
నాష్‌విల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం వాండర్‌బిల్ట్ యూనివర్సిటీలో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్‌విల్(ఐకాన్)లు ఘనంగా నిర్వహించాయి. 450 మంది భారతీయ, విదేశీ మహిళలు ఈ వేడుకలకు హాజరయ్యారు. మహిళా చైతన్యంపై పలువురు భావోద్వేగ భరిత ప్రసంగాలు చేశారు. అనంతరం ఆటపాటలతో వేదిక హోరెత్తింది.
ఈ వేడుకకు ఆటా కార్యదర్శి సౌమ్య కొండపల్లి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. మహిళా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను రాధికా రెడ్డి, లావణ్యా రెడ్డి, బిందు మాధవిల నేతృత్వంలోని 15 సభ్యుల బృందం పర్యవేక్షించింది. అటా ప్రతినిధులు నూకల నరేందర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, సుశీల్ చందా, కిషోర్ రెడ్డి గూడూరులు కూడా వేడుకలకు విచ్చేశారు.
వేడుకల్లో భాగంగా సాంస్కృతిక, వైద్య, సామాజిక రంగాల్లో ఎనలేని సేవలు అందిస్తున్న డా. నిషితా రెడ్డి, కృష్ణమయి రామయ్య, సరస్వతి గౌడ, శాంత సరగూర్, సహాన బాలసుబ్రహ్మణ్యంలను ఆటా సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment