అట్లాంటా :
అమెరికాలోని అన్ని ముఖ్య నగరాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలని అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఘనంగా నిర్వహిస్తోంది. మార్చి 19న అట్లాంటాలో నిర్వహించిన మహిళా దినోత్సవ సంబురాలకు ముఖ్య అథితిగా ఫోర్సిత్ కౌంటీ బోర్డ్ కమిషనర్ సిండి జోన్స్ మిల్స్, డా.సుజాత రెడ్డి, డా.ఆనంద మాధురి, డా.మాధురి నముదురి, ప్రత్యేక అథితిగా భారతీ రత్నం హాజరయ్యారు. ఆటా మహిళా బృందం వీరిని ఘనంగా సన్మానించింది.
అట్లాంటా మెట్రొ ప్రాంతంలో నివాసముంటున్న దాదాపు 300లకు పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళల పాటలు, నృత్యాలు అక్కడికొచ్చిన వారందరిలో ఉత్సాహాన్ని నింపాయి. ఆటా మహిళా ప్రతినిధులు శ్రీమతి అరుంధతి కోడురు, స్వప్న పాశం, లక్ష్మి నరం రెడ్డి, అనుపమ సుబ్బగారి, ఉదయ ఏటూరు, శ్రావణి రాచకుల్లలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వక్తలు మాట్లాడుతూ, సమాజంలో మహిళల ప్రాధాన్యత, అనుసరించాల్సిన కార్యాచరణ విషయాలను వివరించారు. మహిళలు తమ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలని, వీలైతే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని పిలుపునిచ్చారు. మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరమని, అదే వారి పిల్లలను సమాజానికి ఉపయోగపడేట్టు తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరూ సామాజిక కార్యక్రమాల్లొ పాల్గొని, ఎంతో కొంత సమాజానికి మంచి జరిగేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
చివరగా అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీ కరుణాకర్ ఏసిరెడ్డి, ట్రెజరర్ కిరణ్ పాశం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు రీజినల్ కోఆర్డినేటర్ శివకుమార్ రామడ్గు, ప్రశాంత్ ప్రొద్దుటూరులతో పాటూ మిగతా మహిళా ప్రతినిధులని అభినందించారు. ఆటా తరఫున ప్రశాంతి ఏసిరెడ్డి, విక్రం సుదిని, వేణు పిస్కె, ఉమేష్ ముత్యాల, శ్రీధర్ తిరుపతి, ప్రషీల్ గుకంటి, సాయి గొర్రపటి, రమన ఉప్పిరి, తిరుమల్ పిట్ట, అరుణ్ కట్పల్లి, వెంకట్ వీరనేని, సురేష్ వోలం, నంద చాట్లలు ఈ కార్యక్రమాన హాజరైన మహిళలందరికి ధన్యవాదాలు తెలిపారు.
అట్లాంటాలో అట్టహాసంగా మహిళా దినోత్సవ సంబురాలు
Published Thu, Mar 23 2017 6:07 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
Advertisement
Advertisement