Keeda Cola Movie Actor Harikanth Passed Away Due To Cardiac Arrest - Sakshi
Sakshi News home page

Actor Harikanth Death: 'కీడాకోలా' సినిమా నటుడు హఠాన్మరణం

Published Sat, Jul 1 2023 11:41 AM | Last Updated on Sat, Jul 1 2023 12:49 PM

Keeda Cola Movie Actor Harikanth Passed Away - Sakshi

అతడు థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సినిమాల్లోకి వచ్చాడు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'కీడా కోలా' సినిమాతో బిజీగా ఉన్నాడు. 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ తీస్తున్న ఈ మూవీ టీజర్, రెండు రోజుల ముందు విడుదలైంది. ఇందులోనూ కీలకపాత్రలో నటించాడు. ఇప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు.

నటుడు హరికాంత్.. స్వతహాగా థియేటర్ ఆర్టిస్టు. అలా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో వచ్చాడు. ప్రస్తుతం 'కీడా కోలా'లో ఓ పాత్ర చేస్తున్నాడు. టీజర్ లో అతడికి సంబంధించిన షాట్ మీరు చూడొచ్చు. శనివారం ఉదయం అతడికి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని తెలుగు సినిమా పీఆర్ఓ ఒకరు ట్వీట్ చేశారు. ఈ క‍్రమంలోనే అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నటీనటులు కోరుకుంటున్నారు.

(ఇదీ చదవండి: సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement