ramalingeswara swamy temple
-
పరశురామ ప్రతిష్ఠిత.. జడల రామలింగేశ్వరుడు
తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ప్రత్యేకమైనది నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వరాలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఇక్కడి శివుడికి మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి, ఆరోగ్యంప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి ఆరు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.పూర్వం హైహయ వంశ మూల పురుషుడు, కార్తవీర్జార్జునుడు వేటకోసం దండకారణ్యానికి వెళతాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో అందరికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువును ఇవ్వాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి కామధేనువును తీసుకువెళతాడు. ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుని పరశువు (గొడ్డలి) తో సంహరిస్తాడు. అంతేకాదు రాజులపై కోపంతో భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. అనంతరం పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కల్యాణానికి పాటుపడతాడు. అలా చివరగా ప్రతిష్టించిన 108వ శివ లింగం వద్ద ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహి స్తుంటానని చెబుతారు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతి పొంది శివైక్యం పొందారని స్థల పురాణం చెబుతోంది. మూడు గుండ్ల ఆకర్షణఆలయం పక్కనే మూడు గుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటిల్లో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కేదారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. ఎంత శరీరం ఉన్నవారైనా శివ నామస్మరణచేస్తూ వెళితే అందులోనుంచి అవతలికి సులభంగా చేరగలగటం శివుని మహిమకు తార్కాణంగా చెబుతారు. అయితే ప్రసుత్తం మూడు గుండ్లపైకి అందరూ వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఇనప మెట్లను ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఎల్లమ్మకు బోనాలుకొండపైకి కాలినడకన వెళ్లవచ్చు. మెట్లదారిలో వెళ్లే భక్తులు కాలబైరవుని దర్శనం చేసుకుంటారు. అనంతరం కోనేరుకు చేరుకొని స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టు వద్దకు వెళ్లి అక్కడి చెట్టుకింద చెక్కతో చేసిన స్వామి పాదుకలను తమ శరీరం మీద ఉంచుకుని మొక్కుతారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆంజనేయుడు, ఎల్లమ్మ, పరశురాములని దర్శించుకుంటారు. ఇక్కడ ఎల్లమ్మ దేవతకు బోనం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శివశక్తులు నాట్యాలు చేస్తుంటారు.అనంతరం భక్తులు గట్టు కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కోరికలు నెరవేరిన వారు పల్లకి సేవ, వాహన సేవ, కోడెలు కడతారు. త్వరలో శివరాత్రికి ఇక్కడ జరగనున్న విశేష పూజలకు ముస్తాబవుతోంది ఆలయం. ఆ పేరెలా వచ్చిందంటే...రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి రేఖలు ఉండటం వల్ల స్వామిని జడల రామలింగేశ్వరస్వామి అంటారు. చెరువు గట్టున ఉండటంతో చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అంటారు. కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి కెక్కింది. కొండపై జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా అమావాస్యనాడు అన్నదానం చేస్తాం. – పోతలపాటి రామలింగేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు – చింతకింది గణేష్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
నార్కట్పల్లి : అంగరంగ వైభవంగా చెర్వుగట్టు రామలింగేశ్వరుడి కల్యాణోత్సవం (ఫొటోలు)
-
కనులపండువగా చెర్వుగట్టు జడల పార్వతీ రామలింగేశ్వర స్వామి నగరోత్సవం (ఫొటోలు)
-
కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
సాక్షి, పాలకొల్లు: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేషం సంతరించుకుంది. అర్చకులు కిష్టప్ప తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 6.60 గంటల సమయంలో గాలిగోపురం నుంచి నేరుగా శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. సాధారణంగా ఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రో జు, అంతకు ముందు, ఆ తర్వాత రోజుల్లో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకుతుంటాయి. అయితే భాద్రపద మాసంలో సూర్యకిరణాలు తాకడం ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని గ్రహాలు ఒకే కూటమిలో ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చ ని కిష్టప్ప భావిస్తున్నారు. ఇదిలాఉండగా త్వరలోనే కరోనా అంతం కానుందని, ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్లో సూర్యకిరణాలు స్వామిని తాకడమే ఇందుకు నిదర్శనమని భక్తులు అంటున్నారు. మద్దిలో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని శనివారం సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కె.హర్షవర్దన్ దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం ఆయన్ను అర్చకులు దుశ్శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో టీవీఎస్ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
సాక్షి, నల్లగొండ : గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అందరూ నిప్పులపై నడిచివస్తుండగా ఓ మహిళ అదుపుతప్పి నిప్పుల్లో పడిపోయింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. సిబ్బంది అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పిందని భక్తులు పేర్కొన్నారు. నార్కెట్పల్లి-అద్దంకి రహదారిపై కొలువై ఉన్న శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహోత్సవాలు ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సోవాలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివసత్తుల ఆందోళన గత నాలుగు రోజులుగా చెరువుగట్టులో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాది భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం జరిగిన అగ్నిగుండాల కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాలను నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శివసత్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శివసత్తులు ఆందోళనకు దిగారు. శివసత్తులకు ప్రత్యేక లైను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. -
కార్తీక పూజలు చేస్తూ అర్చకుడు మృతి
-
కార్తీక పూజలు చేస్తూ.. శివైక్యం చెందిన పూజారి
సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): పంచారామా క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు కోట నాగవెంకట ప్రసాద్(నాగబాబు) మహాపర్వదినమైన ఏకాదశి రోజున శివైక్యం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని మహిషాసుర మర్ధిని అమ్మవారికి పూజలు చేస్తున్న పూజారి నాగబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆలయ సిబ్బంది వెంటనే పూజారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా ఆయన శివైక్యం చెందినట్టుగా తెలుస్తోంది. పూజారి శివైక్యం చెందడటంతో క్షీరా రామలింగేశ్వర ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం వరకు భక్తులు ఎవరు దర్శనానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. సంప్రోక్షణ అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకోనుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 11న భీమవరం పంచారామ ఆలయ గర్భగుడిలో కుప్పకూలిన పూజారి రామరావు శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. -
సీఎం పర్యటనతో కీసరలో భారీ బందోబస్తు
-
రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి
కీసర(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామిని ఆదివారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కావడంతో అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. -
రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మాణిక్యాలరావు
తూర్పుగోదావరి: అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రులో కొలువైన శ్రీచౌడేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామిని శనివారం దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యలరావు దర్శించుకున్నారు. మంత్రి వెంట గన్నవరం ఎమ్మెల్యే పి. నారాయణ మూర్తి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. (అంబాజీపేట)