
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతల భేటీ ముగిసింది. ఈ భేటీలో బీజేపీ నేతలు తరుణ్‌చుగ్, రఘునందన్‌రావు, రాజాసింగ్, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు. భేటీ అనంతరం తరుణ్‌చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణలో ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య యుద్ధం నడుస్తోంది. ఓ కుటుంబం చేస్తున్న అరాచకాలపై ఈటల గొంతు వినిపించారు. ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌లో సంఘర్షణకు గురయ్యారు. తనను నమ్మిన ప్రజల బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నించారు.
కేసీఆర్‌కు ఆయన కుటుంబం ఎక్కువ అయింది.. తెలంగాణ గౌరవం చులకన అయింది. ఈటెల పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుంది. మా అందరి ఉదేశ్యం ఒక్కటే.. కేసీఆర్ అహంకారం, రాజరికం తెలంగాణ నుండి పోవాలి. తెలంగాణ వికాసం కోసం ఎవరితో అయినా కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఈటెల బీజేపీలోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడటం.. ఆయన అహంకారం ఓడటం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment