TARA
-
Tara: హీరోయిన్ కావడానికి బాలిక పడిన కష్టాలేంటి?
ఓ పదేళ్ల బాలిక సినిమా హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది? చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘తార’. కేరాఫ్ కంచర పాలెం ఫేమ్ కిషోర్ హీరోగా, సత్యకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి. పద్మావతి సమర్పణలో యం.బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వెంకటరమణ పసుపులేటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, నటుడు, నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.గూడ రామకృష్ణ ఫస్ట్ డైరెక్షన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మల్లి బాబు మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 నుంచి ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ తో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మేము తీస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘మా బ్యానర్లో వస్తున్న నాలుగో చిత్రమిది. గత చిత్రాలను ఆదరించినట్లే ‘తార’ను కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు నిర్మాత పసుపులేటి వెంకటరమణ. ఈ చిత్రంలో బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ...
‘మరో చరిత్ర’ సినిమాలో కమల హాసన్, సరితల మధ్య సంవత్సరం ఎడబాటు పెడతారు తల్లిదండ్రులు ప్రేమను నిరూపించుకోమని. కేరళలో గిరి, తార ఏకంగా 20 ఏళ్లు ఎడబాటును పాటించారు– ఎందుకంటే వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లడానికి జాతకాలు కలవలేదు గనక. కేరళ ఆర్.టి.సిలో ఒకే బస్సుకు అతను డ్రైవర్‌గా ఆమె కండక్టర్‌గా పని చేస్తారు. బస్సులో సొంత ఖర్చుతో అనేక హంగులు పెట్టారు. వారికీ, వారి బస్సుకీ ఫ్యాన్స్ బోలెడు. అజ్ఞాతంగా ఉన్న వీరి ప్రేమ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశాలు దాటుతోంది. సండే రోజు బస్సు ప్రేమను తెలుసుకోవచ్చు. ఈ ప్రేమ కథ 2000 వ సంవత్సరంలో మొదలైంది. ఆమె, అతడూ కాకుండా మధ్యలో ఒక బస్సు కూడా ముఖ్య పాత్ర ధరించింది. ‘నువ్వు ఎక్కవలసిన బస్సు ఇరవై ఏళ్లు లేటు’ అన్నట్టు పెళ్లి మాత్రం 2020లో జరిగింది. అయితే ఏమి వారు సంతోషంగా ఉన్నారు. ఒకరితో ఒకరు అంతే ప్రేమగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. అలెప్పీ.. ఒరు ప్రేమకథ గిరి గోపీనాథ్‌కు అప్పుడు 26. తారా దామోదరన్‌కు 24. ఆమె అలెప్పీకి సమీపంలోనే ఉండే ముత్తుకులం అనే పల్లె నుంచి సిఏ కోర్సుకు ఆడిటింగ్ నేర్చుకోవడానికి అలెప్పీలోని ఒక కోచింగ్ సెంటర్‌కు వచ్చేది. గిరి మేనమామది ఆ కోచింగ్ సెంటర్. అప్పటికి సరైన ఉద్యోగం లేని గిరి ఆ కోచింగ్ సెంటర్లో మేనమామకు సహాయంగా ఉండేవాడు. అతనికి తార నచ్చింది. తారకు గిరి. ‘మొదటిసారిగా వాలెంటైన్స్ డే రోజు ఒక గ్రీటింగ్ కార్డు ద్వారా నా ప్రేమను ఆమెకు తెలియచేశాను. ఆమె కూడా ఓకే అంది’ అంటాడు గిరి. కొన్నాళ్లు ఈ గ్రీటింగ్ కార్డులతోనే వాళ్ల సందేశాలు నడిచాయి. ‘పెళ్లి చేసుకుందాం’ అని గిరి అంటే ‘మా ఇంటికొచ్చి మాట్లాడు’ అని తారా అంది. గిరి పెద్దలతో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. ‘మాకు ఓకే. కాని జాతకాలు కలవాలి’ అని అమ్మాయి తరఫువారు అన్నారు. జాతకాలు కలవలేదు. గిరి కుటుంబం కూడా కలవని జాతకాలను చూసి జంకింది. ఈ పెళ్లి ఏ మాత్రం జరగదు అని ఇరుపక్షాలు తేల్చి చెప్పారు. గిరి మనసు విరిగిపోయింది. తార కుంగిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గిరి కోచింగ్ సెంటర్లో పని మానేసి 2007లో కేరళ ఆర్టీసీలో డ్రైవర్ అయ్యాడు. తార కోసం పెళ్లాడకుండా ఉండిపోయాడు. ‘నా కోసం ఒకతను వేచి ఉండగా నేను మరొకరిని ఎలా చేసుకుంటాను..’ అని తార కూడా వచ్చిన సంబంధాలను తిరగ్గొట్టసాగింది. అంతేనా... తానూ ఎలాగో పరీక్షలు రాసి 2010లో ఆర్టీసి కండక్టర్ అయ్యింది. ఇద్దరూ అలెప్పీలోని హరిపాద్ బస్టాండ్‌లో రూట్ నంబర్ 220కు డ్రైవర్, కండక్టర్లుగా మారారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు మెల్లగా మొదట బస్సుకు, తర్వాత ఆర్టీసి స్టాఫ్‌కు, ఆపైన పై అధికారులకు తెలిసింది. ‘బస్సే మా ప్రేమ వారధి’ అనుకుని వారిద్దరూ పెళ్లి మాట ఎత్తకనే కొనసాగారు. 2020లో పెళ్లి 2019లో కరోనా లాక్డౌన్ వచ్చాక బస్సులు వాటితో పాటు వీరిరువురి ప్రేమ హాల్ట్ అయ్యింది. కలుసుకోవడం వీలు కాలేదు. కావడం లేదు. అప్పటికి వారి వయసు 46, 44లకు చేరాయి. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వీరిరువురి పట్టుదలకు పెద్దలు తల వంచారు. జాతకాలు ఓడిపోయాయి. ఏప్రిల్ 5, 2020న తమ హరిపాద్ ఆర్టీసి బస్టాండ్‌లో తమ రూట్ నం 220 బస్సును సాక్షిగా పెట్టి దండలు మార్చుకున్నారు. అంతేనా? పై అధికారులకు చెప్పి విహార అటవీ ప్రాంతమైన మలక్కపారాకు స్పెషల్ ట్రిప్ బుక్ చేసుకున్నారు. అలా ఒక బస్సులో ప్రేమించుకుని, ఆ బస్సు ఎదుట పెళ్లి చేసుకుని, దానిలోనే హనీమూన్‌కు వెళ్లిన జంటగా వీళ్లు రికార్డు స్థాపించారు. సోషల్ మీడియాలో వైరల్ పెళ్లి సమయంలో వీరి మీధ కథనాలు వచ్చినా వారం క్రితం వల్లికదన్ అనే ఒకతను ఇన్‌స్టాలో వీరి ప్రేమ కథను వీడియో తీసి పెట్టడంతో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పది లక్షల మంది వీరి ప్రేమ కథ చూశారు. వీరి ప్రేమ బలానికి ఫిదా అయ్యారు. అలెప్పీ వెళితే రోజూ ఉదయం 5.30కు హరిపాద్‌లో బయలుదేరే వీరి రూట్ నంబర్ 220 బస్ ఎక్కండి. ఆ ప్రేమ బస్సులో అలా సాగిపోండి. ఎన్నో హంగులు... డ్యూటీలో డ్రైవర్, కండెక్టర్లు అయినా వాస్తవానికి వారు ప్రేమికులే కదా. అందుకని పై అధికారుల పర్మిషన్తో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. హాయిగా పాటలు వింటూ ప్రయాణిస్తారు. తాము ఉండే బస్సు అందంగా ఉండాలని సొంత ఖర్చుతో ప్రత్యేక అలంకరణలు చేశారు. నేరాలు జరిగి ఉద్యోగాలు దెబ్బ తినకుండా సిసి టీవీలు బిగించుకున్నారు. ఎల్ఇడి డిస్ప్లే కూడా. ఇవన్నీ ప్రయాణికులకు నచ్చాయి. హరిపాద్ బస్ స్టాండ్ నుంచి 220 రూట్లో తిరిగే పాసింజర్లు ఆ బస్సుకు– గిరి తారలకు ఫ్యాన్స్‌గా మారారు. అంతేనా... వారంతా ఒక అభిమాన సంఘంగా మారారు. ఈ ప్రేమ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ సభ్యులు ‘లీజర్ ట్రిప్’ బుక్ చేసుకుని ఈ బస్సులో పిక్నిక్లకు వెళ్లేవారు. ప్రేమజంట గిరి తారలకు ఈ ట్రిప్పులే డ్యూయెట్లు. -
తార కథ నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా?
అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి అనే ఐదు పేర్లను స్త్రీలు ప్రతిరోజూ స్మరించడం వల్ల అన్ని పాతకాలూ నశించి దీర్ఘ సుమంగళిగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. పైన మనం చెప్పుకున్న పేర్లన్నీ వివాహితలవే. అయితే వీరిని కన్యలుగా చెప్పుకోవడమంటే వినడానికీ వింతగా ఉండవచ్చు. నిజానికి వీరందరూ దేవతలే. అయితే, వివిధ రకాల శాపాల కారణంగా మానవ జన్మ ఎత్తి, తిరిగి వారు చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా దేవతల వరాలను పొంది పంచకన్యలుగా పేరు పొందారు. వారిలో మనం ముందుగా తార గురించి తెలుసుకుందాం. తార వానర రాజైన వాలి భార్య. వీరి కుమారుడు అంగదుడు. కిష్కింధ కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర ప్రముఖంగానే కనిపిస్తుంది. రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. వారిరువురూ ఒకే విధంగా ఉండడంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరమాడాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. ఈసారి మళ్లీ వెళ్లి నీ అన్నని యుద్ధానికి పిలవమని చెప్పాడు. సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బుసలు కొడుతూ బయలుదేరిన వాలిని తార వారించేందుకు ప్రయత్నించింది. ‘ఇంతక్రితమే నీ చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వెళ్లిన నీ తమ్ముడు ఇంతట్లోనే మళ్లీ వచ్చి నీపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే, దానివెనక ఏదో మర్మం ఉండి వుంటుంది. అంతేకాదు, పైగా ఇది రాత్రి సమయం. మీరు ఇప్పటివరకు శయ్యాసుఖాలు అనుభవించి ఉన్నారు. నాకు అపశకునాన్ని సూచిస్తూ, కుడికన్ను, కుడి భుజం అదురుతున్నది. మనసు కీడు శంకిస్తోంది. ఈ సమయంలో యుద్ధం అంత మంచిది కాదని నా మనసు చెబుతోంది. కాబట్టి అతను కవ్వించినంత మాత్రాన మీరు ఆవేశపడవద్దు. దయచేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. అతనిలో కలిగిన ధైర్యానికి కారణం తెలుసుకుని, అతనికి అండగా ఉన్నదెవరో కనుక్కుని, అందుకు తగ్గట్టుగా వ్యూహాన్ని రచించుకుని, అప్పుడు యుద్ధం చేద్దురుగాని, ఇప్పుడు మీరు అతన్ని పట్టించుకోవద్దు, చూసీ చూడనట్లుగా, వినిపించుకోనట్లుగా ఉండండి నాథా!’’ అని ఎంతగానో నచ్చజెప్పింది. అయితే, పోగాలం దాపురించినప్పుడు మంచిమాటలు చెవికెక్కవు కదా, కాని వాలి ఆమె మాట చెవిని వేసుకోలేదు. యుద్ధానికి బయలుదేరాడు. అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచన మాల వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించ సాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై నాటాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు. తరువాత వాలి సుగ్రీవుని పిలిచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు. పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని నేలకు ఒరిగాడు. మేరు పర్వతం వంటి భర్త నిస్సహాయంగా నేల కూలినందుకు తార ఎంతగానో బాధపడింది. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. ఇక్కడ మనం తార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేమంటే, ఆమె తొలుత వాలి భార్య. వాలి మరణానంతరం వానర రాజనీతిని అనుసరించి సుగ్రీవుడి భార్య అయింది... అదీ కూడా వాలి మరణంతో భరించరాని దుఃఖంతో ఉన్న తారకు కుమారుడైన అంగదుణ్ణి కాపాడుకోవాలంటే, అండ అవసరం. అందుకే రాముడి సలహాను అనుసరించి వాలితో సహగమనం చేయకుండా సుగ్రీవుడికి భార్యగా సహజీవనం చేయవలసి రావడం. (ఇది నేటి రోజుల్లో వాడే సహజీవనం కాదు) రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతూ, రామునికిచ్చిన మాటను దాదాపు మరచిపోయాడు. దాంతో లక్ష్మణుడు ఆగ్రహంతో సుగ్రీవుని సంహరించడానికి వెళ్లబోగా, తార సుగ్రీవుని హెచ్చరించడంతో సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకుని, తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. రాముడు అతన్ని క్షమించి ఆలింగనం చేసుకొన్నాడు. అనంతరం సుగ్రీవుడు ఆలస్యం చేయకుండా సీతాన్వేషణకు పథకాన్ని సిద్ధం చేసి రాముని అభిమానాన్ని చూరగొన్నాడు. హితవు కోరిన చెప్పిన మాటలను వినకపోవడం వల్ల వాలికి కలిగిన చేటును, హితురాలు, వివేకవతి, సౌశీల్యవతి, పతివ్రత అయిన తార మాట వినడం వల్ల సుగ్రీవునికి తప్పిన ముప్పును తలచుకుంటే ‘‘కార్యేషు మంత్రి’’ అనే సూక్తికి తార ఎంత న్యాయం చేసిందో గ్రహించవచ్చు. తార కథ నుంచి మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, భార్య ఎల్లప్పుడూ లౌకిక పరిస్థితులను గురించి భర్తకు తెలియజెబుతూ, కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. అంతేకానీ, కర్తవ్య విముఖుణ్ణి చేయరాదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
-
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
వాషింగ్టన్: నగరంలో కనుల పండుగగా శ్రీనివాస కళ్యాణ వేడుకలు ‘తారా’ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ అరౌండ్) జనరల్ సెక్రటరీ 'సంతోష్ కుమార్ బచ్చు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ... శ్రీ వేంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల విగ్రహాలకు తిరుపతిలో కళ్యాణం జరిగేంత ఘనంగా వేద పండితులు, అర్చకుల చేత కళ్యాణ వేడుకలు జరిపించినట్లు పేర్కొన్నారు. నాదస్వర వాయిద్యాల మధ్య కోలాటం ఆడుతూ... స్వామి వారిని పల్లకిలో స్వాగతిస్తూ.. సుప్రభాత సేవతో స్వామివారిని, అమ్మవార్లను ఊరేగించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తి విన్యాసాలతో, గోవింద నామాలతో , విష్ణు సహస్ర , అన్నమాచార్య కీర్తనలతో భక్త బృందం పాల్గొని తన్మయత్వంలో మునిగితేలారు. అలాగే ఉదయం ఏర్పాటు చేసిన ఫలహారాన్ని, కళ్యాణం తర్వాత పంచిన మహాప్రసాదాన్ని భక్తులు ఆస్వాదించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు, వడ ప్రసాదం విరివిరిగా పంచామని, చివరగా పల్లకి సేవతో స్వామివారికి, అమ్మవార్లకి భక్తులంతా వీడ్కోలు పలికినట్లు ఆయన వివరించారు. స్వామివారి కళ్యాణం తర్వాత తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూ ఉచితంగా పంచడంతో భక్తులంతా హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. అనంతరం స్వామివారి కళ్యాణానికి హజరై విజయవంతం చేసిన భక్తులందరికి తారా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
హిందీ అర్జున్ రెడ్డి ప్రేయసిగా..
టాలీవుడ్లో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సెన్సేషనల్ హిట్. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ఈ చిత్రం ద్వారా షాలినీ పాండే కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. బాలా దర్శకత్వంలో ఈ చిత్రం తమిళ రీమేక్ ‘వర్మ’ ద్వారా విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త కథానాయికను తీసుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైనా ఇంకా కథానాయికపై క్లారిటీ రాలేదు. ఇక.. హిందీ రీమేక్ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాను సందీప్‌రెడ్డి వంగానే తెరకెక్కించనుండటం విశేషం. షాహిద్ కపూర్ హీరో. ఈ సినిమాలో కథానాయికగా తారా సితారియా నటించనున్నారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ కరణ్ జోహార్ నిర్మాణంలో టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఇదే తారాకు తొలి సినిమా కావడం విశేషం. -
యూకేలో ఘనంగా 'తారా' ఉగాది ఉత్సవాలు
లండన్ : తారా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ రెడింగ్ అండ్ అరౌండ్ యూకే) ఆధ్వర్యంలో శ్రీ హేవిళంబి ఉగాది 2017 ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సుమారు 600 మంది తెలుగువారు ఈ ఉత్సవాలకు హాజరై "ఏదేశమేగినా ఎందు కాలిడినా" అన్న రాయప్రోలు మాటలను నిజం చేశారు. ఈ ఉగాది ఉత్సవాలలో పద్మశ్రీ అవార్డు గ్రహీత 'లక్ష్మి ఆసు' యంత్ర నిర్మాత చింతకింది మల్లేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు. తారా అధ్యక్షులు సూర్యప్రకాష్ భళ్లమూడి, మల్లేశంని సగౌరవంగా ఆహ్వానిస్తూ వేదికపైకి తీసుకొని వచ్చారు. తారా కార్యదర్శి సంతోష్ బచ్చు మల్లేశంని రెడింగ్ తెలుగువారికి పరిచయం చేస్తూ, వారు పడ్డ శ్రమను,నిస్వార్ధంగా వారు చేస్తున్న పనిని కొనియాడారు. 'తారా' కోశాధికారి రవికాంత్ వాకాడ మాట్లాడుతూ మల్లేశం అందరికి రోల్ మోడల్ అని, కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న మాటకి ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రశంసించారు. 'తారా' వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మి మాటూరు, మహిళా కార్యదర్శి మధురిమ రంగాలు మల్లేశంకు పుష్పగుఛ్చం అందించగా, సూర్యప్రకాష్, సంతోష్ శాలువాతో సత్కరించారు. రవికాంత్, బాలా కాకర్ల తారా మొమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా తారా తొలిసారిగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్‌ను తారా ట్రస్టీలు నవీన్ గుర్రం, గోపికిషన్ నేరెళ్లకుంట, రాంబాబు బూరుగులు మల్లేశంతో ఆవిష్కరింపజేశారు. తారా తెలుగు పత్రిక 'తోరణం' మొదటి సంచికను 'తారా' ట్రస్టీలు వెంకట్ పారాగారు మల్లేశంకి అందజేశారు. అనంతరం మల్లేశం మాట్లాడుతూ 'తారా' యు.కె. తెలుగు ప్రజలకి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, తమ అనుభవాలని సోదాహరణంగా ఫొటోలు, వీడియోల సహాయంతో వివరించారు. 'లక్ష్మి ఆశు' యంత్ర నిర్మాణంలో వారు పడ్డ కష్టాలను, వారి తల్లిపడిన కష్టం, చేనేత కార్మికులకు ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగ పడుతోందో తెలిపారు. మల్లేశం తల్లిపడిన కష్టాన్ని చెప్తున్నప్పుడు హాజరైన అందరూ చలించిపోయారు. ఉపన్యాసం ముగిసినప్పుడు సభా ప్రాంగణంలో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.కార్యక్రమానికి హాజరైన తెలంగాణా ప్రవాస సంఘం (టీఈఎన్ఎఫ్) యు.కె. అధ్యక్షులు చంద్రశేఖర్, తారా చేస్తున్న సేవలను కొనియాడుతూ వారి సంఘం చేనేత కార్మికులకు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మల్లేశం భావి తరాలకు మార్గదర్శకం అని కొనియాడారు. సింగర్ హేమచంద్ర వేదుల, దామిని భట్లలు బాహుబలి చిత్రంలో పచ్చబొట్టు పాటతో వీక్షకులను ఉర్రూతలూగించారు. తారా సభ్యులు ప్రదర్శించిన అనేక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. చిన్న పిల్లల నాటకాలు, నృత్యాలు, పాటలు సభికులను ఎంతాగానో ఆకట్టుకున్నాయి. చివరిగా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి తోడ్పడిన వాలంటీర్ల సేవలను సంతోష్, రవికాంత్ పేరు పేరున స్మరించి వారికి తారా తరపున ధన్యవాదాలు తెలియజేశారు. -
తార