సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిస్థితి గందరగోళంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరోనాకు కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారు అని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. వాస్తవ విషయాలు చెబితే.. ప్రజల్లో నిర్లక్ష్యం ఉండదు అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఆయుష్మాన్ భారత్ అమలు చేయమంటే.. ఆరోగ్యశ్రీ ఉందని చెప్పి చేతులు దులుపేసుకున్నారని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులంటే పేదలు గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ శాఖలో ఎక్కువ డబ్బులుంటే.. కేసీఆర్ ఆ శాఖ తీసుకుంటారు అని చెప్పారు. అవినీతికి పాల్పడిన మిగిలిన మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. కరోనా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు అని కొట్టిపారేశారు.
చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం
Comments
Please login to add a commentAdd a comment