
డల్లాస్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ కార్యవర్గ బృందం 2021 సెప్టెంబర్ 25న ఎస్‌పీ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్థంతి వేడుకలు నిర్వహించారు. డల్లాస్‌కి చెందిన గాయనీగాయకుల చేత బాలు గాన సుధా స్మృతి అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజశేఖర్ సూరిభొట్ల, సంతోష్ ఖమ్మామ్కర్, జానకి శంకర్, సాయి రాజేష్ మహాభాష్యం, సృజన ఆడూరి , ప్రభాకర్ కోట, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, నాగి వడ్లమన్నాటి, బాలాజి నరసింహన్, వీణ యెలమంచలి, జ్యోతి సాదు, మల్లిక సూర్యదేవర, రోషిని బుద్ధ లు ఎస్పీబీ పాడిన యాభైకి పైగా గీతాలను ఆలపించారు.
బాలుతో విడదీయలేని బంధం
ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, ఉత్తరాధ్యక్షులు మధు బొమ్మినేని బాలు గారితో ఆటా సంస్థ కి ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఆయన లేని లోటు ఎప్పటికి తీరదన్నారు. బాలు మన మధ్య లేక పోయినా ఆయన పాట చిరస్థాయిగా సంగీత ప్రియుల హృదయాలలో నిలిచి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment