
సాక్షి, అనంతపురం : అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) వేడుకలకు హాజరు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసోసియేషన్ నాయకులు ఆహ్వానం అందజేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ జగన్‌ను మధ్యాహ్న భోజన విరామ సమయంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి కలుసుకున్నారు.
ఆయన వెంట బుజాల భువనేశ్, వేణు రెడ్డి, లింగాల హరి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తున్న వైఎస్ జగన్‌ను ఆటా సభ్యులు ప్రశంసించారు.
2016లో ఆటా వేడుకలకు వైఎస్ జగన్ తరఫున వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడి సందేశాన్ని కార్యక్రమంలో వినిపించారు.



