కార్తీక పూజలు చేస్తూ అర్చకుడు మృతి | Priest of Ksheera Ramalingeswara Swamy Temple dies due to heart attack | Sakshi
Sakshi News home page

కార్తీక పూజలు చేస్తూ అర్చకుడు మృతి

Published Mon, Nov 19 2018 9:44 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

పంచారామా క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు కోట నాగవెంకట ప్రసాద్‌(నాగబాబు) మహాపర్వదినమైన ఏకాదశి రోజున శివైక్యం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని మహిషాసుర మర్ధిని అమ్మవారికి పూజలు చేస్తున్న పూజారి నాగబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆలయ సిబ్బంది వెంటనే పూజారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా ఆయన శివైక్యం చెందినట్టుగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement