
సాక్షి, హైదరాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఓ నిరుపేద క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గుండారం గ్రామానికి చెందిన క్రీడాకారుడు ముడావత్ వెంకటేశ్ ఇటీవల నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ (ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్)లో డిప్లొమా కోర్సులో సీటు సంపాదించాడు. అయితే, పేద గిరిజన కుటుంబానికి చెందిన వెంకటేశ్‌కు ఆ కోర్సులో చేరేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించాడు. విషయం తెలిసిన హైదరాబాద్‌కు చెం దిన టీఆర్‌ఎస్ యువజన llనేత ఉగ్గం రాకేశ్‌యాదవ్ వెంకటేశ్‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా గురువారం రూ. 1.8 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వెంకటేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాకేశ్ యాదవ్‌ను కేటీఆర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment