
డెట్రాయిట్: వచ్చే ఏడాది జులైలో డెట్రాయిట్ వేదికగా జరగనున్న ఆటా 17వ సమావేశాలు, యూత్ కన్వెన్షన్‌కి 1.25 మిలియన్ డాలర్లు నిధులను ఇప్పటి వరకు సమీకరించినట్టు ఆటా ప్రతినిధులు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బోర్డు సమావేశం శనివారం డెట్రాయిట్ నగరంలో జరిగింది. ఈ సందర్భంగా హర్ట్‌పుల్‌నెస్ ప్రోగ్రామ్ గైడ్ కమలేశ్ డీ పటేల్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆటా బోర్టు సమావేశం ప్రారంభించడానికి ముందు సెప్టెంబర్ 11 బాధితులకు నివాళి అర్పించారు. ఆటా ఆర్థిక స్వయం సమృద్ధికి సంబంధించిన విశేషాలను ఆటా అధ్యక్షుడు భువనేశ్ బూజాల, కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డలు వివరించారు. ఈ సమావేశంలో ఫైనాన్షియల్ రిపోర్టును ట్రెజరర్ బోయపల్లి సాయినాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గడిచిన కొద్ది కాలంలోనే వెయ్యి మందికి పైగా కొత్తగా ఆటాలో సభ్యత్వం తీసుకున్నట్టు మెంబర్ కమిటీ సభ్యుడు నర్సిరెడ్డి తెలిపారు.
చదవండి : తొలి గోల్ఫ్ టోర్నమెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆటా
Comments
Please login to add a commentAdd a comment