కోలీవుడ్ సంచలన నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన, ప్రస్తుతం పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. వాస్తవంగా 'ఇండియా జననాయక పులిగళ్ పార్టీ'ని స్థాపించి అయన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమ్మతి లేకుండా ఏఐఏడీఎమ్‌కే పార్టీతో పొత్తుకు ప్రయత్నించడం వల్ల మన్సూర్‌ను ఆ పార్టీ నుంచి తొలగించారు. దీంతో ఈసారి వేలూరు లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ అక్కడి ప్రజలకు సాయం చేస్తూ మన్సూర్ అలీఖాన్ విభిన్నంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఆయన వెంట ఉన్న వాలంటీర్లు మన్సూర్ అలీఖాన్‌ను గుడియాతం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. కానీ అతని సమస్య గురించి సమాచారం ఇంకా విడుదల కాలేదు.
గతంలో నుంచే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా మన్సూర్ అలీఖాన్ వాటిన లెక్కచేయకుండా ప్రజల సమస్యలపై గళం విప్పుతున్నారు. అయితే మన్సూర్ అలీఖాన్‌కు ఏమైందని అభిమానులు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment