
ఆటా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామచేని, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ...1991లో ఏర్పాటైన ఆటా సంస్థ గత 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్‌కి పైగా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. అలాగే ప్రతి రెండేళ్లకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో 15 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
2024 జూన్ 7,8,9 తేదీలలో అమెరికాలో అట్లాంటా నగరంలో జరగనున్న ఆటా సదస్సును నిర్వహిస్తున్నామని, ఆ సదస్సుకి తెలుగు రాష్ట్రాల అన్ని రంగాల ప్రముఖులు హాజరు అవుతారని, ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సినీ నటుడు, కల్చరల్ అడ్వైజరీ లోహిత్, కో ఆర్డినేటర్ శశికాంత్, మీడియా కో ఆర్డినేటర్ వెంకటేశ్వర రావు సిహెచ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తెలంగాణ చైర్, C. శేఖర్ రెడ్డి, ఆటా బిజినెస్ చైర్ లక్ష్ చేపూరి తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమయ్యారు ఈ ఆటా వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. అలాగే గవర్నర్ కూడా ఆటా ఆహ్వానాన్ని ఆమోదించారు.
(చదవండి: అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్)
Comments
Please login to add a commentAdd a comment