
అట్లాంటా : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో జార్జియాలోని అట్లాంటాలో ఇన్‌కమ్ ట్యాక్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే 2019లో టాక్స్ చట్టాల్లో మార్పులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆటా పేర్కొంది. అట్లాంటాలో 2009 నుంచి ట్యాక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్‌ను అందిస్తున్న సీపీఏ ప్రభాకర్ రెడ్డి టాక్స్ చట్టాలపై సెషన్ తీసుకున్నారు. ట్యాక్స్ చట్టాలు 2018, ఎన్‌ఆర్‌ఐ ట్యాక్సేషన్, ట్యాక్స్ ఫిల్లింగ్ వంటి అంశాలపై ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా పాల్గొన్నారు. మంచి కార్యక్రమంతో టాక్స్ చట్టాలపై అవగాహన కల్పించిన ఆటాకు తరగతులకు హాజరైనవారు కృతజ్ఞతలు తెలిపారు.
సీపీఏ ప్రభాకర్ రెడ్డికి ఆటా అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి, కిరణ్ పాశం, అనిల్ బొడ్డిరెడ్డి, వేణు పిసికెలు కృతజ్ఞతలు తెలిపారు. ఆటా రీజినల్ కోఆర్డినేటర్లు ప్రశాంత్ పీ, శ్రీరామ్ ఎస్, గణేష్ కాసం, ఆటా రీజినల్ డైరెక్టర్ తిరుమల్ రెడ్డి, ఆటా స్టాండింగ్ కమిటీ ఛైర్స్, కో ఛైర్స్ రమణారెడ్డి, శివకుమార్ రామడుగు, శ్రీధర్ టీ, ఉమేష్ ముత్యాల, ఉదయ్ ఎటూరు, సుబ్బారావు మద్దలి, సురేష్ వోలమ్‌లతోపాటూ ఆటా వాలంటీర్లు అతిథులకు అన్ని సౌకర్యాలను కల్పించారు.