రాయికల్ : అమెరికా తెలంగాణ సంఘం (ఆటా) ఆధ్వర్యంలో డెట్రాయిట్ నగరంలో నిర్వహిస్తున్న ప్రథమ తెలంగాణ మహాసభలు సోమవారం ముగిశాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట నుంచి లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం కోసం అర్చకులను ప్రత్యేకంగా అమెరికాకు ఆహ్వానించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డితోపాటు అమెరికాలోని వివిధ స్టేట్‌లకు చెందిన సుమారు మూడు వేల మంది తెలంగాణ వాదులు సతీసమేతంగా హాజరైనట్లు నిర్వాహకులు సాక్షికి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొండా రాంమోహన్, అయిత నాగేందర్, వినోద్, కుమార్, మాదవరం కరుణాకర్ పాల్గొన్నారు.
'ఆటా'లో లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
Published Mon, Jul 11 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement
Advertisement