డల్లాస్ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో డల్లాస్ లో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను అమెరికా వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ఆటా ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
ప్లానోలోని మినర్వా బాంకెట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. మహిళలందరూ కలిసి దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిజియో థెరపీ డాక్లర్లు, డెంటల్ డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకురాళ్లు, అధ్యాపకులు అతిథులకు విలువైన సూచనలు అందించారు. మహిళా మేధావుల ప్రసంగాలతో మాధవి లోకిరెడ్డి, మాధవి సుంకిరెడ్డిలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. హిమబిందురెడ్డి, డా.రూపా వేములపల్లి, డా.మాధవి గడ్డం, డా. రజనీ నల్లా, డా. సరితా దొడ్ల, డా.శ్రీలత గుర్రం, డా. కవిత సగ్గెం, డా. సంజీతా అల్లె, డా. శిల్పా మాదాడి, గీతా దమన్నా, కవితా ఆకుల, సీపీఏ లక్ష్మీ తుమ్మల, సంధ్యా పడాల(ఐటీ ఎగ్జిక్యూటివ్, వ్యాపారవేత్త), అను రామ్ కుమార్, ఉమా దేవి రెడ్డి, శ్రీ వేణి వెదిరేలు కార్యక్రమానికి హాజరైన మహిళలకు విలువైన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యువతులు డ్యాన్సులు, పాటలతో అతిథులను అలరించారు. మధుమతి వైశ్యరాజు, దీప్తీ, అనురాధ, రోజా ఆడెపులు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఫన్ ఆసియా సీఈఓ శభ్నం మోడ్గిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిలోహితా కొతా, ప్రసన్న దొంగూరు, సుమన బాసిని అతిథులను సాదరంగా ఆహ్వానించారు.
కమ్యూనిటీకి చేసిన సేవలకు గానూ డా. సుధా కలావ్గుంట్ల, సంధ్యా గువ్వ, శారదా సింగిరెడ్డి, రాజేశ్వరి ఉదయగిరి, క్రిష్ణవేణి సీలమ్, శాంతి నూతి, త్రిప్తి దీక్షిత్(ఒమేగా ట్రావెల్స్ సీఈఓ)లను ఘనంగా సన్మానించారు.
ఆటా మాజీ ప్రెసిడెంట్, సామాజిక కార్యకర్త సంధ్యా గవ్వ ఈ కార్యక్రమ రూపకల్పన చేయగా, రామ్ అన్నాడీ, అశోక్ కొండాలా, మహేందర్ ఘనపురం, రాజ్ ఆకుల, సతీష్ రెడ్డి, అనంత్ పజ్జూరు, అరవింద్ రెడ్డి ముప్పిడి, అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, సుధాకర్ కలసాని, చంద్ర పోలీస్, అశోక్ పొద్దుటూరి, అశ్విన్ చక్రబోర్తి, ఫణీదర్ రెడ్డి, వెంకట్ ముసుకు, దామోదర్ ఆకుల, ఇంద్రాణి పంచెరుపుల, రూప కన్నయ్యగరిల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
డల్లాస్లో ఘనంగా 'ఆటా' మహిళా దినోత్సవం
Published Fri, Mar 31 2017 12:55 PM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM
Advertisement
Advertisement