత్రి ► ‘తెలంగాణ పరివర్తన’పై ముఖాముఖి సాక్షి, హైదరాబాద్: ‘‘పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణపై కూడా పడింది. అంతటా వ్యాపారం చాలా దెబ్బ తిన్నది’’ అని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరివర్తన (ట్రాన్సఫామేషన్)పై హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్లో ‘యంగ్ ఇండియా’ అధ్యక్షతన గురువారం రాత్రి జరిగిన ముఖాముఖిలో యువ పారిశ్రామిక వేత్తలతో ఆయన ముచ్చటించారు. సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక, విద్యుత్ రంగాల అభివృద్ధితో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పు చేర్పుల గురించి వారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఏర్పడిన రెండున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల గురించి వివరించారు. ‘‘హైదరాబాద్‌లో ప్రాంతీయ వివక్ష ఉంటుందని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న ప్రచారానికి రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ తెర దించారు. ఆరు నెలల్లోనే పోలీసులకు అత్యాధునిక సదుపాయాలు సమకూర్చారు. అంతా సవ్యంగా సాగేలా చూశారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చర్యలు తీసుకుం టున్నది. నాణ్యమైన విద్యుత్ సరఫరా, తగినంత నీరు, కరువు వచ్చినా రిజర్వాయర్లలో నీరు నిల్వ ఉండి రైతులకు ఉపయోగపడి కనీస అవసరాలు తీరితే రైతన్న కుటుంబంతో పాటు రాష్ట్రమూ అభివృద్ధి బాట పడుతుంది. దీన్ని సాకారం చేసేందుకు కోటి ఎకరాలకు సాగునీరందేలా బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటికీ తాగునీటి కోసం మిషన్ భగీరథ, పచ్చదనం కోసం హరితహారం, పరిశ్రమల అభివృద్ధి కోసం సరికొత్త ఇండస్ట్రీ పాలసీ తెచ్చాం. అనుమతులన్నీ తక్షణం ఇచ్చేలా, ఏ రాష్ట్రం చేయలేని విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంబానీ సోదరులు కూడా విడిపోయాక తొలినాళ్లలో కాస్త ఇబ్బందిపడ్డారు. క్రమేణా ఇప్పుడు ఆస్తుల సంపాదనలో బాగున్నారు. ఏపీ, తెలంగాణకు కూడా ఇదే వర్తిస్తుంది. విభజనతో తెలంగాణ, ఏపీలకు మేలే జరిగింది. ఏపీలో గన్నవరం విమానాశ్రయం, ఐఐటీల వంటివి చాలానే కేంద్రం నుంచి వచ్చాయి. భవిష్యత్‌లోనూ మంచి ఫలితాలే ఉంటాయి’’ అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లు, జంక్షన్లు, జీబ్రా క్రాసింగ్ లైన్లు, పాఠశాలల్లో పరిశుభ్రత కోసం చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ అంబాసిడర్లుగా పనిచేయండి యువత తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేసి దేశ విదేశాల్లోని తమ స్నేహితులు, పారిశ్రామికవేత్తలను ఇక్కడికి రప్పించాలని కేటీఆర్ కోరారు. సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వాము లు కావాలని సూచించారు. ‘‘వీలైతే హైదరాబాద్‌లో ఓ డివిజన్‌ను దత్తత తీసుకొని సమస్యలు పరిష్కరించండి. తర్వాత దాన్ని మిగతా ప్రాంతాలకూ విస్తరిద్దాం. ఇది ప్రజల భాగస్వామ్యంతో నడిచే రాష్ట్రం. అందుకే వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయా లు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణముందని మాజీ ఎంపీ వివేక్ తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, యంగ్ ఇండియా ప్రతినిధులు చంద్రశేఖర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.