అమెరికాలో ప్రపంచ తెలంగాణ మహాసభలు | world telangana mahasabha in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో ప్రపంచ తెలంగాణ మహాసభలు

Published Tue, Apr 19 2016 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం (ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియజెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం (ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జూలై 8 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో ‘ప్రథమ ప్రపంచ తెలంగాణ మహా సభలు’ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సభలకు 25 దేశాల నుంచి  సుమారు 7 వేల మంది తెలుగువారు హాజరవుతారన్నారు. ఈ సభలకు సీఎం కేసీఆర్, మంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు. అనంతరం జ్యోతిరెడ్డి చింతల పాని, రమాదేవి నీలారపు, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అధ్యక్షురాలు, ప్రముఖ నృత్యకారిణి కె.పద్మజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ కో ఆర్డినేటర్ బి. రామచంద్రారెడ్డి, రావు నెరుసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement