bala subrahmanyam
-
యూత్ నన్ను లెజెండ్ అని పిలుస్తున్నారు.. నేను ఎంత పుణ్యం చేసుకున్నాను..
-
ఎస్పీబీకి ‘ఆటా’ స్వర నీరాజనం
డల్లాస్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ కార్యవర్గ బృందం 2021 సెప్టెంబర్ 25న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్థంతి వేడుకలు నిర్వహించారు. డల్లాస్‌కి చెందిన గాయనీగాయకుల చేత బాలు గాన సుధా స్మృతి అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజశేఖర్ సూరిభొట్ల, సంతోష్ ఖమ్మామ్కర్, జానకి శంకర్, సాయి రాజేష్ మహాభాష్యం, సృజన ఆడూరి , ప్రభాకర్ కోట, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, నాగి వడ్లమన్నాటి, బాలాజి నరసింహన్, వీణ యెలమంచలి, జ్యోతి సాదు, మల్లిక సూర్యదేవర, రోషిని బుద్ధ లు ఎస్పీబీ పాడిన యాభైకి పైగా గీతాలను ఆలపించారు. బాలుతో విడదీయలేని బంధం ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, ఉత్తరాధ్యక్షులు మధు బొమ్మినేని బాలు గారితో ఆటా సంస్థ కి ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఆయన లేని లోటు ఎప్పటికి తీరదన్నారు. బాలు మన మధ్య లేక పోయినా ఆయన పాట చిరస్థాయిగా సంగీత ప్రియుల హృదయాలలో నిలిచి ఉంటుందన్నారు. చదవండి: విజయవంతమైన తానా సాహిత్య సదస్సు -
‘పద్మ’గీతం గానం: చిత్ర, బాలు
ఒకరు గురువు.. ఒకరు శిష్యురాలు ఒకరు తెలుగు. ఒకరు మలయాళం. ఒకరు లేరు. ఒకరు ఆ జ్ఞాపకాన్ని, గానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరికి పద్మవిభూషణ్ వచ్చింది. ఒకరికి పద్మభూషణ్. పాటకు దక్కిన అంజలి ఇది. తెలుగు శ్రోతలకు ఈ ఇద్దరూ ఇచ్చిన వెలకట్టలేని గీతాలెన్నో. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్రలకు పద్మ పురస్కారాలు వచ్చిన సందర్భంగా ఆ పాటలు తలుచుకుని అభినందనలు తెలపాలి. ‘నిప్పులోన కాలదు... నీటిలోన నానదు.. గాలిలాగ మారదు... ప్రేమ సత్యము’ అని పాడతారు చిత్ర. ‘రాచవీటి కన్యవి.. రంగు రంగు స్వప్నము.. పేదవాడి కంటిలో ప్రేమరక్తము’ అని పాడతారు బాలు. వింటున్నవారందరూ ఏ వయసు వారైనా ప్రేమ స్పర్శను అనుభవిస్తారు. వారిద్దరి జోడి అలాంటిది. తెలుగు సినీ సంగీత అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. దుఃఖంగా కూడా ఉన్నారు. సంతోషం చిత్ర, బాల సుబ్రహ్మణ్యంలకు ‘పద్మ’ అవార్డులు వచ్చినందుకు. దుఃఖం.. బాలుగారు లేనందుకు. ఉండి ఉంటే ఇవాళ వీరి యుగళ గీతాలు మరింత హుషారుగా మోగిపోయేవి. తెలుగులో బాల సుబ్రహ్మణ్యం తిరుగులేని మేల్ సింగర్. ఆయన పక్కన కొద్దిగా దస్తీ వేయగలిగినది మనో ఒక్కడే. కాని చిత్ర తెలుగులో టాప్ రేంజ్‌కు వెళ్లడం అంత సులువు కాదు. ఎందుకంటే ఆమె తెలుగులో 1985లో ‘సింధుభైరవి’తో అడుగుపెట్టే సమయానికి ఇక్కడ సుశీల, జానకిలు శక్తిమంతంగా ఉన్నారు. చక్రవర్తి, కె.వి.మహదేవన్‌లు బాలు, సుశీల, జానకీలతోటే అన్ని పాటలు పాడించేవారు. కొన్ని పాటలు శైలజ కు వెళ్లేవి. ఇందరు ఉండగా చిత్ర ప్రవేశం కష్టమే. కాని 1986లో ‘డాన్స్ మాస్టర్’ సినిమాకు డబ్బింగ్ పాడుతున్నప్పుడు బాలు చిత్రలోని టాలెంట్‌ను దగ్గరి నుంచి గమనించారు. ఆ సినిమాలో ‘రావేల వసంతాలే’ పాట చిత్రను ఇంటింట మోగే రేడియో గొంతుగా మార్చింది. అందులోని ‘జింగిల్జింగా జీమూతా జింగిల్జింగా’, ‘కవిత చిలికింది’ పాటలు బాలు, చిత్ర పాడారు. చిత్ర మలయాళీ. ఆమెకు తమిళం బాగానే తెలుసు. కాని తెలుగు బొత్తిగా తెలియదు. బాలు ఆమెకు సాయం చేసేవారు. తెలుగు ఉచ్ఛరణ దాదాపుగా ఆమె బాలు వల్లే నేర్చుకున్నారు. ‘చెప్పి చెప్పి ఒక దశలో నేను చెప్పను నువ్వే నేర్చుకో అన్నాను. పట్టుదలగా నేర్చుకుంది’ అని బాలు ఒక సందర్భంగా మెచ్చుకోలుగా అన్నారు. 1990 వరకు చిత్రకు తెలుగులో సరైన పూనిక దొరికలేదు. ‘ఆఖరి పోరాటం’లో చిత్ర, బాలు పాడిన ‘ఎప్పుడు ఎప్పుడు’, ‘అబ్బ దీని సోకు’ హిట్ అయినా. చిత్రకు తెలుగు అవకాశాలు ఇళయరాజా ఇస్తూ వెళ్లారు. ‘మరళమృదంగం’లో బాలు, చిత్ర పాడిన ‘గొడవే గొడవమ్మా’ పెద్ద హిట్. ‘వారసుడొచ్చాడు’లో ‘నీ అందం నా ప్రేమగీతం గోవిందం’ పాట కూడా. ఆ తర్వా ఇళయరాజా చిత్ర, బాలుల గళాలతో సృష్టించిన స్వరచరిత్ర ‘గీతాంజలి’. అందులో ఇద్దరూ కలిసి అమృతం కురిపించారు. ‘ఓ ప్రియా ప్రియా’, ‘ఓం నమహ’ డ్యూయెట్లు ఎంతో ప్రియమైనవి. ఇక ‘జగదేక వీరుడు–అతిలోకసుందరి’ కోసం వీరు పాడిన విఖ్యాత డ్యూయెట్ ‘అబ్బనీ తీయని దెబ్బ’ రికార్డులు సృష్టించింది. కీరవాణి రాకతో 1990లో ‘మనసు–మమత’ సినిమాతో కీరవాణి రాకతో బాలు, చిత్ర, కీరవాణిల పాటలు తెలుగు నేలను ఊపేశాయి. కీరవాణి చిత్రతోనే ఎక్కువ పాటలు చేశారు. బాలుకు కొత్త ఊపు తెచ్చారు. బాలు, చిత్ర కలిసి పాడిన ‘పూసింది పూసింది పున్నాగ’ కీరవాణి తెలుగువారికి ఇచ్చిన ఒక పున్నాగపువ్వు పరిమళం. ‘క్షణక్షణం’లో బాలు, చిత్ర ఆయన బాణీలకు హిట్ రేంజ్ తెచ్చారు. ‘అమ్మాయి ముద్దు ఇవ్వందే’, ‘జాము రాతిరి’... ఇప్పటికీ వింటున్నారు. ఇక కీరవాణి చేసిన ‘అల్లరి ప్రియుడు’ అచ్చంగా బాలు, చిత్రల మ్యూజికల్. ‘అహో.. ఒక మనసుకు నచ్చిన’, ‘రోజ్ రోజ్ రోజా పువ్వా’... పాటల పూలు. ఇక కీరవాణి సంగీతంలో వచ్చిన ‘క్రిమినల్’ క్లాసిక్ డ్యూయెట్ ‘తెలుసా.. మనసా’ ఎలా మరువగలం. ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘పెళ్లి సందడి’.. ఇవన్నీ బాలు, చిత్రల మేజిక్‌తో నిండి ఉన్నాయి. ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా అమ్మకచెల్లా’ ఎలా మర్చిపోగలం. రెహమాన్‌తో బాలు, చిత్రలు ఏ.ఆర్.రెహమాన్ పాటలతో తెలుగు సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రెహమాన్ తొలి సినిమా ‘రోజా’లో వీరిద్దరూ కలిసి పాడిన ‘పరువం వానగా’... లోని మాధుర్యం ఎంతని. ఆ తర్వాత ‘డ్యూయెట్’లో బాలు, చిత్రల ప్రతిభకు గొప్ప ఉదాహరణగా ‘అంజలి.. అంజలి.. పుష్పాంజలి’ పాట ఉంటుంది. ఆ పాట చరణంలో హైపిచ్‌లో ఇద్దరూ పాడేది వినాలి. అందులో చిత్ర ఆలాపనలూ అద్భుతం. ఎన్నో ఆణిముత్యాలు.. చిత్ర, బాలూ లేకపోతే తెలుగులో 1990 –2000 మధ్య సినిమా సంగీతం లేదన్నంతగా వారు వందలాది గీతాలు పాడారు. ఆ తర్వాత కొత్తతరం సంగీత దర్శకులు వచ్చినా వీరి జోడుగానం కొనసాగింది. రాజ్కోటిల సంగీతంలో వచ్చిన ‘ప్రియరాగాలే’ (హలో బ్రదర్), ‘అందమా అందుమా’ (గోవిందా గోవిందా), ఎస్.ఏ.రాజ్‌కుమార్ సంగీతంలో వచ్చిన ‘గుండె నిండ గుడి గంటలే’, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ‘నా మనసునే మీటకే’ (మన్మథుడు)... ఆ లిస్టుకు అంతే లేదు. చిత్ర బాలూను గురువుగా భావిస్తారు. ఆ గురుపరంపరను ఆమె కొనసాగిస్తున్నారు. శిష్యురాలికి ‘పద్మభూషణ్’, గురువుకు ‘పద్మవిభూషణ్’ వచ్చిన ఈ వేళ నిజంగా సంగీతమయమైన వేళ. పాటగా వ్యాపించి ఉన్న బాలు సంతృప్తి పడేవేళ. ‘నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా.. నా మనసేమో నా మాటే వినదంటా’... – సాక్షి ఫ్యామిలీ -
బాలూ–లతా కాంబినేషన్ సూపర్‌హిట్
కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్‌ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అతను తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. లతా మంగేష్కర్ పక్కన పాడి హిట్టయిన దక్షణాది గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. వారి మధ్య అనుబంధం, వారి పాటలు, బాలూ చనిపోయాక ఆయన గురించి లతా చెప్పిన విశేషాలు లతా జన్మదినం సందర్భంగా... లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ఆమెను ఉర్దూ నేర్చుకోమన్నారు. తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఉర్దూ భాష తెలిసినవారు కూడా ఒక్కోసారి ‘జరూరీ’ (jaroori)అంటారు. కాని బాలూ పాడితే సరైన ఉచ్ఛారణతో zaroori అంటాడు. ఉర్దూ పదాలు ‘ఖైర్’, ‘ఖయాల్’, ‘సమజ్దార్’ వంటివి కూడా వాటి సరైన ఉచ్ఛారణతో బాలూ పాడటం సంగీతాభిమానులకు తెలుసు. అందుకే ఆయన లతా మంగేష్కర్‌కు ఇష్టమైన గాయకుడయ్యారు. గొప్పపాటలు పాడగలిగారు. నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా ‘ఏక్ దూజే కే లియే’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకుంటున్న బాలు లతా మంగేష్కర్‌కు అందరు గాయకులతో పాడటం అంత సౌకర్యంగా ఉండదు. ఆమె గోల్డెన్ పిరియడ్ అంతా రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండ గాయకులతో గడిచింది. ఆమె తెలుగులో ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కాని బాల సుబ్రహ్మణ్యం అదృష్టం వేరు. బాలూ–లతా కాంబినేషన్ సూపర్‌హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కాని లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారు. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లకు తప్పలేదు. కాని ఆశ్చర్యకరంగా బాలూతో పని చేయడం మొదలెట్టాక వారు ఆయన మోహంలో పడిపోయారు. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు. లతా మంగేశ్కర్ కూడా ‘బాలూ ఒక ప్రత్యేక గాయకుడు’ అని మెచ్చుకున్నారు. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హటాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’ అన్నారు లతా బాలూ మరణవార్త విని. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి. ‘ఈ సినిమాలో పాట రికార్డింగ్ కోసం లతా పాడుతూ ‘హమ్ ఆప్ కే హై కౌన్’ అనగానే నేను తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని అనేవాణ్ణి. ఆమె పాడటం ఆపేసి– చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’ అని ముద్దుగా కోప్పడేవారు’ అని బాలూ ఒక సందర్భంలో చెప్పారు. ‘బాలూని నేను చాలాసార్లు రికార్డింగ్ థియేటర్లలోనే కలిశాను. కాని ఒకటి రెండుసార్లు ఆయన మా ఇంటికి వచ్చి నాకు బహుమతులు తెచ్చారు. ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఆయనను నేను బాలాజీ అని పిలిచేదాన్ని’ అని లతా అన్నారు. లతా చనిపోయారనే పుకార్లు ఇటీవల వచ్చినప్పుడు వాటిని ఖండిస్తూ బాలూ వీడియో విడుదల చేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణవార్త లతా వినాల్సి వచ్చింది. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతా చాలా కంగారు పడటం గురించి బాలూ చెప్పుకునేవారు. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు లతాకు మిగిలిన బరువైన గుర్తులు. లేదా మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ -
టీడీపీ నేతకు భూ నజరానా
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్మదీయులకు ప్రభుత్వం భూసంత్పరణ కొనసాగిస్తోంది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, తిరుపతి కేంద్రంగా వైద్యరంగంలో స్థిరపడ్డ డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యంకు చెందిన అలైట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అత్యంత విలువైన భూమిని కారుచౌకగా కేటాయించింది. తిరుపతి శివారు కరకంబాడిలో రూ.15 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.20 కోట్లకే ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ బుధవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం.266) జారీ చేశారు. మంత్రుల ద్వారా పైరవీలు తిరుపతి నుంచి మంగళం మీదుగా కడప హైవేకు వెళ్లే మార్గంలో కరకంబాడి గ్రామం ఉంది. దీనిపక్కనే అమరరాజా ఫ్యాక్టరీ ఉంది. దీనికి సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెంబరు 774/3లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని 500 పడకలతో నిర్మించే అలైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మార్కెట్ విలువ ఎకరం రూ.35 లక్షలుగా నిర్ధారించినప్పటికీ తక్కువ ధరకే ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అమరనాథరెడ్డిల ద్వారా భూమి కోసం ప్రయత్నాలు చేశారని సమాచారం. దీంతో ప్రభుత్వం ఇదే సర్వే నెంబరులో ఉన్న 15 ఎకరాల భూమిని ఎకరం కేవలం రూ.8 లక్షలకే ఇవ్వాలని నిర్ణయానికొచ్చింది. మూడేళ్లలో భూమిని వినియోగంలోకి తీసుకురావాలని, కేటాయించిన భూమిలో జల వనరుల రూపురేఖలు మార్చకూడదని జీవోలో స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకే భూమిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రూ.15 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.20 కోట్లకే కట్టబెట్టడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దలకు ముడుపులు ముట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పలు సంస్థలకు భూముల కేటాయింపు వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో ట్రక్ టెర్మినల్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వం 402.32 ఎకరాలు ఉచితంగా కేటాయించింది. ఇదే జిల్లా పెనుగొండ మండలంలో డంపింగ్ యార్డు, ఇతర అవసరాల కోసం ఏపీఐఐసీకి 129 ఎకరాలను ఉచితంగా కేటాయించింది. చిత్తూరు జిల్లా నగరి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి 101.18 ఎకరాలను కేటాయించింది. వీటితోపాటు మరికొన్ని సంస్థలకు భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ జీవోలు జారీ చేసింది. -
అవినీతి డీఈఓను జైలుకు పంపాలి : విఠపు
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: అవినీతిపరుడైన డీఈఓ మువ్వా రామలింగాన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు వెంటనే జైలుకు పంపాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. డీఈఓ అక్రమాలకు వ్య తిరేకంగా ఉపాధ్యాయులు టెన్త్ స్పాట్ జరుగుతున్న దర్గామిట్టలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల వద్దకు శుక్రవారం ఉదయం 8 గంటలకే చేరుకుని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యాశాఖలో భారీ కుంభకోణాలకు కారకుడైన డీఈఓకు స్పాట్ నిర్వహించే అర్హత లేదంటూ నినాదాలతో హోరెత్తించారు. రామలింగాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించినా ఉపాధ్యాయులు ఖాతరు చేయకుండా నిరసన కొనసాగించారు. దీంతో సిటీ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉపాధ్యాయులను బలవంతంగా అరెస్ట్ చేసి ఒకటో నగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు. విద్యాశాఖకు చీడపురుగు ఉపాధ్యాయుల అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ మువ్వా రామలింగాన్ని విద్యాశాఖలో చీడపురుగుగా అభివర్ణించారు. పనిచేసిన ప్రతి జిల్లాలోనూ ఉపాధ్యాయులు ఆయనను తన్ని తరిమేశారన్నారు. ఆయనతో వేగలేక గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారని, గుం టూరు జిల్లాలో ఏసీబీ కేసులో జైలుకెళ్లాడని, కర్నూలులో ఉపాధ్యాయులు తరి మితరిమి కొట్టినా సిగ్గు రాలేదన్నారు. నెల్లూరులో కార్పొరేట్ విద్యాసంస్థలకు తొత్తుగా మారి పదో తరగతి పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించారు. గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు పాఠశాలల నుంచి లక్షలకు లక్షలు గుంజుతున్నాడన్నారు. అడిగినంత ఇవ్వకపోతే వేధించడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. ఆరు నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్న శేషాద్రివాసుకు పరీక్షల విధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మహిళా టీచర్లతో వ్యంగ్యంగా మాట్లాడే ఆయనను త్వరలో వారే బుద్ధిచెబుతారన్నారు. ఈ ప్రబుద్ధుడిని సస్పెండ్ చేసేందుకు గతం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండుమార్లు ఫైలు నడిపారని, అయితే అప్పటి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కాపాడారన్నారు. ఈ విషయాన్ని ఆ అధికారే స్వయంగా తనకు తెలిపారని విఠపు వివరించారు. ఏసీబీ కేసు కారణంగా ఉద్యోగం పోతుందని భయపడి రాజకీయ పలుకుబడి, ధనబలంతో కేసును శాఖాపరమైన విచారణకు మార్పించుకున్నాడని తెలిపారు. ఇప్పుడు కాపాడేదానికి కాంగ్రెస్ నాయకులు, ఆనం సోదరులు లేరనే విషయాన్ని డీఈఓ గుర్తించుకోవాలన్నారు. గవర్నర్ ఆర్డర్‌తో పచ్చి వెలక్కాయ ఏసీబీ కేసుపై మళ్లీ విచారణ జరిపించాలని గవర్నర్ ఉత్తర్వులివ్వడంతో డీఈఓ గొంతులో పచ్చివెలగకాయ పడినట్టయిందని విఠపు ఎద్దేవా చేశారు. ఇక ఆయన శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమన్నారు. ఒక వేళ తమకు న్యాయం జరగకపోతే చట్టాన్ని ధిక్కరించేదానికి సిద్ధంగా ఉండామన్నారు. వేసవి సెలవులంతా డీఈఓకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామన్నారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులను వేధించే మువ్వా ఇప్పుడు విలేకరులపై దాడులు మొదలుపెట్టారని, ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే పోలీసులపైనా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. డీఈఓకు తొత్తులుగా మారిన శేషాద్రివాసులాంటి ఒకరిద్దరు ఇకనైనా మారాలని హితవుపలికారు. లేదంటే డీఈఓకు పట్టిన గతే పడుతుందన్నారు. నిరసన కార్యక్రమానికి ఏపీటీఎఫ్(1938) కార్యదర్శి వెంకటేశ్వరరావు మ ద్దతు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాబురెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీహరి, పరంధామయ్య, సుబ్బారావు, ఖాదర్‌మస్తాన్, రమ, టి.స్వర్ణలత పాల్గొన్నారు.