బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, సాయికృష్ణ
‘‘నేను, దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా వేర్వేరు చోట్ల పెరిగాం. మా నేపథ్యాలు వేరు.. మమ్మల్ని సినిమా కలిపింది. ‘పెళ్ళి చూపులు’తో నన్ను హీరోగా పరిచయం చేశాడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’తో కొందరు కొత్తవాళ్లకు కెరీర్ ఇచ్చాడు. ఇప్పుడు ‘కీడా కోలా’లోనూ ప్రతిభ ఉన్న కొత్తవాళ్లు కనిపిస్తున్నారు. తరుణ్‌కి తనపై, తన కథలపై చాలా నమ్మకం. ఈ విషయంలో అతన్ని గౌరవిస్తాను.
ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం తను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. రానా సమర్పణలో కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీనాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘తరుణ్ భాస్కర్‌పై ఉన్న నమ్మకంతో చెబుతున్నా.. ‘కీడా కోలా’ మజా ఇస్తుంది.
తర్వలో మా ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది’’ అన్నారు. సీనియర్ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘డైరెక్టర్ జంధ్యాలగారి సినిమాలు చేస్తున్నప్పుడు వినోదం ఎంత హాయిగా పండిందో మళ్లీ ‘కీడా కోలా’కి అలాంటి అనుభూతి కలిగింది’’ అన్నారు. ‘‘నా ‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల విడుదలప్పుడు చిన్న భయం ఉండేది. ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు థియేటర్ బయటే తిరిగేవాడిని. ‘కీడా కోలా’ విషయంలో ఆ భయం లేదు’’ అన్నారు తరుణ్ భాస్కర్. ‘‘రెండు గంటల ΄ాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు నిర్మాతలు సాయికృష్ణ గద్వాల్, శ్రీ΄ాద్.
Comments
Please login to add a commentAdd a comment