డల్లాస్ : మే 31, జూన్ 1, 2వ తేదీల్లో డల్లాస్ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. టెక్సాస్‌లో కొప్పెల్‌లోని ఫోర్ పాయింట్స్ షెరాటన్ బాంక్వెట్‌లో విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 300 మంది హాజరయ్యారు. స్థానిక కమ్యునిటీ నాయకులు, వ్యాపారస్తులు, మద్దతుదారులు 5లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చారు.
మన సంస్కృతిని ప్రచారం చేయడంతో పాటూ స్నేహితులు, కుటుంబసభ్యులు ఆహ్లాద వాతావరణంలో ఒక్కచోట కలిసి గడిపేలా అమెరికన్ తెలుగు కన్వెన్షన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ కళలు, క్లాసికల్ డ్యాన్సులు, కవిత్వం వంటివాటిని ప్రోత్సహించడానికి అమెరికన్ తెలుగు కన్వెన్షన్ తోడ్పాటును అందిస్తుందన్నారు. మెగా కన్వెన్షన్‌ని విజయవంతంగా నిర్వహించడానికి 36 కమిటీలు అహర్నిశలు కృషి చేస్తున్నాయన్నారు.
ఆటా అధ్యక్షులు డా. కరుణాకర్ ఆసిరెడ్డి, టాటా అధ్యక్షులు డా. హరినాథ్ పొలిచెర్ల, అజయ్ రెడ్డి, అరవింద్ ముప్పిడి, భరత్ మాదాడి, ధీరజ్ ఆకుల, జ్యోతి రెడ్డి, కిరణ్ రెడ్డి పాశం, మోహన్ పటోళ్ల, రఘువీర్ బండారు, మహేష్ ఆదిభట్ల, సతీష్‌రెడ్డి, శ్రీనివాస్ ఆనుగు, విక్రం జనగాంలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హన్మంత రెడ్డి, పైళ్ల మల్లారెడ్డి, డా. విజయపాల్ రెడ్డి, డా. హరనాథ్ పొలిచెర్ల, డా. సంధ్యా గవ్వ, శ్రీనివాస్ పిన్నపురెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment