Tara: హీరోయిన్‌ కావడానికి బాలిక పడిన కష్టాలేంటి? | Tara Movie Pooja Ceremony | Sakshi
Sakshi News home page

Tara: హీరోయిన్‌ కావడానికి బాలిక పడిన కష్టాలేంటి?

Oct 7 2022 4:42 PM | Updated on Oct 7 2022 4:42 PM

Tara Movie Pooja Ceremony - Sakshi

ఓ పదేళ్ల బాలిక సినిమా హీరోయిన్‌ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది? చివరికు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకొంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘తార’. కేరాఫ్ కంచర పాలెం ఫేమ్ కిషోర్ హీరోగా, సత్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి. పద్మావతి సమర్పణలో  యం.బి (మల్లి బాబు) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ..  వెంకటరమణ పసుపులేటి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా  ఈ చిత్రం సినిమా పూజా  కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, నటుడు, నిర్మాత సాయి వెంకట్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు.గూడ రామకృష్ణ  ఫస్ట్ డైరెక్షన్ చేశారు. 

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మల్లి బాబు మాట్లాడుతూ..  అన్ని వర్గాల  వారిని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 నుంచి  ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ తో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మేము తీస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ  ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. 

‘మా బ్యానర్‌లో వస్తున్న నాలుగో చిత్రమిది. గత చిత్రాలను ఆదరించినట్లే ‘తార’ను కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు నిర్మాత పసుపులేటి వెంకటరమణ. ఈ చిత్రంలో బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement