బీజింగ్: రెండో ప్రపంచ మార్క్సిజం సదస్సును 2018, మే 5–6 తేదీల్లో చైనాలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా మార్క్సిజం పరిశోధకులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహక బోర్డ్ చీఫ్ గు హైలియాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కారల్‌మార్క్స్ 200వ జయంతి ఉత్సవాలతో పాటు చైనాలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశంలో 21 శతాబ్దంలో మార్క్సిజం, చైనాలో దాని అభివృద్ధిపై చర్చిస్తాం’ అని తెలిపారు.
ఇందులో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆధునీకరణకు చైనా తరహా పరిష్కారంతో పాటు పలు అంశాలను చర్చిస్తామన్నారు. చైనా యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను అత్యున్నత నేతగా నిలబెట్టేందుకు కమ్యూనిస్ట్ పార్టీ చైనా కాంగ్రెస్ సమావేశాల్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాగా, జిన్‌పింగ్ రాజకీయ విధానాల్ని స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment