ఫ్లోరిడాలో ఘనంగా మహిళా దినోత్సవం | ATA celebrates womens day in florida | Sakshi
Sakshi News home page

ఫ్లోరిడాలో ఘనంగా మహిళా దినోత్సవం

Published Sat, Apr 22 2017 9:45 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

ATA celebrates womens day in florida


 ఫ్లోరిడా :

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) , జాక్సన్విల్లే తెలుగు సంఘం ఆధ్వర్యంలో జాక్సన్విల్లే, ఫ్లోరిడాలో ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమం ఆధ్యంతం నృత్యాలు, పాటలు, చిన్న పిల్లలఫ్యాషన్ షో,  యువతుల ఫ్యాషన్ షోలతో ఎంతగానో వీక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మహిళా వక్తలు ప్రసంగించారు.


మహిళా సమాజాన్ని ఉత్తేజపరుస్తూ, ఆలోచింపచేస్తూ సాగిన మహిళా బృంద చర్చా కార్యక్రమం ప్రధాన  ఆకర్షణగా నిలిచింది. ఆటా ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి పిల్లలకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.


 ఈ కార్యక్రమ రూపకల్పనతో పాటు, విజయవంతం చేయడంలో జాక్సన్విల్లే ఆటా సభ్యులు తమ వంతు కృషి చేశారు. ఇతర తెలుగు సంఘాలు టీడీఎఫ్, తానా, నాటా , నాట్స్, టాటా కూడా తమ సహాయ సహకారాలు అందించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement